బెంగాల్ టైగర్

December 09, 2015 | 03:14 PM | 5 Views
బెంగాల్ టైగర్
Movie Facebook Page :
Movie Name :
బెంగాల్ టైగర్
Friday Release Date :
2015-12-10
Actors/Actress/Director :

ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశీఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్రహ్మనందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్షవ‌ర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ప్రభ‌, ర‌మాప్రభ తదిత‌రులు

ఆర్ట్‌: డివై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్ -ల‌క్ష్మ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: భీమ్స్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం: సంంప‌త్‌నంది

 

Synopsis :

మాస్ రాజా మరోసారి తన రెగ్యులర్ ఫార్ములా ఎంటర్ టైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బెంగాల్ టైగర్. పవన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు ఇక కెరీర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అంటూ దర్శకుడు సంపత్ నందిని ఆకాశానికెత్తేశారు. అయితే ఆ అవకాశం తప్పిపోవటంతోపాటు కెరీర్ డైలామాలో ఉన్న సమయంలో పిలిచి మరీ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు రవితేజ. ఇక కిక్ 2 అనే ఒక్క సినిమాతో మాస్ మహరాజా మార్కెట్ గల్లంతయిపోయింది. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు.

ఇక రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, బబ్లీ గర్ల్ రాశిఖన్నా జోడీ కట్టారు. పాటల్లో వీరి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉందో ఇది వరకే రిలీజైన ట్రైలర్ లో మనం చూశాం. రాశిఖన్నా అయితే ఓ మెట్టు పైఎక్కి బికినీ వేసిందని సమాచారం. సో... గ్లామర్ పరంగా ఏ లోటు లేదని తెలుస్తోంది. ఇక కామెడీ పరంగా అమలాపాల్ గా బ్రహ్మీ, ప్యూఛర్ స్టార్ సిద్ధప్పగా థర్టీ ఇయర్స్ పృథ్వీ, సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని తదితరులు ఉన్నారు. పక్కా యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం (డిసెంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రవితేజతోపాటు రాశిఖన్నా, ముఖ్యంగా సంపత్ నంది కెరీర్ కు కీలకమైన ఈ చిత్రం ఏ మేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.     

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు