చీకటి రాజ్యం

November 20, 2015 | 11:26 AM | 0 Views
చీకటి రాజ్యం
Movie Facebook Page :
Movie Name :
చీకటి రాజ్యం
Friday Release Date :
2015-11-20
Actors/Actress/Director :

కమల్ హాసన్, త్రిష, ఆశా శరత్, మధుషాలిని, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు

మ్యూజిక్ : జిబ్రాన్, నిర్మాత: చంద్రహాసన్, దర్శకత్వం: రాజేశ్ ఎం సెల్వ

Synopsis :

కమల్ హాసన్ ఈ పేరు వింటేనే వైవిధ్యభరితమైన సినిమాలు గుర్తుకొస్తాయి. వయసు పై బడుతున్న ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పటికప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారాయన. అయితే తెలుగులో ఆయన నేరుగా చిత్రాలు చేసి చాలా రోజులైంది. ఆ మధ్య ఈనాడు చిత్రం తర్వాత వచ్చిన ఆయన ఇప్పుడు తిరిగి చీకటి రాజ్యంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కమల్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన రాజేశ్ ఎం సెల్వ దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ్ లో తుంగవనంగా దీపావళికి వచ్చిన ఆ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులో ఓ పదిరోజులు ఆలస్యంగా ఈ శుక్రవారం (20-11-2015) ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ అండర్ కవర్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, కిషోర్, మధుషాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కరోజు రాత్రి జరిగే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియా నేపథ్యం ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కిందట. చూద్దాం. మరీ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో...

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు