సైజ్ జీరో

November 26, 2015 | 02:54 PM | 0 Views
సైజ్ జీరో
Movie Facebook Page :
Movie Name :
సైజ్ జీరో
Friday Release Date :
2015-11-27
Actors/Actress/Director :

అనుష్క, ఆర్య, గొల్లపూడి మారుతిరావు, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ మాస్టర్ భరత్, తదితరులు

కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఆనంద్ సాయి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, సంగీతం: యం.యం.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

Synopsis :

భారీ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన మరో భారీ చిత్రం ‘సైజ్ జీరో'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో విలక్షణమైన నటి అనుష్క నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒకేసారి తమిళ్, తెలుగు బాషలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమిళ యువహీరో ఆర్య హీరోగా, సోనాల్ చౌహాన్, ఊర్వశి, గొల్లపూడి మారుతి రావు, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రం నవంబర్ 27న అంటే ఈ శుక్రవారం మన ముందుకు రానుంది.

ఒబెసిటీ తో బాధపడే అమ్మాయి పెళ్లికి సంబంధించి అనే ఓ విన్నూతమైన సబ్జెక్ట్ కి, కామెడీ జోడించి పక్కా కమర్షియల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రకాశ్. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి అందించిన ఆడియో ఇప్పటికే మంచి స్పందన రాబట్టింది. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించటంతో యూనిట్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క కష్టం తెరమీద చూడాలంటే ఇంకోక రోజు ఆగాల్సిందే. రివ్యూ కోసం నీహార్ ఆన్ లైన్ చూస్తూ ఉండండి.

Post Your Comment

కూడా చూడండి

goldnsilver

తాజా వార్తలు