బందిపోటు: దొంగలను దోచుకో

February 20, 2015 | 03:13 PM | 45 Views
Rating :
బందిపోటు: దొంగలను దోచుకో

నటీనటులు : అల్లరి నరేష్, ఈషా, తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సంపూర్ణేష్ బాబు, శ్రీనివాస్ అవసరాల, చంద్రమోహన్, షాయాజీ షిండే, సప్తగిరి, శుభలేఖ సుధాకర్ తదితరులు

సాంకేతిక వర్గం :

సంభాషణలు- ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల, సినిమాటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: కళ్యాణి మాలిక్, నిర్మాతలు: ఈదర రాజేష్, ఈదర నరేష్(ఇవీవీ బ్యానర్), కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి

కామెడీ రారాజుగా చెలామణి అవుతున్న అల్లరి నరేష్ కి సుడిగాడు తర్వాత సరైన హిట్ లేదని చెప్పాలి. ఆ మధ్య బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వచ్చిన అది అంతంత మాత్రంగానే ఆడిందని చెప్పాలి. నిర్మాత ఆర్యన్ రాజేష్. హీరోగా ఎలాగూ సక్సెస్ కాకపోయాడు కదా, తండ్రి స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ సొంత ఈవీవీ బ్యానర్ పై నిర్మాత గా కొనసాగుదామని డిసైడ్ అయ్యి మొదటిసారి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహన క్రుష్ణ   అష్టాచెమ్మా, గోల్కోండ హైస్కూల్, అంతకు ముందు ఆ తర్వాత చిత్రాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ముగ్గురికి కచ్ఛితంగా హిట్ అవసరం. బందిపోటుతో వీరు ప్రేక్షకుల మనసులను దోచుకోవటంతోపాటు సక్సెస్ అయ్యారా? చూద్దాం...

కథ :

అనాథ అయిన విశ్వనాథ్ అలియాస్ విశ్వ(అల్లరి నరేష్) మోసాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు. అలా సాగుతున్న అతనికి జీవితంలోకి సడన్ గా ప్రవేశిస్తుంది జాహ్నవి(ఈషా). తనకు తెలికుండానే హీరోను ఫాలో అవుతు మోసాలన్నింటిని వీడియో తీస్తుంది. ఓ చిట్ ఫండ్ కంపెనీలో ఆడిటర్ గా పనిచేసిన తన తండ్రికి(శుభలేఖ సుధాకర్) ఆ కంపెనీ యాజమానులైన (తనికెళ్ల భరణి, రావు రమేష్. పోసాని) చేసిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాలని కోరుతుంది. దానికి విశ్వ ఒప్పుకుని ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి ఆమె పగను తీరుస్తాడు. దీనికి అతడి స్నేహితుడు తెల్లబ్బాయి(సంపూ) సాయం తీసుకుంటాడు. అసలు ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి. విశ్వ ఎందుకు ఫ్రీగా ఆమె పగలో భాగం పంచుకున్నాడు. అందుకోసం ఏం చేశాడన్నది కథ.

ఫ్లస్ పాయింట్లు:

తనదైన మార్క్ కామెడీతో నాటుకుపోయిన నరేష్ ఈ చిత్రంలో కూడా నటనను పండించేశాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ పెద్దగా లేకపోవటంతో అతనికి ఇంకా ఫ్లస్ అయ్యింది. ఇక హీరోయిన్ విషయానికోస్తే ఈషా తన పరిధి మేరకు నటించేసింది. స్వతహాగా తెలుగమ్మాయి కావటంతో పెద్దగా ఎక్స్ పోజింగ్ లేకుండా కానిచ్చేసింది. ఇక మకరంద్, శేషగిరి, భలే బాబు పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసానిలు ఎవరికి వారు వీక్ నెస్ లు ఉన్న క్యారెక్టర్లలో జీవించారు. ఇక మిగతా నటీనటుల్లో హీరో ఫ్రెండ్ గా సంపూ, పర్వతాలు పాత్రలో చంద్రమోహన్, సీఎంగా షాయాజీ షిండే, రిపోర్టర్ గా సప్తగిరిలు ఓకే అనిపించారు. పెద్దగా విషయం లేనప్పటికీ సిచ్యూయేషన్ పరంగా కొన్ని కొన్ని డైలాగులు అలరిస్తాయి. విందా కెమెరా పనితనం బాగుంది.

మైనస్ పాయింట్లు :

హీరో మోసాలు చేసుకుంటూ ఉండటం, దాన్ని చూసి హీరోయిన్ అతన్ని హెల్ప్ చేయమని అడగటం, ఫ్లాష్ బ్యాక్ కు కరిగిపోయే హీరో, రీవెంజ్ డ్రామా ఇవన్నీ పాత సినిమాల్లో లాగా అనిపిస్తుంది. పైగా నరేష్ కి ఇలాంటి రోల్స్ కొత్తవేం కాదు. గత చిత్రాల్లో కూడా విలన్లను వెర్రిపూసలను చేసినట్లే ఇందులోనూ ఉంటుంది. దీంతో ఏదో తెలిసిన చిత్రాన్నే చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక స్టోరీలో ట్విస్ట్ లు పెద్దగా లేకపోవటం, ఏదో సాధారణ సినిమాగా సాగిపోవటం కూడా ఈ చిత్రానికి అదనపు మైనస్ లు. సంగీతం విషయానికోస్తే వీడియో కన్నా ఆడియోనే మేలు అనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా పెద్దగా పనిచెప్పలేదు. అంతకు ముందులో బాగా నటించిన ఈషాను ఇందులో దర్శకుడు పెద్దగా వాడుకోలేదు. అసలు సెకండాఫ్ లో హీరోయిన్ పెద్దగా కనిపించదు. మంచి కమెడియన్లైన సంపూ, సప్తగిరిలను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఇందులో నటించిన శుభలేఖ సుధాకర్ పాత్ర పెద్దగా గుర్తుండదు. శ్రద్ధాదాస్ ఐటెంసాంగ్ ఎందుకూ పనికిరాదు. అల్లరి నరేష్ రెగ్యులర్ ఫార్మట్ చిత్రాలను ఫాలో అయ్యి అదే పంథాను ఇందులోనూ చూపించాడు. దీంతో ఏ మాత్రం పండలేదు కదా వికటించినట్టు అనిపించకమానదు.

చివరగా :

పాత చింతకాయ పచ్చడితో ఫుల్ మీల్స్ కానిచ్చేద్దామనున్న దర్శకుడి ఆలోచన ప్రేక్షకులకు రుచించదనే చెప్పాలి. ఢిపరెంట్ కాన్సెప్ట్ లతో గత చిత్రాలతో అలరించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రంతో మాత్రం దారుణంగా తడబడ్డాడు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలవటం కాస్త అనుమానమే.

చివరగా... అల్లరి నరేష్ ను ఆదరించే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తప్ప మిగతా వర్గాలకు ఈ చిత్రం కచ్ఛితంగా నచ్చదనే చెప్పవచ్చు. ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఈ చిత్రానికి మునుముందు కష్టకాలమే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు