చక్కిలిగింత

December 06, 2014 | 03:23 PM | 29 Views
Rating :
చక్కిలిగింత

నటీనటులు : సుమంత్ అశ్విన్, రెహన, వైవా హర్ష, తాగుబోతు రమేష్, సప్తగిరి, చమ్మక్ చంద్ర తదితరులు

సాంకేతిక వర్గం :

సంభాషణలు: జయంత్ పానుగంటి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరాం, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాతలు: నర్సింహా రెడ్డి, చారి దర్శకుడు: వేమారెడ్డి(తొలిపరిచయం)

వరుసగా రెండు హిట్లు (అంతకు ముందు ఆ తరువాత, లవర్స్) అందుకున్న సుమంత్ అశ్విన్ హీరోయిన్ గా నటించిన మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘చక్కిలిగింత’. ఈ చిత్రం ద్వారా సుకుమార్ ఫ్రెండ్ వేమా రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో సుమంత్ అశ్విన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం...

కథ :

హైదరాబాద్ ఎం.ఐ.టి కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చదివే ఆది(సుమంత్ అశ్విన్) కి ప్రేమంటే మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ అమ్మాయిలు ఎందుకు ప్రపోజ్ చేయరని ఆలోచించే మనస్తత్వం ఉన్న కుర్రాడు. ఈ పైత్యంతోనే తన ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ లవర్స్ కి దూరం అయ్యేలా చేస్తాడు. కట్ చేస్తే అప్పుడే ఆది క్లాస్ లో అవంతిక(రెహన) చేరుతుంది. అక్కడి సమస్యను తెలుసుకున్న అవంతిక ఆదికి వ్యతిరేకంగా ఒక మిషన్ మొదలు పెడుతుంది. అదేంటంటే అమ్మాయిలంటేనే అసలు పడని ఆడిని అవంతిక ప్రేమలో పడేసి తనతోనే ఐ లవ్ యు చెప్పించేలా చెయ్యడం. మరి ఈ మిషన్ లో అవంతిక సక్సెస్ అయ్యిందా.? ఒకవేళ సక్సెస్ అయితే ఆది ఎందుర్కున్న ఇబ్బందులేమిటి.? ఇవన్నీ కాకుండా ఆది ముందే అవంతిక ప్లాన్ తెలుసుకొని రివర్స్ గేమ్ ఏమన్నా ప్లే చేసాడా.? అన్నది కథలో ఉన్న సస్పెన్స్.

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో సుమంత్ అశ్విన్ గురించి. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో సుమంత్ అశ్విన్ నుంచి నటనను దర్శకుడు రాబట్టుకోగలిగాడు. డాన్స్ లో కూడా బాగానే చేశాడు. రెహనా లుక్స్ పరంగా బాగున్నప్పటికీ యాక్టింగ్ స్కోప్ తక్కువనే చెప్పాలి. డాన్సులు మాత్రం బాగా చేసింది. ఈ సినిమాలో హైలట్ అయ్యింది అంటే అది వైవా హర్షే. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వైవా హర్ష మరో కమెడియన్ తాగుబోతు రమేష్ తో కలిసి బాగా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో గెస్ట్ పాత్రల్లో వచ్చే సప్తగిరి, జబర్దస్త్ చంద్ర ఉండేది రెండు నిమిషాలే అయినా థియేటర్లలో గోల గోల చేయించారు. జయంత్ పానుగంటి సంభాషణలు నీట్ గా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవల్సింది కెమెరామెన్ సాయి శ్రీరాం తన పనితనంతో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చునేలా చేశాడు. ప్రతీ ఫ్రేమ్ ను ఫ్రెష్ గా ఫీలయ్యేలాచేశాడు. మిక్కిజే.మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

మైనస్ పాయింట్లు :

మంచి పాయింట్ ను దొరకబుచ్చుకున్నప్పటికీ దానిని ప్రజెంట్ చేయడంలో డైరక్టర్ సుకుమార్ స్నేహితుడైన వేమారెడ్డి తొలి ప్రయత్నంలోనే ఫేలయ్యాడనే చెప్పాలి. ఓ క్రేజీ పాయింట్ ను ముఖ్యంశంగా ప్రారంభించిన డైరక్టర్ తొలి 30 నిమిషాల్లోనే దానిని మెయింటెన్ చేసి తర్వాత దానిని పక్కన పడేసి ట్రాక్ ను ఎక్కడికో తీసుకెళ్తాడు. ఆఖర్లో వేరే పాయింట్ తో ముగించేశాడు. దీంతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీలవుతారు. హీరోయిన్ ను బేస్ చేసుకుని కథ రాసినప్పుడు అందమే కాదు అభినయం ఉన్న హీరోయిన్ ను కూడా ఎంపిక చేసుకొని ఉండాల్సింది. అంతేకాదు స్టోరీ లెన్త్ కూడా మరీ ఎక్కువ కావడంతో అడియోన్స్ కు చిరాకు పుడుతుంది. ప్రేమ అంటే పడని హీరో సిల్లీ రీజన్ కే లవ్ లో పడిపోవటం కూడా రుచించదు. సెకండాఫ్ పరమబోరింగ్ గా సాగుతుంటే మధ్యలో వచ్చే పాటలు మరింత ఇబ్బంది పెడతాయి. కమెడియన్లను కూడా దర్శకుడు ఫుల్ గా వాడుకోలేకపోయాడు. మిక్కిజే.మేయర్ సంగీతం లోని పాటలేనా అని అనిపిస్తాయి.

చివరగా :

హ్యాట్రిక్ హిట్ కోసం ట్రై చేసిన సుమంత్ అశ్విన్ కోరికకు ‘చక్కిలిగింత’ బ్రేక్ వేసిందనే చెప్పాలి. సరికొత్త పాయింట్ తో ప్రేక్షకులకు పరిచయం అవ్వాలనుకున్న దర్శకుడు వేమారెడ్డి చివరకు సరైన వివరణ ఇవ్వకుండానే కథను ముగించేశాడు. ఫస్ట్ హాఫ్, సుమంత్ అశ్విన్ పెర్ఫార్మన్స్, గ్రాండ్ విజువల్స్ తప్ప ఈ సినిమాకి హెల్ప్ అయ్యే అంశాలు ఏమీ లేవు.

చివరగా ‘చక్కిలిగింత’ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టి నవ్వించకపోగా చిరాకు పుట్టిస్తుంది.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు