నటీనటులు : దర్శన్ అపూర్వ, కృష్ణ ప్రకాష్,చందూర్, పల్లవి, విజయ్, తనూజ తదితరులు
సాంకేతిక వర్గం :
సంగీతం- శేఖర్ చంద్ర, బ్యానర్- గుడ్ సినిమా గ్రూప్, శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్, నిర్మాత-గుడ్ సినిమా గ్రూప్, దర్శకత్వం- శైలేంద్రబాబు
టాలీవుడ్ లో హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రేక్షకులు సైతం హర్రర్ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ఓ ట్రెండ్ లో మంగళూర్ సమీపంలోని అడవుల్లో జరిగిన నిజ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమాయే చిత్రమ్ కాదు నిజమ్. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. మరి ఈ రియల్ చిత్రమ్ ఏ మేర ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే...
కథ :
మంగళూరు సమీపంలోని అడవుల్లోకి ట్రెక్కింగ్ కోసమని ఆరుగురు స్నేహితులు పయనమవుతారు. అక్కడి చేరుకున్న వారిలో ఒకరు కెమెరా సహయంతో వారి జర్నీని చిత్రీకరిస్తుంటారు. అయితే వారిలో ప్రతి ఒకరు మిస్ అవుతుంటారు. వారిలో ఒకరు మాత్రం ఆ అడవి నుండి తప్పించుకుంటాడు. కెమెరా మాత్రం మిస్ అవుతుంది. చివరకి ఆ కెమెరా పోలీసుల చేతికి చిక్కుతుంది. ఆ కెమరా లో ఏముందో అనే విషయాల సమాహరమే ఈ సినిమా. ఆదేమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఫ్లస్ పాయింట్లు:
నటీనటులు కొత్తవారైనప్పటికీ చక్కగా నటించారు. అడవిలో ఆరుగురు చనిపోయే సమయంలో ఘటనలు భయపెడతాయి. సన్నివేశాలు చిత్రీకరించిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ చాలా వేగంగా సినిమా ఉంటుంది. క్లయిమాక్స్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రీఫీ, హర్రర్ సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలిచే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్లు :
సినిమా లెంగ్త్ తక్కువగా ఉండటం మంచిదే అయినా స్లో రన్నింగ్ ముఖ్యగా ఫస్టాఫ్ లో ఆకట్టుకోదు. హర్రర్ సినిమాలో ఉండాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రియల్ ఇన్సిడెంట్ లను తీసుకుని కొన్ని సీన్స్ తీయడం వల్ల ఎమోషన్స్ మిస్ అయ్యాయని చెప్పవచ్చు. థ్రిల్లింగ్ కోసం వాడాల్సిన టెక్నికల్ థింగ్స్ ను ఉపయోగించే అవకాశం తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది ట్రూ ఫుటేజ్ నుండి తీసుకున్నారా అనే డౌట్ వస్తుంది.
చివరగా :
సినిమా లెంగ్త్ తక్కువగా ఉండటం ఒక రకంగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సెంకడ్ పార్ట్ లో సినిమా చాలా వేగంగా నడుస్తుంది. సినిమా ఫస్టాఫ్ స్లోగా ఉండటం హర్రర్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. థ్రిల్లింగ్ కోసం వాడాల్సిన టెక్నికల్ థింగ్స్ ను ఉపయోగించే అవకాశం తగ్గిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది ట్రూ ఫుటేజ్ నుండి తీసుకున్నారా అనే డౌట్ వస్తుంది.
చివరగా... భయపెట్టే నిజమ్... చిత్రమ్ కాదు...
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment