దోచేయ్

April 24, 2015 | 04:27 PM | 72 Views
Rating :
దోచేయ్

నటీనటులు : నాగచైతన్య, కృతిసనన్, బ్రహ్మానందం, పొసాని కృష్ణమురళి, రవిబాబు, రావురమేష్, సత్య తదితరులు

సాంకేతిక వర్గం :

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ప్రసాద్, సంగీతం: సన్నీ ఎం.ఆర్, బ్యానర్- శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సుధీర్ వర్మ

విభిన్నమైన చిత్రాలను ఎంపికచేసుకుంటూ హిట్స్ సాధించుకుంటున్న నాగచైతన్య స్వామిరారా వంటి హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సుధీర్ వర్మతో జత కట్టాడు. ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టాలంటే తనకి అచ్చి వచ్చిన క్రైమ్ కాన్సెప్ట్ బెటర్ అనుకున్నాడేమో అదే స్టయిల్ లో క్రైమ్ కథను రాసుకున్నాడు. మరి ఈ కాంబినేషన్ లో వచ్చిన దోచేయ్ ప్రేక్షకులను ఏ మేర అలరించిందో తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే...

కథ :

ఇద్దరు దొంగలు ఓ బ్యాంక్ ను దోచుకునే సీన్ తోనే సినిమా మొదవుతుంది. సీన్ కట్ చేస్తే చంద్రు(నాగచైతన్య), తన చెల్లెలు మమతను డాక్టర్ చదువు చదివిస్తుంటాడు. అయితే తన తండ్రి మాణిక్యం(పోసాని కృష్ణమురళి) కారణంగా జైలు పాలు కావడంతో చిన్నప్పుడే దొంగగా మారి తన స్నేహితుల సహాయంతో మోసాలు చేస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మీరా(కృతిసనన్)ని చూసి ప్రేమలో పడతాడు. మీరా కూడా చంద్రుని ఇష్టపడతాడు.  తండ్రికి గుండెపోటు రావడంతో డబ్బుకోసం మరో మోసం చేసిన చంద్రుకి బ్యాంక్ రాబరీ చేసిన వారి నుండి రెండున్నర కోట్ల రూపాయలు సొమ్ము దొరుకుతుంది. అక్కడ నుండి చందు జీవితం టర్న్ తీసుకుంటుది. ఒక పక్క పోలీస్ ఆఫీసర్ రిచర్డ్(రవిబాబు) మరోపక్క మాణక్యం మనుషులు చంద్రు వెంటపడతారు. చివరికి చంద్రు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తన ప్రేమను, కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

నాగచైతన్య యాక్టివ్ గా ఫుల్ ఎనర్జీతో నటించాడు. సినిమాని అంతా తన భుజాలపై మోశాడు. తన గత చిత్రాలను పోల్చితే ఈ చిత్రంలో నటన, డ్యాన్స్ ఫైట్స్ బాగా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. కృతిసనన్ గ్లామర్ గా కనపడింది. తన పాత్రకు తగిన విధంగా నటించింది. రవిబాబు పోలీస్ ఆఫీసర్ గా చిన్న పాత్రే అయినా బాగా చేశాడు. ఒకట్రెండు మినహా సన్నీ ట్యూన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. రిచర్డ్ ఫోటోగ్రఫీ బావుంది. సీన్స్ ను ఫ్రెష్ గా చూపించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి. బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం కామెడి, విలన్ గా సందర్భోచితమైన పోసాని కామెడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

మైనస్ పాయింట్లు :

సినిమా ఫస్టాఫ్ అంతా సాంగ్స, ఏదో కామెడితో నడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్లాగ్ నుండి అసలు సినిమా స్టార్టవుతుంది. సుధీర్ వర్మ క్రైమ్ ఫార్ములాతోనే సినిమా కథను రాసుకున్నాడు అయితే కథనం విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది. సెకండాఫ్ లో అసలు కథ మొదలైనా అక్కడా సీన్స్ ను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. సెకండాఫ్ లో ఛేజ్ సీన్ దాదాపు పదినిమిషాల సేపు ఉంటుంది. అంత అవసరమా అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. సెకండాఫ్ అంతా మెయిన్ కథ ఉన్నప్పటికీ గందరగోళంగా నడుస్తుంది. క్లయిమాక్స్ లో పోసానితో పోలీస్ స్టేషన్ సీన్, కోర్టు సీన్ లో చేయించినా కామెడి ఎబ్బెట్టుగా ఉంది. ఇలాంటి సీన్స్ ను అల్రెడి చూసేయడం వల్ల అనుకున్న స్థాయిలో కామెడి పేలలేదు. సన్ని ట్యూన్స్ ఆకట్టుకోలేదు. 

 

చివరగా :

సుధీర్ వరమ్ సేఫ్ గేమ్ అడాలనుకున్నాడు. అందుకే మళ్లీ తనకు అచ్చొచ్చిన క్రైమ్ నేపథ్యంలో కథను తయారు చేసుకున్నాడు. అయితే కథనం రొటీన్ గా ఉండటం సినిమాకి ప్లస్ కాలేదు. బ్రహ్మానందం కామెడి, పోసాని కామెడి, సన్నీ బ్యాగ్రౌండ్ స్కోర్, రిచర్డ్ కెమెరావర్క్ సినిమాకి బలంగా వెన్నుదన్నుగా నిలిచాయి.

చివరగా...  రొటీన్ ఫార్ములాతో సినిమా రన్ కావడం పెద్ద మైనస్ అయింది.  అయినా ఎంటైర్ టైన్ మెంట్ గా కథ సాగిపోవటంతో సినిమాని ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు.

 

 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు