గోపాల గోపాల

January 10, 2015 | 05:20 PM | 27 Views
Rating :
గోపాల గోపాల

నటీనటులు : వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రేయా, మిథున్ చక్రవర్తి (తొలిపరిచయం), పోసాని కృష్ణ మురళి, అశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్, కృష్ణుడు, ధన్ రాజ్ తదితరులు

సాంకేతిక వర్గం :

మాటలు: సాయి మాధవ్ బుర్రా, కెమెరామెన్: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: సురేష్ బాబు, శరత్ మరార్, కథ: ఉమేష్ శుక్లా, భవేష్ మండాలియా(హిందీ మాతృక), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కిషోర్ పార్థసాని (డాలీ),

ఫస్ట్ టైం ఓ చిత్రంలో గెస్ట్ రోల్ లో పవన్ నటించడం అదికూడా దేవుడి పాత్రలో. దీంతో ఏ రేంజ్ లో హైప్ ఉంటుందో  ఊహించవచ్చు. వెంకీ ప్రధాన పాత్రధారిగా నడిచే ఈ చిత్రం బాలీవుడ్ మూడేళ్ల క్రితం వచ్చిన ఓ మై గాడ్ (2012) చిత్రానికి రీమేక్ , చిన్న చిత్రంగా వచ్చి మరీ ఇది బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరీ తెలుగులో బడా హంగులతో వచ్చిన ఈ రీమేక్ ఫార్ములా వర్కవుటయ్యిందా. చూద్దాం.

కథ :

అనగనగా గోపాలరావు (వెంకీ) అనే వ్యక్తి విగ్రహాలు అమ్మే షాపును నడుపుతుంటాడు. నాస్తికుడు అయినప్పటికీ భక్తుల మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకుంటుంటాడు. ఓ భూకంపానికి అతగాడి షాపు కూలిపోతుంది. నష్ట పరిహారం కోసం కోర్టు గడప తోక్కుతాడు. అయితే యాక్ట్ ఆఫ్ గాడ్ ( దేవుడు చేసిన పని) అని చెప్పి కోర్టు ఆ కేసును కొట్టివేస్తుంది. దీంతో అతగాడు ఓ సీనియర్ సలహా మీద ఏకంగా దేవుడి మీదే కోర్టుకెక్కుతాడు. భక్తి పేరుతో ప్రజల బలహీనలతో ఆడుకునే దొంగ స్వామీజీలను, బాబాలందరినీ న్యాయస్థానానికి లాగుతాడు. దీంతో గోపాలరావుకు, స్వామీజీలకు పెద్ద పోరాటమే జరుగుతుంది. మరీ ఈ పోరాటంలో గోపాలరావు గెలిచి నష్టపరిహారం రాబట్టగలిగాడా?... అతగాడికి భగవంతుడైన గోపాలుడు(పవన్ కళ్యాణ్) ఎలా అండగా నిలిచాడు అన్నది కథాంశం.

ఫ్లస్ పాయింట్లు:

ఈ చిత్రంలో చెప్పుకోదగిన అంశాలు రెండే. ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు విక్టరీ వెంకటేష్. పవన్ కంటే ముందు వెంకీ గురించి చెప్పుకుందాం. ఈ చిత్రంలో గోపాలరావుగా వెంకీ అద్యాంతం అలరించాడు. ఎలాంటి చెత్త చిత్రాలలోనైనా మంచి నటన కనబరిచే వెంకీ ఈ చిత్రంలో నాస్తికుడిగా అద్భుతంగా నటించాడు. మంచి కామెడీ టైమింగ్ తోపాటు సీరియస్ సన్నివేశాలలో కూడా తన నటన ప్రావీణ్యాన్ని చూపాడు. ఈగోలను పక్కనబెట్టి మరో మల్టీస్టారర్ మూవీతో జనాల్ని మరోసారి ఇంప్రెస్ చేశాడు వెంకీ, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్. దేవుడి పాత్రలో పవన్ ఎంట్రీ దగ్గరి నుంచి సినిమా మలుపు తిరుగుతుంది. గోపాలుడి పాత్రలో పవన్ తమ మేనరిజాన్ని పక్కనపెట్టి సింపుల్ గా నటించి అలరించాడు. తెరపై పవన్ స్ర్కీనింగ్ అదిరిపోతుంది. జయనన్ విన్సెంట్ కెమెరాపనితనం బావుంది. ఆర్భాటాలకు పోకుండా అందంగా చూపించాడు. సాయి మాధవ్ సంభాషణలు గుర్తుండిపోతాయి. దైవంగా పవన్ చేత పలికించిన పలుకులు పంచ్ లుగా ఉంటాయి . చిత్రంలో ముఖ్యంగా కోర్టులో జరిగే సన్నివేశాలలో వెంకీ డైలాగులకు విజిల్స్ పడతాయి. అనూప్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ముఖ్యంగా భజే భజే సాంగ్ చిత్రానికే హైలెట్. ఇక మిగతా నటీనటుల్లో చెప్పుకోదగ్గది పోసాని యే. దొంగబాబాగా కడుపుబ్బా నవ్వించాడు. వెన్నెల కిషోర్ ఫర్వాలేదు.

మైనస్ పాయింట్లు :

కథాంశం హిందీ రీమేక్ కావటంతో కొన్ని చోట్ల ఆ ప్రభావం క్లియర్ గా కనిపిస్తుంది. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీద్దామని ఎంత ప్రయత్నించినప్పటికీ దర్శకుడు డాలీ అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్లు మిస్సయ్యాడు. వెంకీ తన కామెడీతో అలరించినప్పటికీ ఫస్టాఫ్ స్లోగా సాగుతూ ఉంటుంది. ఇక సెకాండాఫ్ లో పవన్ వచ్చినప్పటి నుంచి కథ ఆసక్తిగా సాగుతున్నప్పటికీ అక్కడకూడా సాగదీత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రేయా పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. మిథున్ చక్రవర్తి హిందీలో లాగానే నటించాడు. హిజ్రాలా కొన్ని సన్నివేశాల్లో మిథున్ నటన బాగా ఇరిటేషన్ తెప్పిస్తుంది. దర్శకుడు డాలీ కొన్ని సన్నివేశాలను సరిగ్గా మలచలేకపోయాడు. మంచి సందేశం, బడా స్టార్ లు ఉన్న చిత్రాన్ని ప్రజెంట్ చేయటంలో డాలీ కొంచెం తడబడినట్లు కనిపిస్తుంది.

చివరగా :

ఈ చిత్రానికి వెంకీ, పవన్ లు ఎంత బలమో. ఈ చిత్రానికి పవన్ అంతే మైనస్ అన్నది అక్షర సత్యం. ఎందుకంటే పవన్ ని ఈ స్థాయిలో ఫ్యాన్స్ అస్సులు ఊహించుకోలేరు. తన స్టైల్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే పవన్ ఈ చిత్రంలో సాదాసీదాగా కనిపించడం పట్ల పైకి చెప్పకపోయినప్పటికీ ఫ్యాన్స్ కాస్త అసంత్రుప్తితో ఉన్నారు. కానీ, ఆ పాత్రలో పవన్ నటనకు వందకు వంద శాతం మార్కులు పడతాయి. ఇక స్టోరీ పరంగా రీమేక్ కావటంతో ఇప్పటికే ఓ మై గాడ్ చిత్రాన్ని చూసినవాళ్లకి ఈ చిత్రం యావరేజ్ గా అనిపిస్తుంది. కానీ, మాత్రుక చూడని వాళ్లకి బాగానే తోస్తుంది. 20 నిమిషాల నిడివి ఉన్న అక్షయ్ కుమార్ పాత్రను పవన్ క్రేజ్ ను పరిగణలోకి తీసుకోని 50 నిమిషాలు చేయటంలో దర్శకుడి తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే. కానీ, స్లోగా సాగే కథాంశం, పాత్రలను పూర్తి స్థాయిలో వాడుకోవటంలో దర్శకుడు ఫేలయ్యాడు. చివరగా, వెంకీ ఎంటర్ టైనింగ్, సాదాసీదా పవన్ ని చూడాలనుకునే వారికి ఈ చిత్రం నచ్చుద్ది. ‘పవర్’ స్టార్ కావాలంటే మాత్రం కొంచెం కష్టమే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు