ఐ (మనోహరుడు)

January 14, 2015 | 04:22 PM | 55 Views
Rating :
ఐ (మనోహరుడు)

నటీనటులు : విక్రమ్, ఎమీ జాక్సన్, సురేష్ గోపీ, సంతానం, ఉపేన్ పటేల్, తదితరులు

సాంకేతిక వర్గం :

సంభాషణలు: శ్రీరామక్రుష్ణ, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరాం, సంగీతం: ఏఆర్ రెహమాన్, నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్

ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్  దర్శకత్వంలో  కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల చేత మెప్పు పొందిన చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన విజువల్ వండర్ ‘ఐ’. ఎప్పుడూ మెసేజ్ ఓరియంటల్ చిత్రాలు చేసే శంకర్ మొదటిసారి ఓ రొమాంటిక్ థ్రిల్లర్ కి సైన్స్ అండ్ టెక్నాలజీని జోడించి తీసి ఈ విజువల్ ట్రీట్ ను అందించాడు. సినిమాలో విక్రమ్ విచిత్రమైన గెటప్ లు, శంకర్ క్రేజ్ గురించి అర్నాల్డ్, జాకీచాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలు ఓ రేంజ్ లో పోగడటంతో చిత్రంపై అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోయాయి. అపరిచితుడు తర్వాత అసలు హిట్ మొహం ఎరుగని విక్రమ్, స్నేహితుడు ప్లాఫ్ తర్వాత శంకర్ చేసిన ఈ చిత్రం అంచనాలు అందుకుందా? చూద్దాం...  

కథ :

సనత్ నగర్ లింగేశ్వర(విక్రమ్) మిస్టర్ ఇండియా కావాలని కలలు కనే వ్యక్తి. అందులో భాగంగా మిస్టర్ ఆంధ్రాపోటీలకు వెళ్లి గెలుస్తాడు. అక్కడ మలక్ పేట్ కు చెందిన ఓ లోకల్ డాన్ తో వైరం పెంచుకుంటాడు. తర్వాత లింగేశ్వరకు మోడల్ దియా(ఎమీ జాక్సన్) అంటే ప్రాణం. ఒకరకంగా చెప్పాలంటే ఆమె యాడ్ ల కోసమే టీవీ చూస్తాడు, అంతేకాదు ఏదీ చూపిస్తే అది కొనే టైపు. ఓ షూటింగ్ లో ఆమెను కలుసుకుని పరిచయం పెంచుకుంటాడు. మరోవైపు దియా తో పనిచేసే ఇంకో మోడల్ జాన్(ఉపేన్ పటేల్) ఆమె అంటే పడి చస్తాడు. ఎలాగైనా ఆమెను సోంతం చేసుకోవాలనుకుంటాడు. ఆమె ప్రతిఘటించడంతో అవకాశాలు రాకుండా చేస్తాడు. అయితే జాన్ కు చెక్ పెట్టేందుకు లింగేశ్వరను ‘లీ’గా తయారుచేసి చైనాలో ఓ యాడ్ షూటింగ్ చేస్తుంది దియా. ఆ యాడ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడటంతోపాటు అది ఓ రేంజ్ లో హిట్టవ్వుతుంది. దీంతో లీ ఇండియాలోనే టాప్ మోడల్ గా ఎదుగుతాడు. దీంతో ప్రతీకారం పెంచుకున్న జాన్, లింగేశ్వర అలియాస్ లీ అంటే పడని మరో నలుగురు కలిసి లింగను విక్రుతంగా మార్చి దెబ్బతీస్తారు. మిగతావాళ్లు ఎవరు?అసలు వాళ్లేం చేశారు?. లీ వాళ్లపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు. అతడు తన ప్రేమను గెలిపించుకున్నాడా అన్నది తెరమీద చూడాల్సిందే.

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాకు పూర్తి ప్రాణం విక్రమే... నటుడిగా తనలోని పూర్తిస్థాయి ఫెర్ఫార్మెన్స్ ను బయటికి తీశాడు. అయితే ఫస్టాఫ్ లో సూర్యకి డబ్బింగ్ చెప్పే వ్యక్తి(శ్రీనివాస మూర్తి)తో చెప్పించటంతో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కురూపిగా మారిన తర్వాత తన సొంత గొంతుతో విక్రమ్ అలరిస్తాడు. హీరోయిన్ ను ఇష్టపడే జిమ్ నిర్వహకుడిగా, మోడల్ గా, కురూపిగా మూడు భిన్నపాత్రల్లో విక్రమ్ నటన సూపర్బ్. ఇక హీరోయిన్ ఎమీ జాక్సన్ స్వతహాగా మోడల్ కావటంతోనేమో పాత్రలో జీవించేసింది. డాన్సుల్లో, నటనలో కూడా ఆకట్టుకుంది. ఫస్టాఫ్ లో సంతానం కామెడీ బాగుంటుంది. ఇక మళయాళం హీరో సురేష్ గోపీ నెగెటివ్ రోల్ లో బాగా చేశాడు . మిగతా వాళ్లో యాడ్ ఏజెన్సీ ఓనర్ పాత్ర చేసిన వ్యక్తి విజయ్ మాల్యాను గుర్తుచేస్తాడు. ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే ఈ చిత్రానికి మేజర్ అస్సెట్ సినిమాటోగ్రఫీ. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కెమెరామెన్ పీసీ శ్రీరాం తన బాధ్యతగా ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. అందమైన లోకేషన్లను అద్భుతంగా చూపించాడు. పాటల్లో, యాక్షన్ సీక్వెన్స్ ల్లో అతడి పనితనం బాగా కనిపించింది. ఇక ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్. శ్రీరామక్రుష్ణ సంభాషణలు ఓకే. క్లైమాక్స్ లో హీరో మళ్లీ మాములు రూపంలోకి మారటం హ్యాపీ ఎండింగ్ లా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్లు :

ఈ చిత్రానికి మైనస్ పాయింట్లు స్టోరీని సాగదీయటం. ఓ మాములు లవ్ స్టోరీని రిచ్ గా తీసిన దర్శకుడు శంకర్ దానిని ఎలివేట్ చేయటంలో ఎందుకో తడబడ్డాడు. ముఖ్యంగా సెకంఢాఫ్ అంతలా సాగదీయాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ముందుగా భారీగా హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు... ఆ రేంజ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించలేదనే చెప్పాలి. ముఖ్యంగా అడెల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఫ్యామిలీతో వచ్చేవారు కాస్త ఇబ్బందిగా ఫీలవుతారనే చెప్పాలి. విషయాన్ని సూటిగా చెప్పకుండా మధ్య మధ్యలో కాస్త ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపిస్తూ ప్రేక్షకులను దర్శకుడు కాస్త కన్య్ఫూజన్ కి గురిచేసినట్టుగా తోస్తుంది. సెకాండాఫ్ కి కత్తెర పెట్టాల్సి ఉండేదేమో. గే కాన్సెప్ట్ కూడా కాస్త అతిగా అనిపిస్తుంది. ట్విస్ట్ లు ఏం ఉండవు. కథ సాగు...తుంటే ముందే తెలిసిపోతుంది. పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకోవు. అసలు ఏఆర్ రెహమాన్ సంగీతమేనా అని అనుమానం కలగకమానదు.

చివరగా :

హాలీవుడ్ నటులతో ప్రచారం చేయించి నానా హంగామా చేశాడు, మొదటి నుంచి ఓ రేంజ్ చిత్రమని హైప్ క్రియేట్ చేశాడు. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో... అని వెళ్లే వాళ్లకి నిరాశే ఎదురవుతుంది. ఇది మాములు లవ్ స్టోరీ విత్ సైన్స్. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఎక్కడా తగ్గకుండా చిత్రం నిర్మాణ విలువల కోసం భారీగా పెట్టిన ఖర్చు. విక్రమ్ గెటప్ లు, దానికోసం అతడు పడ్డ కష్టం కోసం సినిమా తప్పక చూడాల్సిందే.

 

చివరగా... శంకర్ చిత్రం నుంచి ఆశించే ఎలిమెంట్స్ ఆశించి వెళ్లితే మాత్రం అసంత్రుప్తే... ఇది హైటెక్నికల్ వాల్యూస్ ఉన్నప్పటికీ స్టోరీపరంగా యావరేజ్ చిత్రం మాత్రమే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు