జిల్

March 27, 2015 | 05:41 PM | 84 Views
Rating :
జిల్

నటీనటులు : గోపిచంద్, రాశిఖన్నా, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, చలపతిరావు, కబీర్ ఖాన్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: శక్తి శరవణన్, సంగీతం: గిబ్రాన్, బ్యానర్: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాధాకృష్ణకుమార్

యాక్షన్ చిత్రాల హీరోగా పేరు పొందిన గోపిచంద్ చేసిన మరో యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రయత్నమే ఈ జిల్. సరికొత్తలుక్, స్టయిలిష్ గా కనపడటమే కాకుండా మిర్చి, రన్ రాజా రన్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన యు.వి.క్రియేషన్స్ బ్యానర్ రూపొందించిన చిత్రం, కొత్త దర్శకుడు కావడం సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. మరి ఈ అంచనాలను గోపిచంద్ ఏ మేర చేరుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా గురించి తెలుసుకోవాల్సిందే...

కథ :

ఫైర్ ఆఫీసర్ గా, ధైర్యవంతుడిగా పేరు పొందిన జై(గోపిచంద్) ఓ సందర్భంలో సావిత్రి(రాశిఖన్నా)ను కలుసుకుంటాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. వీరిద్దరి ప్రేమకథ రన్ అవుతుంటే మరో పక్క ముంభై డాన్ నాయక్(కబీర్) జైలు నుండి తప్పించుకుని రాధాకృష్ణను చంపాలని వెతుకుతుంటాడు. ఓ సమయంలో రాధాకృష్ణను ప్రమాదం నుండి కాపాడిన జై అనవరంగా అతని వల్ల చిక్కుల్లో పడతాడు. అప్పటి నుండి నాయక్ జై వెనుకపడతాడు. మరి జై, నాయక్ నుండి ఎలా తప్పించుకుంటాడు? అసలు నాయక్ రాధాకృష్ణని ఎందుకు చంపాలనుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాలో నటీనటుల అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా గోపిచంద్ చాలా స్టయిలిష్ గా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలు, లవ్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ముఖ్యగా జై పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. రాశిఖన్నాకి ఈ చిత్రంలో చాలా మంచి రోల్ వచ్చింది. రాశి ఈ సినిమాలో చాలా గ్లామరస్ గా కనిపించింది. కేవలం గ్లామర్ రోల్ కే పరిమితం కానీ బబ్లీ రోల్ ను రాశి పోషించింది. చాలా ఎనర్జిటిక్ క్యారెక్టర్. ఇక విలన్ గా నటించిన కబీర్ తన పాత్రలో అద్భుతంగా పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. చలపతిరావు, బ్రహ్మజీ సహా మిగతా నటీనటులందరూ వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.

మైనస్ పాయింట్లు :

దర్శకుడు రాధాకృష్ణకుమార్ స్టయిలిష్ మేకింగ్ పై పెట్టిన శ్రధ్ధ కథ, కథనం పై పెట్టలేదు. ఎందుకంటే ఇటువంటి మాఫియా డాన్ కథలు, వారిని ఎదుర్కొనే హీరోలను మనం చాలా సినిమాల్లో చూసేశాం. కాబట్టి కథలో ఏ కొత్తదనం లేదు. బలమైన ఏమోషన్స్ ను క్యారీ చేయలేకపోయారు. సినిమా ఫస్టాఫ్ అంతా కూల్ గా ఉంటే సెకండాఫ్ లో యాక్షన్ ఎక్కువై పోయింది. రెండింటిని పార్ లల్ గా తీసుకెళ్లి  ఉంటే బావుండేది. శక్తి శరవణన్ చాలా కొత్తగా చిత్రీకరించాడు. గిబ్రాన్ సంగీత, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఇక యు.వి.క్రియేషన్స్ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

చివరగా :

సినిమా కథ పాతదే అయినా దాన్ని తెరకెక్కించే విధానంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రేక్షకుడికి సినిమా కూల్ గానే వెళుతున్నట్లు అనిపిస్తుంది. దీనికి తోడు సినిమాటోగ్రఫీ, సంగీతం ప్లస్ అయ్యాయి. అయితే ఏమోషన్స్ క్యారీ చేయడంలో పెద్దగా సక్సెస్ కాలేదనిపించింది.

చివరగా ఈ సమ్మర్ లో జిల్ మనిపించిన కూల్ ఎంటర్ టైనర్



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు