నటీనటులు : సునీల్, డింపుల్ చోపడే, నిక్కీగల్రానీ, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, కబీర్ దుహాన్ సింగ్, పోసాని కృష్ణమురళీ, ముఖేష్ రిషీ, సప్తగిరి, సుమన్ తదితరులు
సాంకేతిక వర్గం :
సంగీతం: దినేష్ కనకరత్నం, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వాసు వర్మ
దాదాపు పదేళ్లు కమెడియన్ గా రాణించిన తర్వాత హీరోగా మారి హిట్లు కొట్టాడు సునీల్. అయితే అదే ఊపులో రాంగ్ స్టెప్పులతో వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఇక సునీల్ హీరోగా సినిమా వచ్చి చాలాకాలం అయింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మరీ ఈ కృష్ణాష్టమిని తెరకెక్కించారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వాసూవర్మ దర్శకత్వం వహించిన కృష్ణాష్టమి సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించాడు. వాసు, సునీల్, దిల్ రాజు ముగ్గురు కెరీర్ కు కీలకమైన కృష్టాష్టమి ఎలా ఉందో చూద్దాం...
కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో కృష్ణవరప్రసాద్ (సునీల్) ను అతడిని పెదనాన్న ఫారిన్‌లో ఉంచి చదివిస్తుంటాడు. 18 సంవత్సరాలుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఇండియా రాకుండా అడ్డుపడుతున్న పెదనాన్న. అక్కడే ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి కూడా సెటిల్ చేస్తాడు. దీంతో ఎవరికీ తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు కృష్ణ. ఆ క్రమంలోనే పల్లవి(నిక్కి గల్రానీ)తో ప్రేమలో పడిపోతాడు. ఇక ఇండియాలో దిగగానే అతడి మీద ఎటాక్ జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో కృష్ణ తనకు ఎయిర్‌పోర్టులో పరిచయం అయిన అజయ్‌కుమార్(అజయ్) స్థానంలో వాళ్ల ఫ్యామిలీలో ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంటి పెద్ద తన కుమార్తె (డింపుల్ చోపడే)ని అజయ్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్ గా తాను ఆడుతున్న అబద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటాడు. తాను అజయ్‌ను కాదని ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి వెళ్లిపోయే ప్రయత్నంలో మరోసారి కృష్ణపై ఎటాక్ జరుగుతుంది. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి? అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఇదే కథ
ఫ్లస్ పాయింట్లు:
హీరో సునీల్ పూర్తి స్థాయి హీరోగా బాగానే చేశాడు.కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో సునీల్ తన మార్క్ చూపెట్టాడు. నిక్కీ గల్రాని, డింపుల్ చోపాడే.. ఇద్దరూ హీరోయిన్లూ వీలైనంత అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. ఇక అశుతోష్ రానా, ముఖేష్ రుషి, తులసి, సప్తగిరి తదితరులు బాగా చేశారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... సినిమాటోగ్రాఫర్ పనితనాన్ని మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఛోటా కె. నాయుడు తన మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. యూరప్, అమెరికాల్లోని అందమైన లొకేషన్స్‌ను మరింత అందంగా చూపించడంతో పాటు సెకండాఫ్‌లో సినిమా ఎమోషన్‌కు తగ్గ మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో ఛోటా ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అన్నింటికీ మించి కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో ఛోటా చేసిన ప్రయోగం చాలా బాగుంది. దిల్‌రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎప్పట్లానే చాలా బాగున్నాయి. సినిమా పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని విధానం చాలా చోట్ల కనిపిస్తుంది.
మైనస్ పాయింట్లు :
తెలుగు సినిమాల్లో చాలాకాలంగా చూస్తూ వస్తోన్న పరమ రొటీన్ ఫార్ములా కథలో చిన్న ఫ్యామిలీ ఎమోషన్, కొద్దిగా కామెడీ, కొద్దిగా రొమాన్స్ పండిస్తే సరిపోతుందన్నట్లు రాసుకున్న కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. ఫార్ములాలు చాలా సార్లే ఆకట్టుకున్నా, ఈ ఫార్ములాలో అంతటా అతి ఎక్కువైంది. ఎక్కడా ఎమోషన్‌కు ఒక అర్థమంటూ లేదు. విలన్ పగ, హీరో ప్రేమ, రెండో హీరోయిన్ క్యారెక్టర్.. ఇలా సినిమాలో ప్రధానమైన అంశాలన్నీ చాలా సిల్లీగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో వరుసగా పాటలు వస్తూ, పోతూ విసుగు తెప్పిస్తాయి. అమెరికా నేపథ్యంలో నడిచే మొదటి పావుగంట, యూరప్‌లో హీరో-హీరోయిన్‌ల లవ్ ట్రాక్ ఇవన్నీ మరీ ఓవర్‌గా ఉన్నాయి.
ఇక హీరో విలన్ ఇంట్లోకే వెళ్ళిపోయి, వాళ్ళతో సరదా చేస్తూ చివరకు అందర్నీ మంచి వాళ్ళుగా మార్చడమన్న కాన్సెప్ట్‌ను ఈ సినిమాలోనూ వాడారు. కొన్ని సన్నివేశాల్లో సునీల్ నటన మరీ కామెడీగా అనిపిస్తుంది. ఈ పార్ట్‌లో ఎక్కడైతే డ్రామా సరిగ్గా పండాలో అదే ఈ సినిమాలో జరగలేదు. సెకండాఫ్‌లో సన్నివేశాలన్నీ కథ పరంగా కాకుండా అలా అలా పేర్చుకు పోయినట్లు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కమర్షియల్ హంగులను నింపుకుంటూ నడిచే సినిమాలో ఎక్కడా లాజిక్ అన్నదే లేదు. కమర్షియల్ సినిమా అనుకొని కొన్ని చిన్న లాజిక్‌లను పక్కనబెట్టినా, సినిమాలో ప్రధానమైన ఉపకథలన్నింటినీ అసలు కథకు కలిపే విధానంలో లాజిక్ అన్నదే కరువైంది. ఇక ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చూస్తే, హీరోయిన్ పాత్రకు కనీస వ్యాల్యూ ఇవ్వకపోవడమనే అంశమే ఆలోచనలో పడేస్తుంది.
చివరగా :
మొదటి సినిమాతో ఫెయిల్ అయిన వాసువర్మ తో ఎలాగైనా హిట్ కొట్టించి తీరతానని దిల్ రాజు చెప్పుకోచ్చాడు. కానీ, కథ చూశాక అసలు డైరక్టర్, కథ ఎంపికే మైనస్ అని తెలిసిపోతుంది. హీరోను తీసుకెళ్లి విలన్ల ఇంట్లో పెట్టి వాళ్లను మార్చడం అనే పరమ రొటీన్ కాన్సెఫ్ట్‌నే మరోసారి తీసుకున్న వర్మ పరమ చెత్త కథనంతో సినిమాను తీశాడు. బన్నీతో తీద్దామనుకున్న ఈ కథను సునీల్ లాంటి హీరోతో తీయటం అస్సలు సూటవ్వలేదు.
చివరగా... అరిగిపోయిన, పరమ బోరింగ్, రెగ్యులర్ కథా, కథనం. ఇంత చెప్పాక వెళ్తే మాత్రం ఏం చేయలేం.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment