శంకరాభరణం

December 05, 2015 | 10:25 AM | 3 Views
Rating :
శంకరాభరణం

నటీనటులు : నిఖిల్, నందిత రాజ్, అంజలి, సప్తగిరి, రావు రమేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, సంజయ్ మిశ్రా తదితరులు

సాంకేతిక వర్గం :

కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: చోటా.కే.ప్రసాద్,  సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్,  కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

ప్రస్తుతం ఉన్న నటుల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఢిపరెంట్ కథలతో వచ్చి మరీ ఆ ఫీట్ ను సొంతం చేసుకున్నాడు యువనటుడు నిఖిల్. ప్రత్యేకమైన జోనర్ ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పాత కథలనే రిపీట్ చేస్తున్నాడంటూ కోన వెంకట్ సినిమాలను ప్రేక్షకులు సున్నితంగా తిప్పి కొడుతున్నారు. అలాంటి టైంలో వీరిద్దరి కలయికలో ఓ సినిమా రావటంతో కాస్త అంచనాలు పెరిగాయి. క్రైం కామెడీ థ్రిల్లర్ అంటూ శంకరాభరణం పేరుతో ఓ సినిమా రూపొందించారు. క్లాసిక్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు ఉదయనందనవనమ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించాడు. మరీ ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితం ఎలా ఉందో రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.

కథ :

గౌతమ్ (నిఖిల్) అమెరికాలో బాగా సంపాదించిన ఓ బిజినెస్ మెన్ (సుమన్) కొడుకు. స్వతహాగా ధనికుడి కొడుకు కావటంతో ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. అదే టైంలో స్నేహితులు మోసం చేయటంతో అప్పుల పాలవుతాడు అతని తండ్రి. ఇక తండ్రి ఇబ్బందులను తొలగించేందుకు తల్లి రాజో దేవీ(సితార) కు బీహార్ లో  ఉన్న ఆస్తిని అమ్మేందుకు వస్తాడు. అక్కడ కిడ్నాపర్ల్ గ్యాంగ్ లతో గౌతమ్ ఆడుకునే ఆటే ఈ శంకరాభరణం. మరీ చివరకు ఏమైంది. తన కుటుంబాన్ని చిక్కుల నుంచి ఎలా రక్షించాడు. తనకు నచ్చిన హ్యాపీ ఠాకూర్ (నందిత) ప్రేమను ఎలా దక్కించుకుంటాడు. అసలు మున్ని రాణి(అంజలి) ఎవరు? మినిస్టర్ (సంపత్ రాజ్) కి వీరందిరితో సంబంధం ఏమిటి? ఇదంతా అసలు కథ.

ఫ్లస్ పాయింట్లు:

నటీనటుల విషయానికొస్తే... గత మూడు చిత్రాల్లో లాగానే నిఖిల్ మరోసారి వన్ మ్యాన్ షో చేశాడు. ఎన్నారై కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాల్లో ఫర్ ఫెక్ట్ గా సూటయ్యాడు. ఇక జోడిగా చేసిన నందితా రాజ్ యాక్టింగ్ కూడా ఓకే. కీలక పాత్రలో అంజలి పాత్ర సూపర్బ్. ఆమె ఉన్న 20 నిమిషాలు కథ స్పీడ్ గా సాగుతుంది. ఇక కామెడీ విషయానికొస్తే సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వీ రెచ్చిపోయారు. చివర్లో సంపత్ రాజ్ కూడా కామెడీ చేయటం సరదాగా ఉంటుంది. మిగతావారు కూడా తమ పాత్రల మేర నటించారు. ఇక చిత్రానికి మెయిన్ ఫ్లస్ పాయింట్ చివరి అరగంట చిత్రం. నవ్వులతో ముంచెత్తుతుంది.

టెక్నికల్ విషయానికొస్తే... ప్రాంతాలను బట్టి మూడ్ ను చేంజ్ చేయటంలో కెమెరామెన్ సాయి శ్రీరామ్ కీలకపాత్ర పోషించాడు. ఆ విజువల్స్ కి, సినిమాలోని సీన్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రవీణ్ లక్కరాజు రీ రికార్డింగ్ చేసాడు. చిన్న తన ఆర్ట్ వర్క్ లో బిహార్ నేటివిటీని పర్ఫెక్ట్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. కోన కథలో హైలెట్ గా చెప్పుకోదగింది కామెడీ. దానిని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఉదయ్ నందనవనమ్ తెరకెక్కించటంలో సఫలం అయ్యాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినప్పటికీ ఎంవివి సత్యనారాయణ నిర్మాణ విలువలు మాత్రం హై బడ్జెట్ సినిమా రేంజ్ లో ఉన్నాయి.

మైనస్ పాయింట్లు :

సినిమాకి మేజర్ మైనస్ పాత్రలు ఎక్కువగా ఉండటం. దీంతో కాస్త కన్ప్యూజన్ క్రియేట్ అవుతుంది. మాతృక సినిమా పస్ గయారే ఒబామా లో ఉండే ఎమోషన్స్ ఇందులో ఉండవు. వెరసి చిత్రం కాసేపు నవ్వుకోడానికే తప్ప సీరియస్ గా చూసేందుకు పనికి రాదని అనిపిస్తుంది. పాటలు కూడా అంత బాగాలేవు. అలాగే అవివచ్చే సందర్భాలు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాలేదు. ఎక్కడా స్పీడ్ ఎడిట్ కనిపించలేదు, అలాగే చాలా లాగ్స్ ని కట్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ సగం నుంచే బాగా రొటీన్ గా అనిపిస్తుంది.

చివరగా :

నిఖిల్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కథలో కొత్తదనం అనేది కనిపించదు. కానీ ఈ మధ్య ఎక్కువగా వర్కౌట్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లో వచ్చిన సినిమా కావడం ప్లస్ అయ్యింది. చాలా చోట్ల సినిమా స్లోగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదు. కానీ, కామెడీ తో దానికి ప్యాచ్ లు వేసేందుకు దర్శకుడు బాగా ప్రయత్నించాడు.

చివరగా... మరీ సీరియస్ గా తీసుకోకుండా కామెడీ కోసం సరదాగా ఓసారి చూసే శంకరాభరణం. సిల్లీగా మాత్రం ఖచ్ఛితంగా ఉంటుంది.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు