స్పీడున్నోడు

February 05, 2016 | 04:59 PM | 1 Views
Rating :
స్పీడున్నోడు

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, సొనారిక బడోరియా, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, పవిత్రా లోకేష్, చైతన్యకృష్ణ, కబీర్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్, ఆర్ట్ : కిరణ్ కుమార్, సంగీతం : డిజే వసంత్, నిర్మాత : భీమనేని సునీత,  దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు

డెబ్యూ మూవీ అల్లుడు శీనుతో బాగానే ఆకట్టుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.  బోయపాటితో తర్వాతి చిత్రం ప్రారంభమైన్నప్పటికీ అది కాస్త ఆర్థిక ఇబ్బందులతో అటకెక్కటంతో కెరీర్ డైలామాలో పడింది. ఆ టైంలో సునీల్, రవితేజ నుంచి చేజారిన(వాళ్లే తప్పుకున్నారనుకోండి) స్పీడున్నోడులోకి ఎంటర్ అయ్యాడు. రీమేక్ డైరక్టర్ భీమనేని శ్రీనివాసరావు తీసిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ హిట్ చిత్రం ‘సుందర పాండ్యన్’ రీమేక్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

కథ :

రామగిరి పంచాయితీ పెద్ద అయిన వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్(బెల్లంకొండ శ్రీనివాస్). డిగ్రీ పూర్తి నాలుగేళ్ళయినా ఎలాంటి పనీ లేకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి లైఫ్ ని బిందాస్ గా గడుపుతుంటాడు. శోభన్ వీక్ నెస్ ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్ కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికన్నా సిద్దమవుతాడు. శోభన్ ఫ్రెండ్ గిరి(మధు) వాసంతి(సోనారిక-హీరోయిన్) అనే ఓ అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిని గిరికి సెట్ చేయడం కోసం శోభన్ అండ్ కో ప్రయత్నిస్తారు. అయితే ఆ ప్రయత్నంలో శోభన్, వాసంతి ప్రేమలో పడతారు. తర్వాత ఫ్రెండ్స్ మధ్య అండర్ స్టాండింగ్ తో శోభన్ – వాసంతిల మధ్య ప్రేమ మొదలవుతుంది.

కట్ చేస్తే... వీరి ప్రేమ వాసంతి నాన్నకు(రావురమేష్) కి శోభన్ నచ్చడు. దీంతో ప్రేమకి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు మదన్(చైతన్య కృష్ణ), జగన్(కబీర్ సింగ్ దుహాన్) అనే ఇద్దరి వల్ల ఆ సమస్య మరింత ముదురుతుంది. మరి వీరందరిని దాటుకుని శోభన్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

‘స్పీడున్నోడు’ సినిమా చాలా స్పీడ్ గా మొదలవ్వడం, అంతే స్పీడ్ గా కథలోకి వెళ్ళడం, అదే స్పీడ్ తో ఎంటర్టైనింగ్ గా పాత్రలని పరిచయం చేయడమే మొదట అందరికీ బాగా నచ్చే పాయింట్. సినిమా ప్రారంభం చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ మరియు లవ్ ట్రాక్ తో సినిమాని ఎంటర్టైనింగ్ గా ముందుకు నడిపించడం సినిమాకి హైలైట్. ఇకపోతే ఈ సినిమాకి ఇంటర్వెల్ బాంగ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ భాగం ఫ్రెండ్ పాత్ర చేసిన శ్రీనివాస్ రెడ్డి, మధు, షకలక శంకర్ పంచ్ డైలాగ్స్ తో నవ్విస్తారు. మరో వైపు ఇల్లరికపు అల్లుల్లుగా పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్ లు అక్కడక్కడా నవ్వించారు.

ఇక హీరో బెల్లంకొండ శ్రీను విషయానికొస్తే రెండవ సినిమాలో కూడా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. డాన్సులు, ఫైట్లు ఇరగదీశాడు. ఇంట్రో సాంగ్, తమన్నా ఐటెం సాంగ్ లో స్టెప్స్ అదుర్స్. ఇక సొనారిక ఓకే అనిపించింది. ఇక స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా అందాల ఆరబోతతో ముందు బెంచ్ వారిని పిచ్చెక్కించిందని చెప్పాలి.  ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మిగతావారు వారి వారి పాత్రల మేర నటించారు.

సాంకేతిక విభాగంలో విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా చాలా కలర్ఫుల్ గా విజువల్స్ బాగా గ్రాండ్ గా ఉండేలా కేర్ తీసుకున్నాడు. పాటల పిక్చరైజేషన్ సూపర్బ్. డిజే వసంత్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం ఇంకా బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. మెయిన్ గా సినిమా కథకి తగ్గట్టు సెట్స్ వేసిన కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ బాగుంది. భీమనేనిశ్రీనివాసరావు – ప్రవీణ్ వర్మ కలిసి రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్లు :

ఇది రీమేక్ సినిమా.. ఒక నేటివిటీ కథని మన నేటివిటీకి సెట్ అయ్యేలా చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. ఆ మార్పులు సెట్ అయితే సినిమా పెద్ద హిట్ లేదా ప్రేక్షకులకి నచ్చదు. అలాగే ఇది పక్కా తమిళ్ నేటివిటీ సినిమా, ఆ నేటివిటీనే ఆ సినిమాకి హెల్ప్. దాని తెలుగులోకి అన్నప్పుడు నేటివిటీని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఈ సినిమాకి ఎంచుకున్న నేటివిటీ పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. ఎందుకంటే మెయిన్ గా నేటివిటీ అనేది ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ఉండాలి కానీ ఆ పరంగా దానిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎస్టాబ్లిష్ చేయకపోవడమే కాకుండా ఎక్కువ కమర్షియల్ అంశాలను జత చేయడం వలన బోరింగ్ అంశాలు చాలానే సినిమాలో ఉన్నాయి.

ఇక శీను ఎమోషనల్ సీన్లలో తేలిపోయాడు. మొదటి సినిమాలో కామెడీతో సేఫ్ అయినప్పటికీ ఇక్కడ మాత్రం నటనలో చాలా వీక్ గా అనిపించాడు. గ్లామర్ డాల్ సోనారిక పల్లెటూరి అమ్మాయిగా అస్సలు సూట్ కాలేదు. కబీర్ పాత్రలో తెలుగు వారిని తీసుకుని ఉండాల్సింది. కొన్ని సీన్లు మరి సిల్లీగా, రీజన్ లేకుండా అనిపిస్తాయి.

చివరగా :

రీమేక్ అంటే మాతృకను ఏ మాత్రం దెబ్బతీయకుండా, లోకల్ ప్రేక్షకుల నెటివిటికి తగ్గట్లుగా తీయాలి. కానీ, స్పీడునోడు విషయంలో ఆ రెండు జరగలేదు. గత రీమేక్ చిత్రాల్లో ఒక్క అన్నవరం తప్ప భీమినేని అన్ని సినిమాలు హిట్టే. అయితే ఫ్రెండ్ షిప్ బేస్డ్ కామెడీ ఎంటైర్ టైనర్ గా తెరకెక్కి హిట్ సాధించిన సుందర పాండ్యన్ ను భీమినేని చెడగొట్టాడేమో అనిపిస్తుంది. బోరింగ్ సన్నివేశాలు,  అసందర్భమైన పాటలు, ముఖ్యంగా ఎమోషనల్ కంటెంట్ లోపించినట్లు అనిపించటంతో వెరసి చిత్రాన్ని దెబ్బతీశాయి.

చివరగా... స్పీడున్నోడి స్పీడు జనాలకు అంతగా ఆనకపోవచ్చు. అయినా చూస్తామంటే మాత్రం ఏం చేయలేం.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు