ఉత్తమవిలన్

May 04, 2015 | 11:11 AM | 48 Views
Rating :
ఉత్తమవిలన్

నటీనటులు : కమల్ హాసన్, ఆండ్రియా, పూజాకుమార్, నాజర్, కె.బాలచందర్, కె.విశ్వనాథ్, ఊర్వశి, జయరామ్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఎడిటింగ్- విజయ్ శంకర్, సినిమాటోగ్రఫీ- శ్యామ్ దత్, సంగీతం- జిబ్రాన్, బ్యానర్- ఈరోస్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ పిల్మ్ మీడియా ప్రై.లి, సి.కె.ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత – సి.కళ్యాణ్, దర్శకత్వం- రమేష్ అరవింద్

 

 

కమల్ హాసన్ సినిమా అంటేనే కొత్తదనం. ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకోవడమే ఆయన స్పెషాలిటీ. విశ్వరూపం తర్వాత కమల్ చేసిన మరో విలక్షణ చిత్రమే ఉత్తమవిలన్. కుటుంబ బంధాలు గురించి తెలియజేప్పే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ విలన్ ఏ మేర అందుకున్నాడో తెలుసుకోవాలంటే కథ తెలుసుకోవాల్సిందే....

 

కథ :

మనోరంజన్(కమల్ హసన్) ఒక సూపర్ స్టార్. గతంలో యామిని అనే అమ్మాయిని ప్రేమించినా కొన్ని పరిస్థితుల్లో పూర్ణచంద్రరావు(కె.విశ్వనాథ్) కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని పెళ్లి చేసుకుంటాడు. తనని సినిమా హీరోగా పరిచయం చేసిన గురువు మార్గదర్శి(కె.బాలచందర్)కి కూడా దూరమవుతాడు. అయితే తన ఫ్యామిలీ డాక్టర్ అర్పణ(ఆండ్రియా) ద్వారా ఒక నిజం తెలుసుకున్న మనోరంజన్ వెంటే మార్గదర్శిని కలిసి ఓ సినిమా చేద్దామని అంటాడు. ముందు వద్దన్నా, అసలు నిజం తెలిసి మార్గదర్శి సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో జాకబ్(జయరామ్) ద్వారా తనకు, యామినికి కలిగిన సంతానం మనోన్మణి(పార్వతి మీనన్)ని కలుసుకుంటాడు. అప్పడేం జరుగుతుంది? అసలు మార్గదర్శితో మనోరంజన్ సినిమా చేయడానికి కారణం ఏమిటి? అసలు అర్పణ చెప్పిన నిజం ఏమిటి? దాని కారణంగా మనోరంజన్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫ్లస్ పాయింట్లు:

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది కమల్ హాసన్ గురించి కథ,స్ర్కీన్ ప్లే అందించాడు. సూపర్ స్టార్ మనోరంజన్ గా, ఉత్తముడుగా ఎక్సలెంట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. తన నటన గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను క్యారీ చేసే సందర్భంలో కమల్ అసాధారణ నటనను కనపరిచాడు. అలాగే నాజర్ ముత్యాలరాజుగా సూపర్ కామెడిని పండించాడు. అర్పణ డాక్టర్ గా, మనోరంజన్ ప్రేమికురాలిగా మంచి పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. పూజాకుమార్ కూడా కల్పవల్లిగా మంచి నటనను కనపరిచింది. కె.బాలచందర్, కె.విశ్వనాథ్ వంటివారు చిన్న పాత్రలైనా వారినటనతో వాటికి జీవం పోశారు. జిబ్రాన్ అందించిన ట్యూన్స్ ఆకకట్టుకునేలా లేవు. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సూపర్. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.

 

మైనస్ పాయింట్లు :

రమేష్ అరవింద్ టేకింగ్ విషయంలో తీసుకన్న శ్రద్ధ కథ, కథనం విషయంలో తీసుకోలేదనే చెప్పాలి. ఈ రెండు వీక్ కావడంతో సినిమాలో నటీనటుల మెరుగైన నటనంతా మరుగున పడిపోయింది. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఓ కథను తెరపై చూపించడం బావున్నా. సీరియస్ గా ఎమోషన్స్ ను క్యారీ చేసే సినిమాలో ఈ ఉత్తముడు క్యారెక్టర్ మధ్యలో ఎంటర్ కావడంతో ప్రేక్షకులు ఫీల్ ను కోల్పోతున్నారు. ట్యూన్స్ బాగా లేవు. సినిమా స్లోగా రన్ కావడం, నిడివి ఎక్కవ అయ్యాయి. కమల్ తో సినిమా అనగానే ఏదో ఆశించి థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు ఇలాంటి కామెడి, ఎమోషన్స్ ను కమల్ సినిమాల్లో ప్రేక్షకులు ఇది వరకు చూసి ఉండటంతో కొత్తగా ఏమీ అనిపించదు

చివరగా :

కమల్ అంటేనే కొత్తదనం ఉంటుంది అనే ప్రేక్షకులకు ఇదొక నార్మల్ ఫ్యామిలీ డ్రామా అని తెలియడం పెద్దగా రుచించకపోవచ్చు. సినిమాలో కమల్, ఇతన నటీనటుల నటనాతీరు మినహా చెప్పుకోదగ్గ అంశం లేకపోవడం పెద్ద మైనస్. సినిమాటోగ్రఫీ బావున్నా, మ్యూజిక్ విభాగం నుండి అనుకున్న స్థాయిలో సపోర్ట్ లభించలేదు. ఎమోషనల్ గా సాగే సినిమా మధ్యలో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కథను ఇరికించడంతో ఆ ఎమోషన్ ఫీల్ పోతుంది. ఏదేమైనా పరిమిత వర్గ ప్రేక్షకులకే ఈ చిత్రం నచ్చుతుంది. అలాగే కమల్ ఫ్యాన్స్ ను అలరించే చిత్రమిది. కమల్ మరేదైనా కథను ట్రై చేసుంటే బావుండేదని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. 

 

చివరగా... నటీనటుల పూర్తిస్థాయి నటన తప్ప... ప్రత్యేకత(థ) లేని ‘ఉత్తమవిలన్’       



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు