ఎంతవాడు గాని

May 23, 2015 | 10:13 AM | 0 Views
Rating :
ఎంతవాడు గాని

నటీనటులు : అజిత్, త్రిష, అనుష్క, అరుణ్ విజయ్, ఆశిష్ విద్యార్థి, వివేక్ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్- శ్రీ సాయిరామ్ క్రియేషన్స్, సంగీతం- హేరీష్ జయరాజ్, సినిమాటోగ్రఫీ- డాన్ మకర్ తూర్, ఎస్.కదిర్, ఎడిటింగ్- ఆంథోని, నిర్మాత- ఐశ్వర్య, దర్శకత్వం- గౌతమ్ మీనన్

ఫిబ్రవరిలో తమిళంలో ఘనవిజయం సాధించిన అజిత్ చిత్రం ఎన్నై అరిందాల్ ను అప్పట్లోనే తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఎంతవాడుగాని పేరుతో ఇప్పుడు విడుదలైంది. గౌతమ్ మీనన్ యాక్షన్ సినిమాలను కూడా డిఫరెంట్ స్టయిల్ లో ప్రజెంట్ చేస్తాడనే విషయం తెలిసిందే. అలాంటి స్టయిలిష్ టేకింగ్ తో తమిళంలో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. దాంతో నిర్మాత తెలుగులో కూడా అజిత్ చిత్రాన్ని భారీ అంచనాలతో, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశాడు. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? అది తెలియాలంటే రివ్యూ లోకి వెళదాం...

కథ :

సత్యదేవ్ సిన్సియర్ పోలీస్ అధికారి. చంద్రముఖి అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. గ్యాంగ్ స్టర్ గా ఉన్న సమయంలో విక్టర్(అరుణ్ విజయ్)తో పరిచయం ఉంటుంది. మొత్తం గ్యాంగ్ ను షూట్ అవుట్ చేసిన తర్వాత సత్యదేవ్ డ్యూటీలో జాయినవుతాడు. అయితే విక్టర్ సత్యదేవ్ పై కక్ష పెంచుకుంటాడు. సత్యదేవ్ హేమౌనికతో ప్రేమలో పడతాడు. అయితే కొన్ని పరిస్థితులు కారణంగా హేమౌనిక హత్య చేయబడుతుంది. ఆమె కూతురు నిషాను పెంచే బాధ్యతను చేపట్టడంతో పోలీస్ గా రిజైన్ చేస్తాడు. అయితే కొన్ని పరిస్థితులు కారణంగా మళ్లీ పోలీస్ గా విధుల్లోకి జాయినవుతాడు. అప్పుడు సత్యదేవ్ కి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి? అసలు విక్టర్ ఏమౌతాడు? చంద్రముఖి ఎవరు? హేమౌనిక ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఫ్లస్ పాయింట్లు:

అజిత్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్, పోలీస్ ఆఫీసర్ గా రెండు షేడ్స్ లో సూపర్ నటనను కనపరిచాడు. మంచి ఎమోషన్స్ ను కనపరిచాడు. యాక్షన్ పార్ట్ లో అజిత్ తన స్టయిల్ ను చూపించాడు. విలన్ గా నటించిన అరుణ్ విజయ్ అజిత్ నటనకి ఏ మాత్రం తగ్గకుండా నటించాడు. అనుష్క, త్రిషలు తమ పాత్రలు మేర చక్కని అభినయాన్ని కనపరిచారు. గౌతమ్ మీనన్ కథ, కథనంతో ప్రేక్షకులను ఆద్యంతం కట్టేశాడు. హేరిస్ జైరాజ్ సంగీతం సినిమాకి ప్లస్ అయింది. బంగారు బంగారు...అనే పాట, సహా అన్నీ పాటలు బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆదరగొట్టాడు. డాన్ మకర్, కదిర్ సినిమాటోగ్రఫీ హైలైట్. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్లు :

గౌతమ్ మీనన్ గత చిత్రాలైన కాక్క కాక్క, వేట్టైయాడు వెళయాడు చిత్రాల వాసన ఈ సినిమాలో కనపడుతుంది. అంథోని ఎడిటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. సినిమా ఫస్టాఫ్ అంతా స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎంటర్ టైన్ ఆశించే ప్రేక్షకులకు నిరాశ తప్పదు. గౌతమ్ మీనన్ చిత్రాల్లో కనపడే లవ్ ఫీల్ ఈ చిత్రంలో కనపడదు.

చివరగా :

పెద్ద పెద్ద నగరాల్లో జరిగే హ్యుమన్ ఆర్గాన్ స్కామ్ ఎలా జరుగుతాయి. వాటి మూలాలేంటి? అనే విషయాన్ని పోలీస్ యాక్షన్ స్టయిల్ లో గౌతమ్ మీనన్ చక్కగా ప్రజెంట్ చేశాడు. అజిత్ నటన, గౌతమ్ మీనన్ స్క్రీన్ ప్లే, హేరిష్ జైరాజ్ మ్యూజిక్ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే బావుండేది. ఈ చిత్రంతో తెలుగులో అజిత్ కి కొంత స్టార్ డమ్ ఏర్పడే అవకాశం ఉంది.

చివరగా... మొత్తం మీద యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి విందవుతుందనడంలో సందేహం లేదు.

 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు