అసుర

June 05, 2015 | 03:47 PM | 7 Views
Rating :
అసుర

నటీనటులు : నారారోహిత్, ప్రియాబెనర్జి, మధుసింగం పల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదిరులు

సాంకేతిక వర్గం :

ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రఫీ: యస్.వి.విశ్వేశ్వర్, సంగీతం: సాయికార్తీక్, బ్యానర్- దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్, నిర్మాతలు: శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్, రచన-దర్శకత్వం: కృష్ణ విజయ్.

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ పెలో  ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ ఫార్ములాతో వస్తున్న యంగ్ హీరో నారారోహిత్ చేసిన చిత్రమే అసుర. టైటిల్, దాని డిజైనింగ్ డిఫరెంట్ గా ఉండటం, రౌడీఫెలో తర్వాత రోహిత్ పోలీస్ క్యారెక్టర్ చేయడంతో ఈసినిమాలో ఎలాంటి వేరియేషన్ చూపుతాడోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్యామ్ దేవభక్తుని, కృష్ణవిజయ్ లు నిర్మాతలుగా నారారోహిత్ సమర్పణలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం...

కథ :

ధర్మతేజ(నారారోహిత్) రాజమండ్రి సెంట్రల్ జైల్లో పనిచేసే సిన్సియర్ జైలర్. తప్పు చేసిన వాడిని అసలు క్షమించే తత్వం ఉండదు. అందుకు అందర తనని రాక్షసుడు అని పిలుస్తుంటారు. ఓ సందర్భలో వైజాగ్ జైలు నుండి చంద్రశేఖర్ అలియాస్ చార్లి(రవివర్మ) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తాడు. డబ్బుకోసం కుటుంబ సభ్యులను చంపిన చార్లి అంటే ధర్మకి పడదు. అయితే తాను కోర్టు విధించిన మరణ శిక్ష నుండి తప్పించుకుంటానని అంటాడు. దాంతో సీరియస్ గా తన పర్యవేక్షణలో ఉంచుకుంటాడు. అయితే రెండు సార్లు ఉరిశిక్ష నుండి చార్లి తప్పించుకుంటాడు. మూడోసారి తన మనుషులతో ధర్మ, తలారి వీర, మేజిస్ట్రేట్ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయిస్తాడు చార్లి. మరి అలాంటి సందర్భంలో ధర్మ ఏం చేస్తాడు? తన కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకుంటాడో సినిమాలో చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ హీరో నారారోహిత్ నటన, డైలాగ్ డెలివరీ. ఈ రెండు విషయాల్లో అల్రెడి తన గత చిత్రాలతో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి కొత్తగా వాటి గురించి చెప్పుకోనవరసం లేదు. సినిమా మొత్తాన్ని తానై ముందుకు నడిపించాడు. జైలర్ గా, బాధ్యత గల ఆఫీసర్ గా చక్కగా నటించాడు. ప్రియాబెనర్జి పాత్ర పరిమితమైన తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. రవివర్మ మంచి నటనను కనపరిచాడు. సత్య, ముత్యంరెడ్డి, రూపాదేవి వారి వారి పాత్రల పరిధుల మేర చక్కగా నటించాడు. చిన్నలాజిక్ లు మినహా దర్శకుడు సినిమా కథను బాగానే రాసుకున్నాడు. సాయికార్తీక్ అందించిన ట్యూన్స్ టైటిల్ సాంగ్, ఐటెమ్ సాంగ్ బావున్నాయి, మిగిలిన ట్యూన్స్ ఆకట్టుకోలేదు. అయితే మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బావుంది. డైలాగ్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్లు :

దర్శకుడు కృష్ణ విజయ్ కథను బాగానే రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ప్రతి సీన్ లాగింగ్ గా అనిపిస్తుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఆకట్టుకోలేదు. నారా రోహిత్ ఫిజిక్ పై శ్రద్ధ తీసుకుని కొద్దిగా సన్నబడితే మంచి బేస్ వాయిస్, నటన ఉన్నందుకు బావుంటుంది. సినిమాలో లావుగా కనపడ్డాడు. సీరియస్ గా సాగే సినిమాలో ప్రియాబెనర్జి రోల్ అక్కడక్కడా బ్రేక్ వేస్తుంది. చాలా వరకు అనవసరమైన సీన్స్ ఉన్నట్టుగా తోచింది. పాటలన్నీ సీరియస్ గా సాగే కథకు బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తాయి. సినిమాలో హీరోని రాక్షసుడు అని అందరూ అంటుంటారు. కానీ ఎందుకంటారో సరైన క్లారిటీ స్ర్క్రీన్ పై ఇవ్వలేదు.

చివరగా :

నారారోహిత్ మరోసారి తన డైలాగ్ డెలివరీ, యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. పాటల్లో  పెద్దగా స్టెప్స్ వేయలేదు. అందుకు కారణం కూడా ప్రేక్షకుడికి అవగతమవుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎడిటింగ్, ట్యూన్స్, స్క్రీన్ ప్లే సినిమాలో డెప్త్ తగ్గించేశాయి. మొత్తం మీద పవర్ ప్యాక్ డ్ కమర్షియల్ థ్రిల్లర్ గా వచ్చిన  ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

చివరగా... ఆకట్టుకునే అసురపవర్ ప్యాక్ డ్ కమర్షియల్ థ్రిల్లర్



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు