అవును-2

April 04, 2015 | 12:34 PM | 56 Views
Rating :
అవును-2

నటీనటులు : హర్షవర్ధన్ రాణే, పూర్ణ, సంజన, రవివర్మ, చక్రవర్తి తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ- ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం- శేఖర్ చంద్ర, బ్యానర్- సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్, రచన-నిర్మాత-దర్శకత్వం- రవిబాబు

డిఫరెంట్ సినిమాలు చేయడంలో రవిబాబు ఓ విలక్షణ శైళిని చాటుకున్నాడు. అందుకే అతని సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టాయనే చెప్పాలి. వాటి నుండి మళ్లీ సక్సెస్ ట్రాక్ లో రావడానికి రవిబాబు చేసిన ప్రయత్నమే సేమ్ హర్రర్ ఎలిమెంట్ కాన్సెప్ట్ ఫార్ములా. తన గత హర్రర్ చిత్రం అవును సినిమాకి సీక్వెల్ గా రూపొందించిన అవును-2 మరి ప్రేక్షకులను ఏ మేర భయపెట్టిందో తెలుసుకోవాలంటే కథ తెలుసుకోవాల్సిందే...

కథ :

అవును ఎక్కడ ముగుస్తుందో అవును 2 సీక్వెల్ అక్కడే ప్రారంభం అవుతుంది. హర్ష(హర్షవర్ధన్ రాణే), మోహిని(పూర్ణ) కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మకి భయపడి ఉన్న ఫ్లాటును ఖాళీ చేసి సిటీలోని మరో ఫ్లాట్ లోకి వెళ్లిపోతారు. వారి జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో ఓ సాధువు మోహినికి కనపడి ప్రేతాత్మ సమస్య తీరపోలేదని, ఆ సమస్య నుండి బయటపడాలంటే అఘోరా యంత్రంను ఏడాది ధరించాల్సిందేనని చెప్పడమే కాక వెయ్యి రూపాయలకు ఆ యంత్రాన్ని అమ్ముతాడు. మరి ప్రేతాత్మ హర్ష, మోహినిలను ఏం చేస్తుంది? యంత్రం వల్ల వారికి ఏ లాభం చేకూరుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

పూర్ణ అందచందాలు, నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. పూర్ణ చీరకట్టులో చాలా అందంగా కనపడింది. ఆమెను గ్లామర్ గా రవిబాబు చక్కగా ప్రెజెంట్ చేశాడని చెప్పాలి. అలాగే హర్షవర్ధన్ రాణే కూడా తన పాత్రలో చక్కగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో హర్ష వర్ధన్ నటన ఆకట్టుకుంటుంది. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. సినిమాని అంతా ఒకే ఫ్లాట్ లో తీయడంలో తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేశాడు. ఇక హర్రర్ సినిమాలకు ప్రధాన భూమికైనా సంగీతం విషయంలోకి వస్తే శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా అక్కడక్కడా ఆకట్టుకోలేదనే చెప్పాలి. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చాలా బావుంది.

మైనస్ పాయింట్లు :

రవిబాబు సేమ్ రోటీన్ ఫార్ములాలో కథను రాసుకోవడం మైనస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రేక్షకుడికి సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి అవును సినిమా చూస్తున ఫీలింగే కలుగుతుంది. నిఖిత, సంజన రోల్స్ ఏ ఆర్టిస్ట్ అయినా చేయవచ్చు వారికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కథనంలో మరి ఆశించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. అసలు సాధువుకి ఆత్మ ఇంకా అక్కడే ఉందని ఎలా తెలుస్తుంది, అసలు అఘోరా యంత్రాన్ని వెయ్యి రూపాయలకు ఇవ్వడమేంటి అనేది కొన్ని అర్థం కానీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

చివరగా :

రవిబాబు సీక్వెల్ తీయాలనుకున్నప్పుడు ఏదైనా మరింత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఉంటే ఫలితం మరింత బావుండేదనిపించింది. ఇంతకు ముందు చెప్పినట్లు ‘లడ్డుబాబు’ వంటి డిఫరెంట్ ప్రయత్నం బెడిసి కొట్టిందని తనకి అచ్చివచ్చిన ఫార్ములాలో సినిమాతీయాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాల్సింది. కథను గ్రిప్పింగ్ గా నడిపించలేకపోయాడు. అయితే నటీనటులు పనితీరు. పూర్ణ నటనతో పాటు గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

 

చివరగా... రోటీన్ ఫార్ములానే కాకుండా కథ కూడా రిపిటేడ్ బాబు అనిపించాడు...మరి అవును 3 ఉంటుందని చెప్పకనే చెప్పాడు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు