భలే భలే మగాడివోయ్

September 04, 2015 | 05:30 PM | 14 Views
Rating :
భలే భలే మగాడివోయ్

నటీనటులు : నాని, లావణ్య త్రిపాఠి , మురళీ శర్మ, వెన్నెల కిషోర్ , అజయ్, నరేష్, సితార, మధుమిత, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి తదితరులు

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రహణం - నిజార్ షఫి, సంగీతం - గోపి సుందర్, బ్యానర్ గీతా ఆర్ట్స్ -2, యూవీ క్రియేషన్స్, నిర్మాతలు - బన్నీ వాస్ వంశీ, రచన దర్శకత్వం – మారుతి

ఓ ప్రత్యేక మైన జోనర్ తో టాలీవుడ్ తనకంటూ ఓ క్రేజ్ ను ఏర్పరుచుకున్నాడు యంగ్ దర్శకుడు మారుతి. కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువైనా కామడీ పాలు ఎక్కువ ఉండటంతో యూత్ లో మారుతి సినిమాలంటే మంచి ముద్ర పడింది. అలాంటి దర్శకుడు ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ (బ్యానర్ 2), యూవీ క్రియేషన్లు కంబైండ్ గా ఓ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక నాని టైమింగ్ యాక్టింగ్ కు పెట్టింది పేరు. స్వతహాగా టాలెంట్ ఉన్న నటుడు కావటంతో ఎటువంటి క్యారెక్టర్లయినా చేసుకుపోగలడు. ముఖ్యంగా కామెడీ తరహా వాటిల్లో అయితే చెలరేగిపోతాడు. మరి వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం వస్తే... మతిమరుపు మహారాజుగా నానిని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో భలే భలే మగాడివోయ్ గా ముందుకు తెచ్చాడు మారుతి. ఈ చిత్రం ఈ శుక్రవారం( సెప్టెంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వీరిద్దరి మ్యాజిక్ కి ప్రేక్షకులు నీరాజనం పట్టారా లేన్నది రివ్యూలోకి తొంగి చూద్దాం... 

కథ :

లక్కరాజు అలియాస్ లక్కీ( నాని) ఓ గజిని. ఓ పని చేస్తూ ఉన్నట్టుండి వేరేపనికి మళ్లీ అసలు పనిని మరిచిపోయే మతిమరుపు కింగ్.  ఓ ఎరువుల తయారీకి సంబంధించిన కంపెనీలో జూనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఇక మతిమరుపు అతని పాలిట శాపం. దీంతోనే అతనికి పెళ్లి కూడా అవదు. చివరికి పిల్లనిచ్చిన మామ (మురళి శర్మ) అతన్ని చూడటానికి వస్తే పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తో బాతాకాని కొడుతుండటంతో కాలి వారి వెళ్లిపోతారు. కానీ అనుకోకుండా అతడి కూతురు నందన (లావణ్య) లక్కీకి ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఐతే తనను అసహ్యించుకున్న వ్యక్తే  తనకు కాబోయే మావ అని లక్కీకి తెలుస్తుంది. ఇలాంటి స్థితిలో లక్కీ ఓ గేమ్ ఆడతాడు. కానీ, నిజం త్వరగానే బయటపడిపోతుంది. ఆ టైంలో లక్కరాజు ఏం చేశాడు?  సేమ్ టైంలో నందన ఫ్యామిలీకి ఎదురైన సమస్యను లక్కీ ఎలా తీర్చాడు. చివరకి ఆ జంట ఎలా ఒక్కటయ్యింది అన్నదే కథ...  

ఫ్లస్ పాయింట్లు:

లవ్ స్టోరీ, దానికి తోడు మతిమరుపు కాన్సెస్ట్. కామెడీ జోనర్ సినిమా దర్శకుడి ఎంపికకి ఇంతకన్నా సబ్జెక్ట్ ఏం కావాలి.  తనదైన కామెడీ స్టైల్ కి తీసిపోకుండా అదే టైంలో ప్రతిష్టాత్మక బ్యానర్ లు కావటంతో బూతు కంటెంట్ లేకుండా నీట్ గా చిత్రాన్ని తెరకెక్కించాడు మారుతి. ఇక నాని... ఈ చిత్రానికి హైలెట్ అండ్ మెయిన్ ఫిల్లర్. మతిమరుపు క్యారెక్టర్ తోపాటు లుక్స్ పరంగా కూడా సూపర్బ్ గా కనిపించాడు నాని. కామెడీ యాక్షన్ కి కొట్టిన పిండిలా ఎనర్జిటిక్ నటించి వావ్ అనిపించాడు. ఒకటి రెండు మాస్ సన్నివేశాలు ఉన్న అందులోనూ అలరించాడు.  ఇక లావణ్య విషయానికొస్తే నాని పక్కన క్యూట్ గా కనిపించింది. నటనలో కాస్త వెనుకబాటు తనాన్ని తన అందంతో కవర్ చేసేసింది. వీరి తర్వాత చెప్పుకోదగింది బాలీవుడ్ నటుడు మురళి శర్మ గురించి... చాలా కాలం తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ఆయన అలరించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో చివరిదాకా మరో ఫిల్లర్ లా చిత్రాన్ని ఆదుకున్నాడు. ఇక సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కడుపుబ్బా నవ్విస్తాడు. నాని తర్వాత నవ్వులన్నీ అతడివే. ఇక నరేష్, సితార,  ప్రవీణ్,  శ్రీనివాసరెడ్డి తమ తమ పాత్రలతో మెప్పించారు.

టెక్నికల్ విషయాలకొస్తే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ పెద్ద బ్యానర్ లు కావటంతో ఓ పెద్ద సినిమాని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. నిజార్ షఫి కెమెరా వర్క్ పనితనం బావుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. మ్యూజిక్ పరంగా గోపీసుందర్ మ్యాజిక్ చేశాడు. ఆడియో కన్నా వీడియో అద్భుతంగా ఉన్నాయి. ఇక డైలాగుల విషయానికొస్తే ఒకటి రెండు చోట్లు మారుతి బూతు పురాణం వినిపించినా మిగతా వాట్లో మాత్రం క్లీన్ యూ గా ఉంటుంది. 

మైనస్ పాయింట్లు :

ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ సెకంఢాఫ్ మరియు చివరగా వచ్చే క్లైమాక్స్ క్లారిటీ లేకపోవటం. అయితే క్లైమాక్స్ లో మంచి ఫన్ ఉన్నప్పటికీ కాస్త హడావుడిగా ముగియటంతో ప్రేక్షకులు తేలిపోతారు. ఇక విలన్ అజయ్ క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ లేదు. క్లైమాక్స్ ఫైట్ కోసమే ఆ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఓ మాస్ పాట సినిమా ఫ్లోను దెబ్బతీసింది. కొన్ని చోట్లు మరీ లాజిక్ దారుణంగా మిస్సయ్యింది. ఫర్ ఎక్సాంపుల్ హీరోతో ప్రేమలో పడే సన్నివేశంలో వగైరా... ఫస్టాఫ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగుతుందో... సెకంఢాఫ్ సాదాసీదాగా సాగిపోతుంది. కాస్త డ్రామటిక్ అంశాలు చివరి అరగంటలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి కాస్త బోర్ కొట్టిస్తాయి.

చివరగా :

ఆసక్తికరమైన మతిమరుపు అనే పాయింట్‌, నానిని హీరోగా ఎంచుకున్నప్పుడే మారుతి సగం హిట్ కొట్టేశాడు. ఇక ఈ  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’, థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని ఆద్యంతం కచ్ఛితంగా కట్టిపడేసే చిత్రం. ఫుల్‌గా నవ్వించే సినిమా. ఎలాంటి పాత్రనైనా తనదైన టైమింగ్‌తో చేసేసి మనల్ని కట్టిపడేసే నాని, తనదైన బ్రాండ్‌ను పక్కనపెట్టి చెప్పాలనుకున్న విషయాన్ని క్లీన్‌గా, అర్థవంతంగా నవ్విస్తూ చెప్పడంలో దర్శకుడు మారుతి చూపిన ప్రతిభ, నాని-లావణ్య త్రిపాఠిల క్యూట్ పెయిర్ ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక క్లారిటీ లేకుండా ముగిసిన క్లైమాక్స్, డ్రామాకు స్కోప్ ఉన్నా పూర్తిగా ఫన్‌నే నమ్ముకోవడం వంటివి ఈ సినిమాకు మేజర్ మైనస్‌పాయింట్స్.  అయినా మారుతి కామెడీ మార్క్, నాని టైమింగ్ ఆ మైనస్ లను పూడ్చివేస్తాయి. మొదట్నుంచీ చివరివరకూ నవ్విస్తూ, కొత్తదనంతో, సరదాగా, అందంగా సాగిపోయే కామెడీ ఎంటర్‌టైనర్..

చివరగా... ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదాగా సాగిపోతూ నవ్విస్తాడు... ఈ భలే భలే మగాడు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు