బెంగాల్ టైగర్

December 10, 2015 | 03:51 PM | 4 Views
Rating :
బెంగాల్ టైగర్

నటీనటులు : ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశీఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్రహ్మనందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్షవ‌ర్ధన్ రానే, పృథ్వీ, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ప్రభ‌, ర‌మాప్రభ తదిత‌రులు

సాంకేతిక వర్గం :

ఆర్ట్‌: డి.వై.స‌త్యరాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్ -ల‌క్ష్మణ్, సినిమాటోగ్రఫీ: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: భీమ్స్‌, బ్యాగ్రౌండ్ : చిన్నా, బ్యానర్ :శ్రీ సత్య సాయి ఆర్ట్స్,  నిర్మాత: కే.కే.రాధామోహన్,  క‌థ‌-మాట‌లు-స్ర్కీన్ ప్లే-ద‌ర్శక‌త్వం: సంప‌త్‌నంది

పవర్ స్టార్ తో ఛాన్స్ మిస్సయ్యాడు ఇంక ఇతనితో సినిమాలు ఎవరు తీస్తారంటూ అనుకుంటున్న సమయంలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు మాస్ రాజా. పవన్ కళ్యాణ్ తో తీద్దామనకున్న చిత్రానికి అనుకున్న టైటిల్ నే రవితేజ చిత్రానికి పెట్టేసి కథను మాత్రం పూర్తిగా మార్చానని చెప్పుకోచ్చాడు సంపత్ నంది. సినిమాలో కొత్తదనం ఏం ఆశించొద్దు అంటూ ముందే హింట్ ఇచ్చేశాడు. ఇక కిక్ 2 డిజాస్టర్ మార్కెట్ కోల్పోయి ఢీలా పడ్డ రవితేజకు ఈ చిత్రం కీలకం. మరి భారీ అంచనాలతో ఈరోజు(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర ఫలితం ఎలా ఉందో తెలుసుకోవాలంటే చలో రివ్యూ...

కథ :

ఆత్రేయపురంలో అల్లరి చిల్లరగా తిరిగే ఓ యువకుడు ఆకాశ్ నారాయణ(రవితేజ) పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు(అక్ష) ఫేమస్ అయితేనే చేసుకుంటా అని కండిషన్ పెడుతుంది. దీంతో హర్టైన మన హీరో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఓ మంత్రిని రాయిచ్చి కొట్టి, ఎలాగోలా హోంమంత్రి నాగప్ప(రావు రమేష్)ను దగ్గర పనిలో చేరతాడు. అతని గట్స్ నచ్చి తన కూతురు శ్రద్ధ(రాశిఖన్నా)కి గన్ మెన్ గా అపాయింట్ చేసేస్తాడు. ఇక మంత్రి కూతురు ఖాళీగా ఉండకుండా అతని ప్రేమలో పడిపోతుంది. చివరికి ఎలాగోలా మంత్రి వారి పెళ్లి ఒప్పుకున్న టైంలో  తాను సీఎం అశోక గజపతి(బోమన్ ఇరానీ) కూతురు మీరా(తమన్నా)ను ప్రేమిస్తున్నానంటూ ట్విస్ట్ ఇస్తాడు ఆకాశ్. కానీ, ఆ అమ్మాయికి ఇతనికి ఎలాంటి పరిచయం ఉండదు. అసలు ఇదంతా ఆకాశ్ ఫేమస్ కోసమే చేస్తున్నాడా? అసలు ఆకాశ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? అదే కథ...

ఫ్లస్ పాయింట్లు:

నటీనటుల విషయానికొస్తే రవితేజకిది అవాటైన పాత్రలే. గతంలో డాన్ శీను లాంటి సినిమాల్లో ఇదే తరహా క్యారెక్టర్లు చేశాడు. ఇక్కడ కూడా తన ఫుల్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా మాస్ కథాంశం కూడిన చిత్రం కావటంతో రెడ్ బుల్ యాక్షన్ ని కంటిన్యూ చేశాడు. చూడటానికి అక్కడక్కడ కాస్త ఎబ్బెట్టుగా కొట్టినప్పటికీ స్టైల్ లో మాత్రం అదరగొట్టాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇద్దరూ గ్లామర్ ను బాగా ఒలకబోశారు. రాశిఖన్నా ఓ సీన్లో బికినీలో మత్తెక్కిస్తే,  చూపులతో... పాటలో తమన్నా పిచ్చెక్కిస్తుంది. నటనపరంగా వీరిద్దరూ ఓకే.

సినిమాకు ఒకరకంగా రవితేజ తర్వాత ఫిల్లర్ గా నిలిచింది థర్టీ ఇయర్స్ పృథ్వీయే. ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా రెచ్చిపోయి థియేటర్లలో నవ్వులు పూయించాడు. అతనికి సపోర్ట్ గా సెలబ్రిటీ శాస్త్రిగా పోసాని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రవితేజ, పృథ్వీ, పోసాని మధ్య వచ్చే సీన్లు విజిల్స్ వేయిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మీ క్యారెక్టర్ సోసోగా ఉంది. మిగతావారు వారి వారి పరిధి మేర లో నటించారు.

 

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయ్యింది. ప్రతి ఫ్రేం, ప్రతి విజువల్ సినిమాని చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నాయి. రాధా మోహన్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉండడమే కాకుండా సినిమా విజువల్స్ పరంగా చాలా చాలా కలర్ఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే ని కాస్త ఆసక్తిగా రాసుకోగలిగాడు దర్శకుడు సంపత్ నంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అతని టేకింగ్ అద్బుతంగా ఉంది. గత చిత్రం రచ్చతో పోలిస్తే అతని టేకింగ్ ఇంకా మెరుగుపడింది.  

మైనస్ పాయింట్లు :

సినిమాలో రొటీన్ అంశాలే ఉంటాయని మరీ ఎక్కువ ఆశించొద్దని చివరి నిమిషంలో చెప్పాడు దర్శకుడు సంపత్ నంది. అన్నట్లు గానే సినిమాలో పెద్ద ట్విస్ట్ లు ఏమీ ఉండవు. ఒక్క ఆరు నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప మిగతాదంతా రోటీన్ స్టోరీయే. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాత కథనే సినిమాను తీశాడా అని అనిపించకమానదు. కానీ గుడిల్లో మెల్లలాగా ఫస్టాఫ్ చిత్రాన్ని కాస్త సేఫ్ జోన్ లోకి పడేస్తుంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. చిన్నా అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరీ గోలగా అనిపిస్తుంది. వెరసి హీరోయిన్లను మార్చి రవితేజతో డాన్ శీను మళ్లీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ చిత్రం. గౌతంరాజు ఎడిటింగ్ సెకండాఫ్ లో మరీ పేలవంగా ఉంటుంది.

చివరగా :

సినిమాకు బలం ఫస్టాఫ్ అని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా బెంగాల్ టైగర్ ను మలచటంలో సంపత్ నంది విఫలమయినప్పటికీ కాస్త కూస్తో ఎంటర్ టైన్ మెంట్ అందించటంతో ప్రేక్షకులు పెద్ద మనసుతో క్షమించేస్తారు. ఓ బడా లీడర్ ను రాయితో కొట్టడం, అతను పనిలో పెట్టుకోవటం, హోంమంత్రి దగ్గరకు చేరటం, సీఎం కూతురిని లవ్వాడటం, ఏకంగా సీఎంను పుట్ బాల్ ఆడేయటం ఇవన్నీ లాజిక్ లేనివి అయినప్పటికీ మధ్యలో కామెడీ అనే ఓ ఆయుధాన్ని, హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ అనే  మసాలాను జత చేర్చి తీశాడు. సినిమా మొత్తం సిల్లీగా అనిపించినప్పటికీ మాస్ రాజా ఎనర్జీ వాటిని కవర్ చేస్తుంది.

చివరగా... పరమ రొటీన్ మాస్ రాజా యాక్షన్ మసాలా. ఫస్టాఫ్, హీరోయిన్ల అందచందాలు, సిద్ధప్పగా పృథ్వీ నటన కోసం ఓసారి చూడొచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు