బెస్ట్ యాక్టర్స్

August 29, 2015 | 10:54 AM | 3 Views
Rating :
బెస్ట్ యాక్టర్స్

నటీనటులు : నందు, అభి, మధురిమ, షామిలి, మధు, నవీద్, క్రతీ, కేశ కంబటి తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ: విశ్వదేవ బత్తుల,  సంగీతం : జెబి, బ్యానర్ :  మారుతి టీం వర్క్స్, లవర్స్ సినిమా, నిర్మాత : కుమార్ అన్నంరెడ్డి ,  కథ, దర్శకత్వం : అరుణ్ పవర్        

మారుతి టీం వర్క్స్ సమర్పణలో సినిమా లవర్స్ సినిమా బ్యానర్ పై కుమార్ అన్నంరెడ్డి నిర్మించిన సినిమా ‘బెస్ట్ యాక్టర్స్’, జీవితంలో అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో యంగ్ యాక్టర్స్ నందు, అభి, మధు, నవీద్ హీరోలుగా నటించగా, వీరికి జోడీగా మధురిమ, షామిలి, క్రతీ, కేశ కంబటిలు హీరోయిన్స్ గా నటించారు. అరుణ్ పవర్ అనే యువదర్శకుడు ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఫుల్ కామెడీ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇది ప్రేక్షకులను అలరించిందో లేదో రివ్యూలోకి వెళ్దాం...

కథ :

నందు(నందు), మధు(మధు), అభి(అభి), కృష్ణ(నవీద్)లు చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్ కథే ఇది. నందు ఓ ఫ్యాషన్ డిజైనర్, ప్రేమ, పెళ్లి అనే వాటిపై నమ్మకం లేకుండా అమ్మాయిలతో జల్సా చేసే ఓ అబ్బాయి. మధు అటు తను ప్రేమించిన అమ్మాయికి ప్రేమని చెప్పుకోలేక, మరోవైపు జాబ్ లో ప్రమోషన్ రాక  బాధ పడుతుంటాడు. ఇక కృష్ణ మూడేళ్లుగా ప్రేమించిన అమ్మాయి హ్యాండివ్వటంతో బాధలో ఉంటాడు. అభి ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం కోసం తిరిగే ఓ కుర్రాడు. ఇలా తలా ఓ సమస్యలో ఉన్న వీళ్లంతా ఎంజాయ్ మెంట్ కోసం గోవా వెళ్తారు. అక్కడ కృష్ణ కి మీనాక్షి అయ్యర్(క్రతీ) పరిచయం అయి అది కాస్తా ప్రేమగా మారుతుంది. గోవాలో అమ్మాయిల వేటలో ఉన్న నందు, మధులకు జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)లు ఎదురవ్వటం, ఆ మరుసటి రోజే వారి మధ్య జిల్ జిల్ జిగా జిగా అయిపోవడం జరుగుతుంది. కట్ చేస్తే ఆ మరుసటి వారిద్దరు కనబడకుండా  నందు, మధులకు ఫోన్ చేసి మాలో ఒక్కరికి ఎయిడ్స్ ఉంది, అంటే మీ ఇద్దరిలో కూడా ఒకరికి ఎయిడ్స్ అని చెప్పి పెట్టేస్తారు. దాంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి నందు – మధులు పడే ఇబ్బందులు.. అసలెందుకు జయసుధ, జయప్రదలు నందు, మధులను టార్గెట్ చేసారు. అసలు జయసుధ, జయప్రదల ఫ్లాష్ బ్యాక్ ఏంటి.? అసలు వారికి నిజంగా ఎయిడ్స్ ఉందా? ఉంటే ఇద్దరిలో ఎవరు పోతారు అన్న విషయాలు తెరపై చూడాల్సిందే... 

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాకి మారుతి టీం వర్క్స్ అన్న బ్రాండ్ మొదటి ఫ్లస్ పాయింట్. దాని వల్లే చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ఇక నటీనటుల విషయానికి వస్తే ముఖ్య పాత్రలో నటించిన నందు చిత్రానికి మెయిన్ పిల్లర్. ఎనర్జీ లెవల్స్ తన పాత్రకి తగ్గట్టు ఉండటంతో చాలా బాగా హెల్ప్ అయ్యింది. అన్ని సీన్స్ లోనూ బాగా చేసాడు. అభి తన పాత్రలో బాగానే నవ్వించాడు. తన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ మాడ్యులేషన్ కూడా బాగుంది. చిన్న పాత్రే అయినా సినిమాకి కీలకం అయిన పాత్రలో షామిలి చూడటానికి బ్యూటిఫుల్ గా ఉంటూనే, ఎక్స్ పోజింగ్ తోపాటు మంచి నటనని కబరించింది. ఈ మూవీతో పరిచయం అయిన క్రతీ బాగుంది. లవ్ సీన్స్ లో బాగా చేసింది. ఈ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ మధురిమ మరియు కేశ కంబటి. వీరిద్దరూ కనిపించే ప్రతి సీన్ లో అందాల ఆరబోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో వీరివి సినిమాని టర్న్ చేసే పాత్రలు. పెర్ఫార్మన్స్ తో పాటు అందాల ఆరబోత బాగా ఎక్కువ చేసిన వీరిద్దరూ ముందు బెంచ్ వారిని బాగా ఆకట్టుకుంటారు. ఇక కిట్టు రాసిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి. కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా అలరిస్తాయి. మొదట్లో తరుణ్ వాయిస్ ఓవర్ తో పాత్రలని పరిచయం చేసిన విధానం అందరినీ నవ్వించేలా ఉంది. ఆ తర్వాత సప్తగిరి ఇంట్రడక్షన్ సీన్, అక్కడ తను చెప్పే ఇష్యూ బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇకపోతే చివర్లో తాగుబోతు రమేష్ చేయ చేయించిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే క్లైమాక్స్ లో ట్విస్ట్ లని రివీల్ చేసి అన్నిటికీ క్లారిటీ ఇచ్చే సీన్ చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా రిచ్ గా చాలా బాగుంది. 

మైనస్ పాయింట్లు :

కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటప్పుడు కామెడీ అన్నా ఎక్కువ ఉండి, ఒకే ఒక్క సస్పెన్స్  పాయింట్ తో ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చూపించాలి. లేదా థ్రిల్ అయ్యే పాయింట్ ను చూపిస్తూ అదే సమయంలో బాగా నవ్వించగలగాలి. కానీ ఈ రెండింటిలో ఏదీ ఈ సినిమాలో జరగలేదు. సినిమా మొదట్లో బాగున్న రాను రాను బోర్ కొట్టించేస్తుంది. పంచ్ డైలాగులతోనే సినిమాని లాగించేద్దామనుకోవటం బెడిసి కొట్టింది. ఎయిడ్స్ ఉందన్న తర్వాత థ్రిల్ అయ్యే ప్రేక్షకులకు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయించటంలో దర్శకుడు విఫలమయ్యాడు. ట్విస్ట్ ను, సస్పెన్స్ ను కంటిన్యూ చేద్దామనుకున్న అది వర్కవుట్ కాలేదు. మళ్ళీ కామెడీ చూపించాలని ట్రై చేసిన అది పని చేయలేదు.  వీటన్నిటికి మించి లవ్ స్టొరీలలో లీడ్ పెయిర్స్ మధ్య కెమిస్ట్రీ లేదు, అలాగే ఎమోషనల్ సీన్స్ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. దర్శకుడు అరుణ్ పవార్ కథా విస్తరణలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ని బాగా రాసుకున్నప్పటికీ మిగతా స్టోరీ వల్ల అదంతా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. మొత్తంగా ఈ సినిమా 2013లో వచ్చిన ‘నీకోన్జాచా’ అనే మలయాళ మూవీకి అనధికారిక రీమేక్ అలియాస్ ఫ్రీమేక్.

చివరగా :

‘బెస్ట్ యాక్టర్స్’ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకునే స్థాయికే పరిమితం అయిపోయింది. సినిమాలో కొన్ని కొన్ని ఎపిసోడ్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న దర్శకుడు అరుణ్ పవార్ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. బెస్ట్ యాక్టర్స్ లో బెస్ట్ పాయింట్లు చూసుకుంటే సినిమా మొదటి 15 నిమిషాలు, క్లైమాక్స్ 15 నిమిషాలు, ఇంటర్వల్ బ్లాక్ ట్విస్ట్, ఒకటి రెండు కామెడీ సీన్స్ మరియు మధురిమ, కేశ కంబటిల అందాల ఆరబోత. అంతే తప్ప ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేదు.

 

చివరగా... ది బెస్ట్ మాత్రం కాదు... జస్ట్ యావరేజ్. 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు