భలే మంచి రోజు

December 26, 2015 | 03:13 PM | 2 Views
Rating :
భలే మంచి రోజు

నటీనటులు : సుధీర్ బాబు, వామిక గబ్బి, సాయికుమార్, పరుచూరి గోపాలకృష్ణ, పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధన్యబాలకృష్ణ, ప్రవీణ్, వేణు, తదితరులు

సాంకేతిక వర్గం :

ఎడిటింగ్ : ఎంఆర్ వర్మ, డైలాగ్స్ : అర్జున్ – కార్తీక్ సినిమాటోగ్రఫీ: శాందత్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, సంగీతం : సన్నీ ఎం.ఆర్, నిర్మాత : విజయ్ – శశి, దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

మహేష్ బావగా ఇండస్ట్రీకి పరిచయమై ఒక్క సినిమా తప్ప (ప్రేమకథా చిత్రమ్) అసలు సక్సెస్ లేకుండా పోయాడు హీరో సుధీర్ బాబు. ఈ యేడు రెండు చిత్రాలు వచ్చినప్పటికీ వచ్చినవి వచ్చినట్లు పోయాయి. ఇక ఇప్పుడు చివర్లో భలే మంచి రోజుగా వచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కలిసి ప్రయోగాత్మకంగా కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కించాడు. ట్రైలర్ ఢిపరెంట్ గా తోచటంతో చిత్రంపై ఆశలు బాగానే పెంచాయి. వామికా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాయికుమార్ లాంటి కీలకనటులు ఉన్నారు. మరీ ఇంతకు ముందు వచ్చిన కిడ్నాప్ డ్రామాల్లాగా ఇది బోర్ కొట్టించిందా లేక ఆకట్టుకుందా చూద్దాం... సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ కు మంచి రోజును ఇచ్చిందా? రివ్యూలోకి వెళ్దాం...   

కథ :

ప్రేమలో ఫెయిల్ అయిన రామ్ (సుధీర్ బాబు) మరియు పెళ్ళి కోసం పిచ్చిదానిలా ఎదురుచూస్తున్న సీత(వామిక గబ్బి)ల జీవితంలో ఒక్క రోజు ఏం జరిగింది అన్నదే ఈ భలే మంచి రోజు కథ. ఉండ్రాజవరంలో సీత పెళ్లికి హడావుడి మొదలైంది. అంతలో పెళ్లి కొడుకు లేచిపోవడంతో ఆ తంతు ఆగిపోతుంది. అప్పుడే శక్తి(సాయి కుమార్) మనుషులు సీతని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే.. తనని కాదని వేరెవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన తన గర్ల్ ఫ్రెండ్ మాయ(ధన్య బాలకృష్ణ)ని పెళ్లి పందిరిలోనే కొట్టడానికి బయలు దేరతాడు రామ్. అలా వెళ్తున్న టైంలో ఓ వెహికిల్ ను గుద్దుతాడు. ఆ సంఘటనలో గుద్దిన కారులో ఉన్న ఉన్న సీత పారిపోతుంది. దాంతో శక్తి మనుషులు రామ్ ఫ్రెండ్ ఆది(ప్రవీణ్)ని వారి దగ్గర పెట్టుకొని సీతని వెతికి తీసుకొచ్చి ఆదిని తీసుకెళ్ళమంటారు. దాంతో సీత వేటలో పడిన రామ్, మొదట కిడ్నాపర్స్ అయిన ఈశు – ఆల్బర్ట్ లను కలుస్తాడు. ఇక వారితో రామ్ జర్నీ ఎలా సాగింది. ఫైనల్ గా సీతని పట్టుకున్నారా? సీతని పట్టుకున్నాక రామ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? సీత వలన రామ్ జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? ఫైనల్ గా రామ్ సీతనీ శక్తికి అప్పగించి ఆదిని కాపాడుకున్నాడా?

ఫ్లస్ పాయింట్లు:

ఓ లవ్ ఫెయిల్యూర్ కుర్రాడిగా సుధీర్ బాబు బాగా నటించాడు. కామెడీ టచ్ ఉన్న పాత్ర చేసాడు. చాలా సందర్భాలలో సుదీర్ బాబు హావ భావాలు చాలా మెచ్యూర్ గా ఉంటాయి. ఎమోషనల్ సీన్లో తడబడినప్పటికీ ఓవరాల్ గా తన పాత్రకి సుధీర్ పూర్తి న్యాయం చేసాడు. ఇక పంజాబీ ముద్దుగుమ్మ వామిక గబ్బి బబ్లీగా ఉంది. మాట్లాడే సీన్లు తక్కువే అయినప్పటికీ ఎనర్జీ లెవల్స్ మాత్రం సూపర్బ్. లిప్ మూమెంట్లు సింక్ అయ్యేలా బాగా చేసింది. వీరి తర్వాత సాయికుమార్ సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. కూల్ విలన్ గా చాలా బాగా చేసాడు. పోసాని మరోసారి తన మార్క్ చూపాడు. చివర్లో వచ్చే 30 ఇయర్స్ పృధ్వీ అభిమానులకు షాక్ ఇవ్వటంతోపాటు క్లైమాక్స్ లో పగలబడి నవ్వించేలా చేసాడు. మిగతావారు పరిధి మేర నటించారు.

టెక్నికల్ విషయాలకొస్తే... ప్రతి ఒక్కరూ దాదాపు చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శాందత్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎప్పుడూ కలర్ఫుల్ విజువల్స్ చూస్తున్న తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా సినిమాటోగ్రఫీ కాస్త కొత్తగా అనిపిస్తుంది. డార్క్ క్రైమ్ కామెడీ మూవీ కావడం వలన వాడిన లొకేషన్స్, ఆ లొకేషన్స్ ని చూపిన విధానం చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. సన్నీ ఎంఆర్ పాటలు బాగున్నాయి, విజువల్ గా చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ క్రియేట్ చేసిన సెట్స్ మరియు షూట్ కోసం సెలక్ట్ చేసిన లొకేషన్స్ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఓవరాల్ గా ఓకే. అర్జున్ – కార్తీక్ డైలాగ్స్ బాగున్నాయి.

దర్శకుడైన శ్రీరామ్ ఆదిత్య కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలోనే కాదు, ఓ డీసెంట్, డిఫరెంట్ అటెంప్ట్ సినిమాని అందించడంలో సక్సెస్ అయ్యాడు.క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కామెడీ చాలా పార్ట్స్ లో బాగా వర్కౌట్ అయ్యింది. అలా అని రెగ్యులర్ స్టైల్ లో పంచ్ డైలాగ్స్ తో కూడిన కామెడీ కాకుండా సందర్భానుసారంగా వచ్చే కామెడీ ఎక్కువగా సినిమాలో ఉండడం వలన ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ పెదవులపై నవ్వు కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాని మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికర మలుపులతో బాగానే లాక్కొచ్చాడు. ప్రతి ఒక్క పాత్రని రాసుకున్న విధానం, దాన్ని ప్రెజంట్ చేసిన విధానమే సినిమాకి పెద్ద హైలైట్. పేరుకి లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అనే ఫీలింగ్ కలిగేలా విజయ్ – శశిల నిర్మించారు.

మైనస్ పాయింట్లు :

కాన్సెప్ట్ పరంగా, ఫస్ట్ హాఫ్ పరంగా బాగా కొత్తగా అనిపించినా, ఎంటర్టైన్ చేసినా సెకండాఫ్ అనేది సరిగా లేకపోవడం మరియు చాలా విషయాలను పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయలేదు. కొత్త దర్శకుడు కావటంతో కొన్నిసీన్లలో మెచ్యూరిటీ ఇంకా కనపడలేదు. సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తిగా, అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ తో బాగా సాగుతుంది. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. అయితే కాస్త స్లో సాగిపోవటంతో అక్కడక్కడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక పాటలు కూడా సినిమాకి అవసరం లేదు అనిపిస్తుంది. అయితే పాత్రలను మలిచిన విధానంతో అ మైనస్ లు బాగానే కవర్ చేయగలిగాడు.

చివరగా :

ఈ యేడు వచ్చిన చిత్రాలన్నీ పరమ రెగ్యులర్ సినిమా అనిపించుకోవడం జరిగింది. దాదాపు 98% సినిమాలకు ఇదే జరిగింది కూడా. అయితే ఆ రొటీన్ ఫ్లేవర్ నుంచి బయటకి తీసుకు వస్తూ ఓ డిఫరెంట్ అటెంప్ట్ గా చెప్పుకోదగిన సినిమా 'భలే మంచి రోజు'. ముఖ్యంగా సెకండాఫ్ తో పాటు సినిమాకే హైలైట్ అయ్యింది క్లైమాక్స్ లో పృధ్వీ చేసిన కామెడీ ఎపిసోడ్. అలా అలా సాగుతున్న సినిమాని ఒక్కసారిగా నవ్విస్తూ పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్ళి మంచి ఫీల్ తో సినిమాకి శుభం కార్డ్ వేయడం మస్త్ అనిపిస్తుంది.

చివరగా... ఈ యేడు చివర్లో మూస సినిమాల నుంచి కాస్త ఊరట కలిగించి రిలీఫ్ ఇచ్చే సినిమా భలే మంచి రోజు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు