చీకటి రాజ్యం

November 20, 2015 | 04:21 PM | 0 Views
Rating :
చీకటి రాజ్యం

నటీనటులు : కమల్ హాసన్, త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ రాజ్, కిషోర్, ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతు తదితరులు

సాంకేతిక వర్గం :

డైలాగులు: అబ్బూరి రవి, ఎడిటర్: షాన్ మొహమ్మద్, సినిమాటోగ్రఫీ: జన వర్గీస్, ఆర్ట్ : ప్రేమ్ నవస్, యాక్షన్ స్టంట్స్: గిల్లెస్ కాన్సీల్, రమేష్, సంగీతం : జిబ్రాన్, నిర్మాత : చంద్రహాసన్ – కమల్ హాసన్, దర్శకత్వం : రమేష్ ఎం సెల్వ

లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’. ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, మధు శాలిని, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డ్రగ్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సరికొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్ కి రాజేష్ ఎం సెల్వ డైరెక్టర్. తమిళంలో ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలయ్యింది. తెలుగు ప్రేక్షకులకి బాగా తక్కువ పరిచయం ఉన్న ఈ జానర్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం...

కథ :

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దివాకర్(కమల్ హాసన్). చాలా నిజాయితీపరుడైన అయిన దివాకర్ ఓ సారి డబ్బు కోసం తన సహా ఉద్యోగి మణి(యుగి సేతు)తో కలిసి వేరేవాళ్ళు స్మగుల్ చేస్తున్న కొకెయిన్ పాకెట్స్ ని కొట్టేస్తారు. ఈ క్రమంలో కమల్ బ్యాచ్ కొకెయిన్ బ్యాచ్ లో ఒకడిని చంపేస్తారు. దాంతో ఆ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేట్ చేయడానికి నార్కోటిక్ ఆఫీసర్స్ అయిన మోహన్(కిషోర్), మల్లిక(త్రిష) రంగంలోకి దిగుతారు. కట్ చేస్తే ఆ కొకెయిన్ పాకెట్స్ మాదాపూర్ లో ఇన్సోమియా అనే నైట్ క్లబ్ నడిపే విఠల్ రావు(ప్రకాష్ రాజ్)కి సంబంధించినవి. విఠల్ రావు కి ఆ కొకెయిన్ పాకెట్స్ చాలా అవసరం, దాంతో అవి కొట్టేసింది దివాకర్ అని తెలుసుకొని తన కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసి తన కొకెయిన్ ఇచ్చేస్తే కొడుకును రిలీజ్ చేస్తానని, కొకెయిన్ తీసుకొని తన ఇన్సొమియా పబ్ కి రమ్మంటాడు. అలా బయలుదేరిన దివాకర్ ని మల్లికా కూడా ఫాలో చేస్తుంది. కొడుకును విడుదల చేసుకోవడానికి బయలుదేరిన దివాకర్ ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ ఏమిటి? ఫైనల్ గా దివాకర్ తన కొడుకును కాపాడుకున్నాడా లేదా?  అసలు దివాకర్ ఏ కారణంతో ఆ కొకెయిన్ దొంగతనం చేసాడు అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

ముందుగా కమల్ హాసన్ గురించి చెప్పుకోవాలి.. ఒక నార్కోటిక్ పోలీస్ ఆఫీసర్ గా కమల్ హాసన్ పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఒకవైపు సీనియర్ పర్సన్ గా, కొడుకును రక్షించుకోవాలనే ఫాదర్ గా, పోలీస్ గా అతను చూపిన హావ భావాలు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. చీకటి రాజ్యం సినిమాకి మెయిన్ పిల్లర్ కమల్ హాసన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. త్రిష ఒక టఫ్ పోలీస్ గర్ల్ గా కమల్ కి మంచి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యా వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకొస్తాయి. త్రిషకి సపోర్ట్ గా చేసిన కిషోర్ కూడా పోలీస్ గా నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా పలికించాడు. ఇకపోతే మెయిన్ విలన్స్ గా కనిపించిన ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ లు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు. వీరిద్దరి పాత్రల్లో సీరియస్ తో పాటు కాస్త హ్యూమర్ ని కూడా పండించడం ప్రేక్షకుల పెదవులపై కాస్త నవ్వును తెప్పిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో కనిపించిన మధు శాలిని తన గ్లామర్ తో కాసేపు యువతని ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల పరంగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆశా శరత్, అమన్ అబ్దుల్లా, యుగి సేతు తదితరులు తమ పాత్రల పరిధి మేర చేసారు.

                               టెక్నికల్ విషయాలకొస్తే... జన వర్గీస్ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది, యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లో చూపిన కెమెరా యాంగిల్స్, విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే ప్రేమ్ నవస్ ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్సోమియా పబ్ సెట్ ని వేసిన తీరు చాలా చాలా బాగుంది. ఇకపోతే జిబ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్. ప్రతి సన్నివేశంలోనూ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాని చాలా ఎలివేట్ చేసింది. ఎడిటర్ షాన్ మొహమ్మద్ ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా ఎడిట్ చేసాడు. అబూరి రవి డైలాగ్స్ బాగున్నాయి. గిల్లెస్ కాన్సీల్, రమేష్ యాక్షన్ స్టంట్స్ కూడా సినిమ మూడ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. చివర్లో వచ్చే ఒకే ఒక్క పాటని సూపర్బ్ గా ఎడిట్ చేశారు, సో డోంట్ మిస్ ఇట్. చంద్రహాసన్ – కమల్ హాసన్ నిర్మాణ విలువలు మాత్రం సూపర్బ్ అనేలా ఉన్నాయి. రాజేష్ టేకింగ్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

మైనస్ పాయింట్లు :

సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమా అంత గ్రిప్పింగ్ గా సాగలేదు. అలాగే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే సెకండాఫ్ ని బాగా సాగదీసేసారు. ముఖ్యంగా మన నేటివిటీ కోసం యాడ్ చేసుకున్న కొన్ని సీన్స్ సినిమాని కాస్త స్లో చేసాయే తప్ప సినిమాకి పెద్ద హెల్ప్ అవ్వలేదు. క్లైమాక్స్ లో మేజర్ ఫైట్ అయిపోయాక వచ్చే కొన్ని సీన్స్ సినిమాకి పెద్ద అవసరం లేదు. మరో మైనస్ సినిమా రన్ టైం.. తక్కువే అయినప్పటికీ చాలా చోట్ల బాగా డ్రాగ్ చేయడం వలన ఈ షార్ట్ రన్ టైం కూడా లాంగ్ గా ఉందనే ఫీలవుతుంది. సినిమాలో ఆడియన్స్ ని థ్రిల్ చేసే ఒక్క థ్రిల్లింగ్ పాయింట్ కూడా లేకపోవడం చెప్పుకోదగిన మరో మైనస్ పాయింట్. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది దాచి పెట్టడమే ఈ సినిమాకి కీలకం కానీ కథనంలో ఆ విషయాన్ని ఫస్ట్ లోనే రివీల్ చేసెయ్యడం చూసే ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వదు.

చివరగా :

సరికొత్తగా అనిపించే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘చీకటి రాజ్యం’ సినిమా డిఫరెంట్ సినిమా కోరుకునే తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ అందరినీ కట్టి పడేయడమే కాకుండా సెకండాఫ్ ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ని క్రియేట్ చేయడం సినిమాకి సూపర్బ్ హెల్పింగ్ పాయింట్.

చివరగా... కమల్ మార్క్ నటనతో కూడిన డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు