చిన్నదాన నీకోసం

December 25, 2014 | 04:21 PM | 26 Views
Rating :
చిన్నదాన నీకోసం

నటీనటులు : నితిన్, మిస్తీ చక్రవర్తి (తొలి పరిచయం), నాజర్, నరేష్, సితార, ఆలీ తదితరులు

సాంకేతిక వర్గం :

మాటలు: హర్షవర్థన్, కెమెరా: అండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరుణాకరన్

రికార్డు స్థాయి ఫ్లాపులతో కెరీర్ చావో రేవో అన్న దశల నితిన్  ‘ఇష్క్’,’గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. మరి అలాంటి లవర్ బాయ్ నితిన్ తో లవ్ విత్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన దర్శకుడు కరుణాకరన్ తో కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అదే ‘చిన్నదాన నీకోసం’ చిత్రం. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నితిన్ తన హోం బ్యానర్ లో చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

కథ :

తన స్టడీస్ ని పూర్తి చేసుకున్న నితిన్ (నితిన్) పనిపాట లేకుండా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడడంతో రెడ్డిగారు(నాజర్) అనే పెద్దాయనకు నితిన్ కి ఫ్యాన్ అయిపోతాడు. అదే సమయంలో నందిని(మిస్తీ) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో నితిన్ ని అస్యహించుకునే నందిని తర్వాత అతను రెడ్డిగారికి బాగా క్లోజ్ అని తెలియడంతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది(నటిస్తుంది). దీంతో నితిన్ నందిని కూడా తనని ప్రేమిస్తుందని అనుకుంటాడు. అలా తన వల్ల రెడ్డి తో పరిచయం పెంచుకున్న నందిని, ఒకరోజు తనకే తెలియకుండా ఆ పెద్దాయనని తీసుకొని బార్సిలోనా వెళ్ళిపోవటంతో నితిన్ షాక్ తింటాడు. తనతో ప్రేమ డ్రామాతోపాటు తన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆడుకున్న నందినికి బుద్ధి చెప్పడానికి నితిన్ కూడా బార్సిలోనా వెళ్తాడు. అక్కడ నందికి పెళ్లి అల్రెడీ పెళ్లి సెటిలయిన విషయం తెలుసుకుంటాడు. అప్పుడు నితిన్ ఏం చేసాడు.? ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడు.? అసలు నందినికి రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి.? అన్నది కథ.

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచిన వాటిలో ముందుగా చెప్పాల్సినవి... ఆండ్రూ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు నితిన్. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ బాగా ఆరితేరిన నితిన్ ఈ సినిమాలో కూడా లవర్ బాయ్ గా మంచి పెర్ఫార్మన్సే ఇచ్చాడు. అతని ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. ముఖ్యంగా గత సినిమాలతో పోలిస్తే ఇందులో డాన్సులు అద్భుతంగా వేసి తనలోని బెస్ట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. లుక్స్ విషయానికి వస్తే ప్రతి సినిమాలో ఎదో ఒక వేరియేషన్ చూపిస్తున్న నితిన్ ఇందులో కూడా ఓ న్యూ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. నితిన్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ పాత్రకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఆండ్రూ బార్సెలోనా అందాలను అంతకంటే అందంగా తన కెమెరాతో షూట్ చేసి మనకు చూపించాడు. రొమాంటిక్ సీన్స్ లో అనూప్ అందించిన బ్యాక్ గ్ర్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. నితిన్, అతని పేరెంట్స్ గా నటించిన నరేష్- సితారల మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. హీరో చెల్లి పాత్ర అమ్మాయి కూడా బాగానే ఉంది. అలాగే ఫస్టాఫ్ అంతా దాదాపుగా ఎంటర్ టైన్ మెంట్ గానే సాగిపోతుంది. ముఖ్యంగా సెకాంఢాఫ్ లో వచ్చే ‘గే’ కామెడీ బాగా నవ్విస్తుంది. నితిన్ కి జోడీగా నటించిన బాలీవుడ్ భామ మిస్తీ ఓకే అనిపించుకుంది. ఫస్ట్ హాఫ్ లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ భామ సెకండాఫ్ లో మోడ్రన్ డ్రస్సుల్లో ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్, రఘు చేసింది చిన్న పాత్రలే అయినా ప్రేక్షకులను బాగా నవ్వించారు. నాజర్ పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇకపోతే సినిమా హర్షవర్ధన్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ లో వచ్చే టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ అనేది ఎంత ఫ్లస్సో... సెకండాఫ్ అంత మైనస్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే మొదటి పది నిమిషాల్లోనే అసలు కథ మొత్తం చేసేసారు. అక్కడి నుంచి మరో పది నిమిషాల్లో ముగించేయాల్సిన పాయింట్ ని సాగదీసి ఒక గంట తీసాడు. దానికోసం అనవసరం అయిన కామెడీ సీన్స్ రాసుకొని సినిమాని బోర్ కొట్టించేసారు. ఇప్పటివరకూ తన చిత్రాలలో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని లిమిట్ గా చాటుకున్న (వాడుకున్న) నితిన్ ఈ సినిమాలో కాస్త ఎక్కువ చేశాడనే చెప్పాలి. ఫస్టాఫ్ లో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీయడం, అలాగే సెకండాఫ్ లో వచ్చే కౌ బాయ్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ నితిన్ ని రక్షించటం (నిజం కాదు లేండి... ‘బద్రి’ సినిమాలో ‘హే చికితా’ సాంగ్ లో వచ్చే కొన్ని క్లిప్స్ ని వాడుకున్నాడు) కాస్త అతిగా తోస్తాయి. సాధారణంగా కరుణాకరణ్ చిత్రాలలో తెల్ల డ్రెస్సులలో హీరోయిన్ ఇంట్రడక్షన్ చూస్తేనే ప్రేక్షకులకు ‘ఫీల్’ కలుగుతుంది. కానీ ఇందులో ఏ ఫీల్ లేకుండా చప్పగా ఉంది. ఎప్పుడూ సిచ్యువేషనల్ కామెడీతో ఆడియన్స్ ని నవ్విస్తాడు కరుణాకరన్. కానీ సెకండాఫ్ లో ఆ ఎలిమెంట్ ను మిస్ చేసాడు. ఇకపోతే క్లైమాక్స్ ని కూడా సరిగా డీల్ చెయ్యలేదు. క్లారిటీ ఇవ్వకుండా ఏదో హడావిడిగా ముగించేసినట్టు అనిపించడమే కాకుండా ప్రేక్షకులు బోరింగ్ గా ఫీలవుతారు. నితిన్ గత చిత్రాలలో బాగా వాడిన ఆలీని ఇందులో వేస్ట్ చేశారు. మిస్తీ తల్లిగా చేసిన అశ్విని, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ధన్య బాల కృష్ణ పాత్రలు కూడా అంతే. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని పాటలు కూడా సందర్భానుసారంగా రావు. దాంతో ఆడియన్స్ కి పాటల పైన పెద్ద ఆసక్తి కలగదు.

చివరగా :

అల్రెడీ హ్యాట్రిక్ పూర్తిచేసుకున్న నితిన్ సొంత బ్యానర్ హ్యాట్రిక్ హిట్ కోసం చేసిన ప్రయత్నం అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదనే చెప్పాలి. గత చిత్రాలతో పోలిస్తే నితిన్ ఫెర్ఫార్మెన్స్ పాలు ఇందులో తగ్గిందనే చెప్పాలి. గత చిత్రాలలో ఎంటర్ టైన్ మెంట్ ని జాగ్రత్తగా హ్యండిల్ చేసిన నితిన్ ఇందులో ఫేలయ్యాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అసలు ఇదీ నితిన్ స్థాయి నటన కాదనేమో అనిపిస్తుంది. ఇక ఎందుకంటే ప్రేమంట మినహా మిగతా అన్ని చిత్రాలలో బేసిక్ ఎలిమింటెగా కామెడీ ట్రాక్ తో హిట్లు అందుకున్న దర్శకుడు కరుణాకరణ్ ఈ ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ ను నడిపినంత ఎంటర్ టైన్ గా సెకాండాఫ్ ను నడిపించలేకపోయాడు. నటన పరంగా కూడా మిస్తీని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఇక నితిన్ పవన్ భజన కాస్తా ఎక్కువయ్యిందనే చెప్పుకోవాలి. అక్కడక్కడా కొంచెం తొలిప్రేమ చిత్ర వాసనలు కొడతాయి.

చివరగా ఫీల్ లేని లవ్ స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక నితిన్ గత చిత్రాల మాదిరిగా ఇది కూడా ఉంటుందని ఆశించి వెళ్లితే మీకు నిరాశే మిగులుతుంది. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, నితిన్ చేసిన పెర్ఫార్మన్స్ కోసం ఒక్కసారి చూడోచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు