సినిమా చూపిస్త మావ

August 14, 2015 | 12:24 PM | 8 Views
Rating :
సినిమా చూపిస్త మావ

నటీనటులు : రాజ్ తరుణ్, అవిక గోర్, రావు రమేష్, తోట మధు, తదితరులు

సాంకేతిక వర్గం :

సంగీతం : శేఖర్ చంద్ర, నిర్మాత : బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్‌, రూపేష్‌.డి, జి.సునీత, దర్శకత్వం : త్రినాథరావు నక్కిన

రేసుగుర్రం సినిమాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ లిరిక్ ని టైటిల్ గా పెట్టి చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. అంటూ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు దర్శకుడు త్రినాథరావు. ఈయన గతంలో తనీష్ హీరోగా మేం వయసుకు వచ్చాం అనే ఓ హర్ట్ టచింగ్ మూవీని తీశాడు. ఇక మరోవైపు ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ – అవిక గోర్ జంట ఇందులో హీరోహీరోయిన్లుగా నటించింది. మరి మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట రెండవ సినిమాతో కూడా హిట్ పెయిర్ అనిపించుకుందా లేదా తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్దాం...

కథ :

చాలా తెలుగు సినిమాల్లోలానే.. చదువు సంధ్యలు పెద్దగా అబ్బవు, దాంతో ఇంటర్మీడియట్ కూడా రెండు సార్లు తప్పి తన తండ్రి చేత తిట్టించుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు మన హీరో కత్తి (రాజ్ తరుణ్). కట్ చేస్తే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీగా పనిచేస్తూ ప్రతి దాన్లోనూ క్వాలిటీ ఉండాలని స్ట్రాంగ్ గా ఫీలయ్యే సోమనాథ్ చటర్జీ (రావు రమేష్) గారి అమ్మాయి, చదువుల తల్లి సరస్వతి అయిన పరిణీత(అవిక గోర్)నే మన హీరోయిన్. ఎప్పుడు చదువు చదువు అని అని ఫీలయ్యే పరిణీతని చూసి మన కత్తి ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుంచి రోజు తన వెంటపడి, అల్లరి పనులన్నీ చేసి ఫైనల్ గా పరిణీతని చూసి ప్రమలో పడేస్తాడు. ఇద్దరి లవ్ స్టొరీ బాగుంటుంది. ఇక వీరి వ్యవహారం సోమనాథ్ చటర్జీ దగ్గరికి చేరుతుంది. అల్లరి చిల్లరిగా బాధ్యతా లేకుండా తిరిగే కత్తి అంటే సోమనాథ్ కు అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన కూతురు కూడా ఇష్టపడుతుందన్న కారణం చేత సోమనాథ్ కత్తికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తను ఇచ్చిన నెల రోజుల ఛాలెంజ్ లో గెలిస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. వీర లెవల్లో చాలెంజ్ ఓకే చేసిన మన హీరో కత్తి, అనుకున్న ఛాలెంజ్ లో గెలిచే దిశగా అడుగులేస్తున్న టైంలో కథలో అసలు సిసలైన ట్విస్ట్. అక్కడి నుంచి కథ అనుకోని మలుపులు తీసుకుంటుంది. మొదటగా సోమనాథ్ చటర్జీ కత్తికి ఇచ్చిన ఛాలెంజ్ ఏమిటి.? ఆ ఛాలెంజ్ కోసం కత్తి ఏం చేసాడు.? ఆ తర్వాత కథలో వచ్చిన అసలు ట్విస్ట్ ఏంటి.? ఆ ట్విస్ట్ వల్ల కథలో వచ్చిన మార్పులను మీరు స్క్రీన్ పై  తెలుసుకోవాల్సిందే..

ఫ్లస్ పాయింట్లు:

కామెడీనే ఈ సినిమాకి మేజర్ హైలైట్ కావడం విశేషం. నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తారుణ్ హీరోగా చాలా మంచి నటనని కనబరిచాడు. తనలోని ఎనర్జీ లెవల్స్, ఈజ్ తో కత్తి పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఎప్పటిలానే తన డైలాగ్ డెలివరీనే ఇక్కడ హైలైట్ అయ్యింది. చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగా చేసాడు. హీరోయిన్ గా అవిక గోర్ చూడటానికి క్యూట్ గా ఉంది, అలాగే తన పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ రావు రమేష్. తనకిచ్చిన పాత్రని అద్భుతంగా పోషించాడు. ప్రతి ఎపిసోడ్ కి తన టాలెంట్ తో పూర్తి న్యాయం చేసాడు. రాజ్ తరుణ్ – రావు రమేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ ఫాదర్ గా చేసిన తోటపల్లి మధు బాగా చేసాడు. రాజ్ తరుణ్ – తోటపల్లి మధు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి.

 

ఇక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, ప్రవీణ్, చలాకి చంటి, సత్యం రాజేష్, జయలక్ష్మిలు తమ పాత్రల్లో నవ్విస్తే.. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ లో వచ్చే జబర్దస్త్ టీం అయిన శంకర్, శ్రీను, సుధీర్ లు బాగానే నవ్వించారు. ఇక సినిమా ఫ్లో విషయానికి వస్తే.. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది.. మొదటి 30 నిమిషాలు కథలోకి చాలా వేగంగా వెళ్ళడమే కాకుండా, ఫన్నీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ద్రౌపదీ వస్త్రాపహరణం సీన్ బాగా నవ్విస్తుంది. ఇక సెకండాఫ్ లో రాజ్ తరుణ్ – రావు రమేష్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే కృష్ణ భగవాన్ – చలాకి చంటి- రాజ్ తరుణ్ మధ్య వచ్చే భోజనాల ఎపిసోడ్ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎప్పటిలానే ఎమోషనల్ గా ముగుస్తుంది. సినిమా కథ, కథనాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకి బేసిక్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచినవి మూడున్నాయి. అవే.. మొదటిది – రాజ్ తరుణ్ – అవిక గోర్ ల హిట్ పెయిర్ కాంబినేషన్, రెండవది – బాగా ఫేమస్ అయిన లైన్ ‘సినిమా చూపిస్త మావ’ అనే టైటిల్ పెట్టడం, మూడవది – దిల్ రాజు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా మారడం. ఇక ఇవి పక్కన పెట్టి సినిమా విషయలోకి వస్తే.. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ సినిమాలో చాలా వరకూ వర్కౌట్ అయ్యాయి. శేఖర్ చంద్ర సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ ఇంకా బాగుంది.

మైనస్ పాయింట్లు :

‘సినిమా చూపిస్త మావ’ సినిమాలో చెప్పుకోవడానికి మైనస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి.. మొదటగా ఈ సినిమాకి ఈ రన్ టైం. సుమారు 2గంటల 20 నిమిషాలు ఉన్న ఈ సినిమాలో సుమారు ఇంకో 15 నిమిషాలు కట్ చేయచ్చు. ఎందుకంటే చాలా సీన్స్ బోరింగ్ గా అనిపించడమే కాకుండా కథని సాగాదీశాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే కథ చాలా రెగ్యులర్. ఇప్పటికే చాలా అంటే చాలా చాలా సినిమాల్లో వచ్చిందే.. మనం చూసిందే.. చెప్పాలంటే కథలో సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేదు. ఇలాంటి కథకి కథనంలో అన్నా కేర్ తీసుకొని ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఏమైనా రాసుకోవాల్సింది. కానీ అలాంటి విషయాలు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్. కానీ చాలా చోట్ల తను రవితేజని ఇమిటేట్ చేసినట్లు ఉంటుంది. అది కాస్త తగ్గించుకుని తన యునిక్ మార్క్ వేసుకునే ప్రయత్నం చేసుంటే బాగుండేది. సినిమాలో దాదాపు మనం అనుకున్నవే జరుగుతూ ఉండడం వల్ల చూసే ఆడియన్స్ కి కంటెంట్ పరంగా పెద్ద కిక్ ఉండదు. కానీ అవి వచ్చే సందర్భం సరిగా లేదు. సెకండాఫ్ లో అయితే పాట తర్వాత పాట వస్తూ ఉంటుంది. ఏదో కమర్షియాలిటీ కోసం పెట్టారు తప్ప పెద్ద ఉపయోగం లేదు. కొన్ని చోట్ల కామెడీ బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే దెయ్యం ఎపిసోడ్ లో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ లో రావు రమేష్ డీల్ మాట్లాడే విషయం ఆ సందర్భంలో కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అందుకే క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా, ఇంకాస్త కన్విన్సింగ్ గా తీయాల్సింది.

 

 

గా వెళ్ళడమే కాకుండా, ఫన్నీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ద్రౌపదీ వస్త్రాపహరణం సీన్ బాగా నవ్విస్తుంది. ఇక సెకండాఫ్ లో రాజ్ తరుణ్ – రావు రమేష్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే కృష్ణ భగవాన్ – చలాకి చంటి- రాజ్ తరుణ్ మధ్య వచ్చే భోజనాల ఎపిసోడ్ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎప్పటిలానే ఎమోషనల్ గా ముగుస్తుంది. సినిమా కథ, కథనాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకి బేసిక్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచినవి మూడున్నాయి. అవే.. మొదటిది – రాజ్ తరుణ్ – అవిక గోర్ ల హిట్ పెయిర్ కాంబినేషన్, రెండవది – బాగా ఫేమస్ అయిన లైన్ ‘సినిమా చూపిస్త మావ’ అనే టైటిల్ పెట్టడం, మూడవది – దిల్ రాజు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా మారడం. ఇక ఇవి పక్కన పెట్టి సినిమా విషయలోకి వస్తే.. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ సినిమాలో చాలా వరకూ వర్కౌట్ అయ్యాయి. శేఖర్ చంద్ర సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ ఇంకా బాగుంది.

చివరగా :

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కెరీర్లో తొలి హిట్ అందుకున్న రాజ్ తరుణ్ – అవిక గోర్ లు ‘సినిమా చూపిస్త మావ’తో కూడా అదే మేజిక్ ని రిపీట్ చేసి మరోసారి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘సినిమా చూపిస్త మావ’ అనే పాటలో ఫన్ ఫ్లేవర్ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో, ఈ సినిమాలో కూడా అంత బాగా కామెడీ వర్కౌట్ అయ్యింది. అదే ఈ సినిమాకి ది బెస్ట్ ప్లస్ పాయింట్. కంటిన్యూగా కామెడీ లేకపోయినా డైరెక్టర్ త్రినాథరావు రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ అన్నీ బాగానే పేలాయి.

 

చివరగా... మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునే సినిమా చూపించాడు దర్శకుడు త్రినాథరావు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు