డిక్టేటర్

January 21, 2016 | 03:25 PM | 5 Views
Rating :
డిక్టేటర్

నటీనటులు : బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష, ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం

సాంకేతిక వర్గం :

ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, , దర్శకత్వం: శ్రీవాస్‌.

సంక్రాంతి సీజన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన నందమూరి బాలకృష్ణ నటించిన 99వ సినిమా ‘డిక్టేటర్’. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్ కి తగిన పర్ఫెక్ట్ స్టొరీ తో చేసిన ఈ స్టైలిష్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీవాస్ డైరెక్టర్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీని ఫలితం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్దాం.

కథ :

హైదరాబాద్ లోని ధర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబందించిన ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉంటాడు చందు (బాలకృష్ణ). తన పని తానూ చేసుకుపోతూ, గొడవలకి దూరంగా చాలా శాంతంగా ఉండే ధర్మ కాత్యాయని(అంజలి) వాళ్ళ ఇంట్లో ఉంటాడు. కాత్యాయని ఉద్యోగరిత్యా వేరే ఊర్లో ఉండటంతో ఆమె కుటుంబాన్ని కూడా చందుయే చూసుకుంటాడు. . అలా సాగిపోతున్న లైఫ్ లోకి అనుకోకుండా ఇందు (సోనాల్ చౌహాన్) ప్రవేశిస్తుంది. ఆమె వల్ల అనుకోకుండా చందు గతం బయటపడుతుంది. ఆ గతం ఏంటి? అసలు డిక్టేటర్ కు, చందుకు ఉన్న సంబంధం ఏంటి? ఇద్దరా లేక ఒక్కడేనా? ఇలాంటి ట్విస్ట్ లతో సాగిపోయేది ఈ కథ.

ఫ్లస్ పాయింట్లు:

నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాని నిల బెట్టింది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. అందులో మొదటి పాత్రలో చూడటానికి సింపుల్ అండ్ కూల్ గా కనిపించాడు. ఈ పాత్రలో పబ్ ఫైట్ లో యాక్షన్, డైలాగ్స్ తో అభిమానుల చేత విజిల్స్ కొట్టిస్తాడు. ఇక అసలైన డిక్టేటర్ పాత్రలో బాలకృష్ణ మునుపెన్నడూ కనపడననత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా.. పవర్ఫుల్ డైలాగ్స్ తో, విలన్స్ ని నువ్వా నేనా అంటూ ఢీ కొట్టిన తీరు సింప్లీ సూపర్బ్. . అంజలి హీరోతో కలిసి రొమాన్స్ చేయడమే కాకుండా పాత్రకి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా మెప్పించింది. సెకండాఫ్ లో కథకి మంచి బలాన్ని చేకూర్చే పాత్రలో అంజలి మంచి నటనని కనబరచడమే కాకుండా కామెడీ, ఎమోషనల్ గా కూడా బాగా చేసింది. ఇక సోనాల్ చౌహాన్ ఫస్ట్ హాఫ్ కి గ్లామర్ అట్రాక్షన్ తీసుకొచ్చిన పాత్ర. మిగతావి వారి వారి రేంజ్ చేసుకుంటూ పోయారు.

              సాంకేతిక నిపుణుల్లో అదిరిపోయే అవుట్ పుట్ ఇచ్చిన వాళ్ళలో మొదటగా చెప్పాల్సిన పేరు శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ. బాలకృష్ణని మును పెన్నడూ చూడనంత స్టైలిష్ గా చూపడమే కాకుండా, బాలయ్య ఇమేజ్ కి ఎలాంటి షాట్ పెట్టాలి అనేదాని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి తీసాడు. చాలా చోట్ల శ్యాం కె నాయుడు బాలయ్యని చూపిన విధానంకే అభిమానులు ఫిదా అయిపోతారు. ఓవరాల్ గా కూడా సినిమా విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్లు :

డిక్టేటర్ సినిమాకి మైనస్ పాయింట్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది.. ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉండడం అలాగే అక్కడక్కడా కామెడీ, ఇంటర్వల్ బ్లాక్ ఉన్నా కథా పరంగా అస్సలు ముందుకు వెళ్లకపోవడం వలన అక్కడక్కడా బోర్ కొడుతుంది. కొన్ని చోట్ల కామెడీ కోసమే కథని ఎక్కువ సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇక అసలు కథ విషయంలోకి వస్తే కథా పరంగా సూపర్ స్ట్రాంగ్ పాయింట్ లేదు. కేవలం డిక్టేటర్ అనే ఒక్క పాత్రనే హైలైట్ చెయ్యాలని కథ రాసుకున్నారు. అందుకే సినిమా కథ అనేది ఇంకా స్ట్రాంగ్ గా ఉండే బాగుండేది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కథలో జరిగిన మరో పొరబాటు విలనిజం స్ట్రాంగ్ గా లేకపోవడం. డిక్టేటర్ లాంటి పవర్ఫుల్ పాత్ర రాసుకున్నప్పుడు విలన్ అనే పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ విలన్స్ గా రతి అగ్నిహోత్రి, నవాబ్ షా మరియు కబీర్ దుహన్ సింగ్ పాత్రలలో ఆ స్ట్రాంగ్ నెస్ లేదు. అదీకాక డిక్టేటర్ లాంటి పాత్రకి లేడీ విలన్ ని పెట్టడం కూడా మరో మైనస్. థమన్ నుంచి ఇలాంటి మ్యూజిక్ కూడా తీసుకోవచ్చా అన్నంత పేలవంగా ఉంది.

                    కథ ఇలా ఉంది అంటే కథనం అన్నా బాగుండాలి. కానీ కథనం కూడా చాలా సింపుల్ గా ఉంది.. కథలో ఎలాంటి ట్విస్ట్ లు లేవు.. చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. దానికి తోడూ నేరేషన్ కూడా చాలా స్లోగా ఉండడం వలన చాలా చోట్ల బోరింగ్ గా కూడా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సినిమా మొత్తం ఊహాజనితంగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ లో కథ చెప్పకపోయినా ఎంటర్ టైన్మెంట్ అనేదానికి చాలా స్కోప్ ఉంది, కానీ రెండు మూడు సీన్స్ లో నవ్వించారే తప్ప మిగతా ఎక్కడా నవ్వించలేకపోయారు. దాని వలన ఫస్ట్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ అవ్స్తుంది.

చివరగా :

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినిమా అభిమానులు నందమూరి బాలకృష్ణ నుంచి ఏమేమి ఆశిస్తారో ఆ అంశాలను మెయిన్ అజెండాగా చేసుకొని తీసిన పర్ఫెక్ట్ స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘డిక్టేటర్’. అయితే, సింపిల్ కథ, కాస్త సాగాదీత, రొటీన్ క్లైమాక్స్ లు ఇక్కడ కంప్లయింట్ లు. బహుశా కోన వెంకట్ గోపీ మోహన్ నుంచి వచ్చిన కథ అని కాబోలు చిత్రం రెగ్యులర్ ఫ్లేవర్ కొడుతుంది. అయితే బాలకృష్ణ అభిమానులు, మాస మసాలా కోరుకునే అభిమానులు ఈ సంక్రాంతిని థియేటర్స్ లో అరుపులు పెడుతూ ఎంజాయ్ చేసేందుకు ఓకే.

చివరగా... పవర్ ఫుల్ పంచ్ డైలాగులు.. కొంచెం కామెడీ.. హీరోయిన్ల గ్లామర్.. అన్ని మసాలాలు నూరిన కమర్షియల్ మూవీ డిక్టేటర్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు