డైనమెట్

September 04, 2015 | 03:32 PM | 6 Views
Rating :
డైనమెట్

నటీనటులు : మంచు విష్ణు, ప్రణీత, జేడీ చక్రవర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, ప్రవీణ్, యోగ్ , నాగినీడు తదితరులు

సాంకేతిక వర్గం :

మాటలు - బి.వి.ఎస్.రవి, ఎడిటింగ్-ఎస్ఆర్ శేఖర్,  ఛాయాగ్రహణం - సతీష్ ముత్యాల, ఫైట్స్- విజయన్, సంగీతం - అచ్చు రాజమణి, బ్యానర్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,  నిర్మాత - మంచు విష్ణు, స్క్రీన్ ప్లే దర్శకత్వం -  దేవా కట్టా

హై రేంజ్ ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ ని హైలెట్ చేసి సినిమాలు ఎక్కించడంలో దిట్ట. ఫస్ట్ టైం ఓ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అలాగే సరికొత్త కథ, కొత్త పాత్ర, ఆ పాత్రకి మ్యాచ్ అయ్యే లుక్ ఈ మూడింటిని పక్కాగా అన్ని సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకునే హీరో మంచు విష్ణు. వీరిద్దరి కలయికలో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రమే డైనమెట్. తమిళ హిట్ మూవీ అరిమనంబీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ డైనమెట్ ఎలా పేలిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

కథ :

సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఫ్రెండ్స్ తో హ్యాపీగా జీవనం కొనసాగిస్తుంటాడు శివాజీ అలియాస్ శివ్ (మంచు విష్ణు). అలా ఒకరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి నైట్ టైం బయటకి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా పరిచయమవుతుంది అనామిక(ప్రణిత). ఆ పరిచయం కాస్తా ఫస్ట్ డేట్ కి దారి తీస్తుంది. ఆ రాత్రి శివ్ అనామిక ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ తను బాత్ రూంలో ఉండగా హఠాత్తుగా కొందరు అనామికను కిడ్నాప్ చేస్తారు. ఈ అనుకోని షాక్ తో శివ్ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత అసలు ఆమె కిడ్నాప్ అయినట్లు ఆధారాలు ఎక్కడా లభించవు. దీంతో శివ్ కి పిచ్చి పట్టినట్లవుతుంది. కానీ, ఓ క్లూ సాయంతో ఆమె కిడ్నాప్ నిజమని పోలీసులకు నిరూపిస్తాడు. ఆ టైంలో అనామికని కిడ్నాప్ చేసిన వారే అనామిక ఫాదర్, ఛానల్ 24 యజమాని రఘునాథ్(పరుచూరి వెంకటేశ్వరరావు)ని కూడా చంపేస్తారు. అదే టైంలో శివాజీకి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిస్తాయి. ఆ విషయాల ద్వారా శివాజీ అనామికని ఎక్కడుందో కనుక్కొని సేవ్ చేస్తాడు. అప్పుడే కథలోకి సెంట్రల్ మినిస్టర్ రిషి దేవ్(జెడి చక్రవర్తి) ఎంటర్ అవుతాడు. శివాజీ, అనామికని చంపాలని రిషి ట్రై చేస్తున్నాడు. అసలు అదంతా ఎందుకు? రిషి వారిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు.? వారితో అతనికున్న సంబంధం ఏంటీ? వారి బారి నుంచి శివ్, అనామికలు ఎలా బయటపడ్డారు అన్నదే కథ...

ఫ్లస్ పాయింట్లు:

చిత్రానికి మేజర్ ఫ్లస్ పాయింట్ దర్శకుడు దేవకట్టా ఎంచుకున్న కథనం. దాన్ని నడిపించిన విధానం. సాధారణంగా రీమేక్ లలో చాలా దర్శకులు ఒరిజినాలిటీని దృష్టిలో పెట్టుకుని కథలు అల్లుతుంటారు. కానీ, దేవకట్టా మాత్రం ఒరిజినల్ వర్షన్ కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా దీనిని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక నటన పరంగా విష్ణు ఈ చిత్రానికి రెండో పెద్ద అస్సెట్.  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అద్భుతంగా నటించాడు. బాడీ లాంగ్వేజ్ తోపాటు గతంలో చేసిన నటనలోని లోపాలను పూర్తిగా కవర్ చేసుకుని స్క్రీన్ పై అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సీన్స్ లో విష్ణు నటన హైలెట్.  అక్కడక్కడా కాస్త రిస్కీ స్టంట్ లతో బాగా అలరించాడు కూడా. హీరోయిన్ ప్రణిత ఎప్పటిలానే గ్లామర్ డాల్ గా కనపడుతూనే ఇంకోవైపు రిస్క్ తీసుకొని రియలిస్టిక్ స్టంట్స్ చేసింది. తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఇక మిస్టర్ కూల్ విలన్ గా జెడి చక్రవర్తి మంచి నటనని కనబరిచాడు. చిన్న పాత్రలో కనిపించిన లేఖ వాషింగ్టన్ బాగానే చేసింది. యోగ్ జపీ, నాగినీడు, రాజ రవీంద్ర, కబీర్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇంత సీరియస్ సినిమాలో అక్కడక్కడా ప్రభాస్ శ్రీను, హర్ష చేత చేయించిన కామెడీ నవ్విస్తుంది.

 టెక్నికల్ అంశాల విషయానికొస్తే... విజయన్ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ మరియు చేజింగ్ సీక్వెన్స్ లని ఎక్కడా బోర్ కొట్టించకుండా డిజైన్ చేసారు. ఇక సినిమా విషయానికి వస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి మొదటి 20 నిమిషాల తర్వాత సస్పెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఆడియన్స్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇంటర్వల్ వరకూ చాలా స్పీడ్ గా సాగుతుంది. ఇక సెకండాఫ్ కొన్ని బ్లాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అచ్చు రాజమణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి మేజర్ హైలెట్. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ సూపర్. ముఖ్యంగా సినిమా మేజర్ పార్ట్ రాత్రి పూట ఉండటంతో దృశ్యాలను బాగా తీశాడు.

మైనస్ పాయింట్లు :

చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ స్లో నేరేషన్. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం రాసుకున్న మొదట్లో 20 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది. ఇంటర్వల్ దగ్గర ఆసక్తిని క్రియేట్ చేసారు, కానీ సెకండాఫ్ లో అదే సస్పెన్స్ ని ఆధ్యంతం నడిపించలేకపోయారు. కొన్ని సీన్లు బాగా పేలినా కొన్ని మాత్రం చాలా బోర్ కొడతాయి. సినిమాకి పాటలతో పెద్ద అవసరం లేదు, కానీ మన తెలుగు ఆడియన్స్ కి అది కావాలి కాబట్టి పెట్టారు. కానీ కథను దెబ్బ తీయడమే కాకుండా సినిమా రన్ టైంని బాగా పెంచేసాయి. డైనమైట్ అనేది రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. ఇలాంటి జానర్ మూవీ టాలీవుడ్ కి కొత్త... కాబట్టి ఆటోమేటిక్ మనోళ్లకు అది రోతగా అనిపించోచ్చు. అలాగే రెగ్యులర్ కామెడీ కోరుకునే వారు ఎంజాయ్ చేసేలా ఈ సినిమాలో కామెడీ లేకపోవడం మైనస్. ఇక విష్ణు కి స్టార్ హీరోకున్నంత ఇమేజ్ లేకపోవటం కూడా ఓ రకంగా సినిమాకి నెగటివ్ టాక్ తెచ్చే అవకాశం ఉంది. ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్ (ప్రియా ఆనంద్) క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ, ఇక్కడ దర్శకుడు కాస్త మార్చి హీరోయిజాన్ని ఎక్కువ హైలెట్ చేశాడు. దీంతో ప్రణీత క్యారెక్టర్ పెద్దగా అనిపించదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ ని కాస్త సాగదీస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి సాగదీత వలన 142 నిమిషాల సినిమానే అయినా దానికన్నా ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా అనే ఫీలింగ్ కలిగిస్తుంది.

చివరగా :

టాలీవుడ్ కి పెద్దగా పరిచయం లేని సరికొత్త జానర్ ను డైనమెట్ తో పరిచయం చేశాడు దర్శకుడు దేవ కట్టా. కానీ, అతని సినిమాలో ఉండే ఓ మేసేజ్ ఇందులో మిస్సయ్యిందనే క్లియర్ గా చెప్పొచ్చు. అయితే ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన సస్పెన్స్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా సినిమాకి మేజర్ ప్లస్. కానీ, సీరియస్ గా సాగుతున్న టైంలో మధ్యలో వచ్చే పాటలు, రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే కామెడీ లేకపోవడం, సెకండాఫ్ లో  ఆ సస్పెన్స్ కంటిన్యూ కాకపోవటం మేజర్ మైనస్ లు. ఓవరాల్ గా రెగ్యులర్ కామెడీ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి సినిమా నచ్చకపోవచ్చు. కానీ,  స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు చూసే వారికి ఇది ట్రీట్ అనే చెప్పాలి. 

చివరగా...  రెగ్యులర్ నుంచి రిలీఫ్ కావాలనుకునే వారికి పెద్ద రిలాక్స్ ఇచ్చే సినిమా ‘డైనమైట్’. ఎంజాయ్ చెయ్యోచ్చు...

 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు