గంగ (ముని 3)

May 01, 2015 | 05:00 PM | 52 Views
Rating :
గంగ (ముని 3)

నటీనటులు : రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్, కోవైసరళ, మనోబాల, సుహాసిని, శ్రీమాన్ తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ- రాజవేల్, సంగీతం-లియోన్ జేమ్స్, ఎస్.ఎస్.థమన్, సి.సత్య, బ్యాగ్రౌండ్ స్కోర్- ఎస్.ఎస్.థమన్, బ్యానర్- లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, నిర్మాత- బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం- రాఘవ లారెన్స్

డ్యాన్సర్ నుండి డైరెక్టర్ గా మారిన లారెన్స్ గతంలో చాలా చిత్రాలకు డైరెక్టర్ గా వర్క్ చేసినా ముని సీక్వెల్స్ తో వరుస విజయాలు అందుకున్నాడు. కామెడి, హర్రర్ ఎలిమెంట్ మిక్స్ చేసి ఒక పక్క భయపడుతూనే మరో పక్క నవ్వించడం టెక్నిక్ తో ముని, కాంచన విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు కాంచన2 తో మన ముందుకు వచ్చాడు. తెలుగు, తమిళంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాలతో తమిళంలో మాత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేర భయపెట్టిందో తెలియాలంటే కథ తెలుసుకోవాల్సిందే...

కథ :

24 టీవీ ఛానెల్ వారు గ్రీన్ ఛానెల్ ను దాటి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారు. దాంతో గ్రీన్ ఛానెల్ వారు ఓ దెయ్యం ప్రోగ్రామ్ చేసి ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి తిరిగి నెంబర్ వన్ కావాలని నిర్ణయించుకుని ప్రోగ్రామ్ డైరెక్టర్ గా నందని(తాప్సీ)ని నియమిస్తారు. ప్రోగ్రామ్ కెమెరామెన్ గా రాఘవ(లారెన్స్) వెళతాడు. బీచ్ దగ్గర ఓ పాడుపడ్డ ఇంట్లో షూటింగ్ చేయడానికి యూనిట్ అంతా చేరుతుంది. అలాంటి తరుణంలో వారికి ఆ ఇంట్లో కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. నందనికి ఓ తాళి కూడా దొరుకుతుంది. అప్పటి నుండి ఆ భయానక పరిస్థితులు మరీ ఎక్కువ అవుతాయి. దాంతో నందిని ఓ స్వామిజీని ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ తాళి ఒక ఆత్మదని చెబుతాడు. పరిహారం కూడా చెబుతాడు. పరిహారం చేసే టప్పుడు ఆత్మ నందినిలో ప్రవేశిస్తుంది. అప్పటి నుండి నందని గంగ అంటూ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మరి గంగ ఎవరు? ఎందుకు నందినిలోకి ప్రవేశిస్తుంది. శివ ఎవరు? అసలు వారు ఆత్మలుగా మారడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

రాఘవ లారెన్స్ దర్శకుడిగానే కాకుండా నటుడిగా మరోమారు సక్సెస్ అయ్యాడు. మోడ్రన్ గా కనపడుతూ, భయపడుతూ ఆడియెన్స్ ను నవ్వించిన లారెన్స్ శివ పాత్రలో కూడా అలరించాడు. ముని, కాంచన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించినట్లే ఈ చిత్రంలో కూడా తన పాత్రకు పరిపూర్ణమైన న్యాయం చేశాడు. తాప్సీ ఈ చిత్రంలో లారెన్స్ ను డామినేట్ చేసిందనే చెప్పాలి. ఇంతకు ముందు వచ్చిన రెండు పార్ట్ లు లారెన్స్ చుట్టూ తిరిగితే ఈ సీక్వెల్ మాత్రం తాప్సీ చుట్టూ తిరిగింది. మోడ్రన్ గా, గ్లామర్ గా కనపడుతూనే దెయ్యం అవహించిన దానిలా సూపర్ పెర్ ఫార్మెన్స్ చేసింది. ఒక కోవైసరళ యాజ్ యూజువల్ గా తన పాత్రలో ఒదిగిపోయింది. నిత్యామీనన్ కొద్దిసేపు కనిపించినా అవిటి పాత్రలో మంచి నటనను కనపరిచింది. శ్రీమాన్, సుహాసిని, భానుంచందర్, మనోబాల తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగానటించారు. 

మైనస్ పాయింట్లు :

పెర్ ఫార్మెన్స్ లపై దృష్టి పెట్టిన లారెన్స్ ఈ సారి కథ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తుంది. కాంచన తరహాలోనే కథ సాగుతుంది. సెకండాఫ్ వచ్చేటప్పటికీ లెంగ్త్ ఎక్కువైంది. సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. కాంచన తరహాలో హృద్యమైన సన్నివేశాలు తక్కువగానే కనపడుతాయి. థమన్ ఫస్టాఫ్ లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినా సెకండాఫ్ వచ్చే సరికి గందరగోళమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ లో గ్రాఫిక్స్ గందరగోళంగా చేసినట్టు కనపడుతుంది. సినిమాటోగ్రీఫీ బాగుంది. ఎడిటర్ సినిమాలో అనవసర సన్నివేశాలను కత్తరించి ఉండవచ్చు. 

చివరగా :

వరుస సీక్వెల్స్ తో లారెన్స్ ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూసక్సెస్ సాధిస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లో సినిమా సాఫీగా సాగిపోతుంది ఈ చిత్రంలో ఏదో కొత్తగా చూపిస్తాడేమో అనుకున్న ప్రేక్షకులకు మళ్లీ సేమ్ రివేంజ్ ఫార్ములా కాంచన నే డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ కాగానే ఏం జరుగుతుందో ఆడియెన్ కి దాదాపు తెలిసిపోతుంది. పాత ఫార్ములా అయినా బి, సి సెంటర్ ఆడియెన్స్ ను సినిమా ఆకట్టకుంటుందనడంలో సందేహం లేదు.

 

చివరగా... మొత్తం మీద మరోసారి లారెన్స్ నవ్విస్తూనే భయపెట్టాడు. మాస్ ఆడియెన్స్ ను ఆలరిస్తుందనడంలో ఏ మాత్రం సందేహాం లేదు. 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు