హోరాహోరీ

September 12, 2015 | 01:37 PM | 5 Views
Rating :
హోరాహోరీ

నటీనటులు : దిలీప్, దక్ష, అశ్విని, సీమ, రాకెట్ రాఘవ, జస్వ తదితరులు

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ : దీపక్ భగవంత్, సంగీతం: కళ్యాణ్ కోడూరి, బ్యానర్:  రంజిత్ మూవీస్, నిర్మాత : కె.ఎల్ దామోదర్ ప్రసాద్, దర్శకత్వం : తేజ

దర్శకుడు తేజ ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఒకానొక టైంలో అగ్రదర్శకుడిగా కొనసాగాడు. ఆయన పేరు చెప్పగానే చిత్రం, జయం, నువ్వు-నేను, నిజం లాంటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ, దశాబ్దంగా తేజకి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస పెట్టి ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యంది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రేమకథతో మన ముందుకు వచ్చాడు తేజ. అందరు కొత్తవాళ్లతో ‘హోరా హోరీ’ అనే చిత్రాన్ని తీసుకొచ్చాడు. ‘ఫైట్ ఫర్ లవ్’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. అలా మొదలైంది, అంతకు ముందు ఆ తరువాత లాంటి సినిమాలను అందించిన రంజిత్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీనికి తోడు ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. దీంతో ఈ సారి హిట్ ఖాయం అని తేజ కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. మరి ఆ అంచనాలను తేజ ఈసారైనా అందుకున్నాడా... రివ్యూలోకి వెళ్దాం... 

కథ :

బసవేశ్వర్(చస్వ) అనే ఓ బ్యాడ్ ఫెల్లో తనకు అడ్డం తిరిగిన ఓ వ్యక్తిని నరికి చంపేస్తాడు. ఇక ఆ కేసు నుంచి తప్పించుకోడానికి లంచం ఇచ్చేందుకు ఓ ఏసీపీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏసీపీ చెల్లెలు మైథిలి (దక్ష) ని చూసి ప్రేమలో పడిపోతాడు. రావడం కోసం ఒక ఎసిపికి లంచం ఇస్తూ తన చెల్లెలైన మైథిలి(దక్ష)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆమె అన్న అంగీకరించడు. దీంతో తనని పెళ్లి చేసుకోవాలని వచ్చే వారిని చంపేస్తుంటాడు బసవ. ఆ సంఘటనలతో షాక్ లోకి వెళ్ళిపోయిన మైథిలిని తీసుకొని కర్ణాటకలోని సిమోఘ జిల్లాలోని ఆగుంబె ప్రాంతానికి వెళ్ళిపోతారు ఆమె అన్న. అక్కడ మన హీరో స్కంద(దిలీప్) పరిచయం అవుతాడు. అదే ఊర్లో స్కంద తన బామ్మ అంజలి(సీమ)తో ఉంటూ ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. ఆ టైంలోనే అనుకొని పరిస్థితుల వల్ల స్కందకి మైథిలితో పరిచయం అవ్వడం, ఇద్దరూ ప్రేమలో పడడం జరిగిపోతాయి. కట్ చేస్తే మైథిలి ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతున్న బసవేశ్వర్ అదే ఊరికి రావడం జరుగుతుంది. అక్కడ బసవేశ్వర్ కి స్కంద మైథిలిల వ్యవహరం తెలిసి పగ పెంచుకుంటాడు.  చివరికి ఇద్దరు తలపడుతారు. మరి ఇద్దరిలో మైథిలి ఎవరి సొంతం అవుతుంది అన్నదే కథ. 

ఫ్లస్ పాయింట్లు:

ఈ సినిమాకి మెయిన్ ఎసెస్ట్స్ లోకేషన్స్ మునుపెన్నడూ షూట్ చేయని ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. కర్ణాటకలోని సిమోఘ జిల్లాలోని ఆగుంబె అనే నిత్యం వర్షం కురిసే ప్రాంతంలో ఈ సినిమాని షూట్ చెయాడం వలన విజువల్స్ పరంగా, బ్యాక్ డ్రాప్ పరంగా సినిమాకి ఓ కొత్తదనం వచ్చింది. అక్కడి అందమైన లొకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ ఇంకా అద్భుతంగా బంధించాడు. మునుపెన్నడూ చూడని విజువల్స్ కావడంతో ఆడియన్స్ కి ఆ విజువల్స్ ఓ కొత్త అనుభూతిని కలిగించడమే ఈ సినిమాకి ప్రధాన హైలైట్. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ కి కళ్యాణ్ కోడూరి వినసొంపైన సంగీతం, నేపధ్య సంగీతం తోడవడం సినిమాకి మరో హైలైట్.

 

ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ కొత్తవారే కావడంతో కొంచెం తక్కువగా మాట్లాడుకుంటే బెటర్. ది బెస్ట్ పెర్ఫార్మార్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ దక్ష. తన లుక్ తో, క్యూట్ నెస్ తో ప్రేక్షకులను తనవైపు ఆకర్షించుకోవడమే కాకుండా, యువతని తన మత్తులో పడేసుకుంటుంది. కేవలం లుక్స్ పరంగానే కాకుండా తన నటనతో ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన పెర్ఫార్మన్స్ సూపర్బ్. ఇక సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపించిన అశ్విని ఫస్ట్ హాఫ్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది. విలన్ గా చేసిన చస్వ మంచి నటనని కనబరిచాడు. హీరోకి నానమ్మగా కనిపించిన సీమ తన పాత్రకి న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్ గా చేసిన అభిరామ్ కూడా బాగానే చేసాడు.

మైనస్ పాయింట్లు :

కథ, కథనం,  నేరేషన్ ఈ మూడు దీనికి పెద్దమైనస్ లు. హీరో, విలన్ ఒకే అమ్మాయిని ఇష్టపడటం. చివరికి తన్నుకుని హీరో గెలవటం లాంటి పాత చింతకాయ పచ్చడినే తేజ వడ్డించాడు. పోనీ నేరేషన్లో ఏమైనా తేడా ఉందా అంటే అబ్బే.. అదేం లేదు. దానికి తోడు కథనంలో మొదటి 30 నిమిషాల్లోనే కథ ఎలా ఎండ్ అవుతుంది. దీంతో జనాలకు పెద్దగా కిక్కివ్వదు. ఇక హీరో దిలీప్ క్యారెక్టర్ ని మరీ దారుణంగా క్రియేట్ చేశాడు తేజ. ఎప్పుడు చూసిన ఏడుపుగొట్టు క్యారెక్టర్ తో విసుగు తెప్పించాడు. అలాగే సినిమాకి 159 నిమిషాల రన్ టైం అనేది చూసే ఆడియన్స్ కి చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో హీరోకి తెలియకుండా విలన్, విలన్ కి తెలియకుండా హీరో ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు అనే ఫార్మాట్ ని ఇదివరకే చూసాం. దీనితో పాటు సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ కూడా తక్కువ కావడంతో చాలా చోట్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది.

తేజ కథ – ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడూ ఆయనే చెప్పే ప్రేమకథల్లానే ఉంటుంది. ఫస్టాఫ్ సో... సో... అనిపించినా... సెకండాఫ్ ని మాత్రం దారుణంగా తీశాడు. అనుకున్న కథని పూర్తి ఎంగేజింగ్ గా ఆడియన్స్ కి చెప్పడంలో పూర్తిగా ఫెలయ్యాడు. 

చివరగా :

తెలుగులో కొత్త పంథా సినిమాలు రావట్లేదు అని విమర్శలు చేసే తేజ ఇప్పుడు చేసిందేంటీ? అదే కథ, అదే కథనం, అదే సోదీ...  జయం సినిమాకి చెదలుపడితే ఎలా ఉంటుందో అలా ఉందంటూ ప్రేక్షకులు బహిరంగంగానే విమర్శులు చేస్తున్నారు. ఎంచుకున్నది మూస కథలే అయినా ఇంట్రస్టింగ్ చెబితే ప్రేక్షకులు క్షమించేస్తారు. హోరా హోరీ కథని మరింత బోరింగ్ గా చెప్పడం వలన థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు నిరాశ పడతారు.

 

చివరగా... సేమ్ రొటీన్ ఫార్ములా... హోరాహోరిని భరించడం చాలా కష్టం.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు