జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్లాం

July 24, 2015 | 04:22 PM | 8 Views
Rating :
జేమ్స్ బాండ్- నేను కాదు నా పెళ్లాం

నటీనటులు : అల్లరి నరేష్, సాక్షి చౌదరి, జయప్రకాశ్ రెడ్డి, పోసాని, ప్రవీణ్

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ: దాము నర్రావు , డైలాగ్స్ : శ్రీధర్ సీపాన, సంగీతం: సాయి కార్తీక్, బ్యానర్: ఏకే ఎంటర్ టైన్ మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర,  దర్శకత్వం: సాయి కిషోర్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఈ జనరేషన్లో కడుపుబ్బా నవ్విస్తాడు అన్న ఓ మార్క్ ను సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. కానీ ఈ అల్లరోడు హిట్ అనే పదానికి దూరమై చాలా కాలం అయ్యింది. ఒకే రకం కామెడీ చిత్రాలతో, చెత్త కాన్సెప్ట్ లతో చిత్రాలు చేస్తున్నాడని ఈ మధ్య చిత్ర విమర్శకులు అతనిపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో తన పాత మార్క్ కామెడీ కి కాస్త రంగులు అద్ది వచ్చిన చిత్రమే జేమ్స్ బాండ్. మరి ఈ చిత్రంతోనైనా నరేష్ తనను ఊరిస్తు వస్తున్న హిట్ ను అందుకున్నాడా. తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథ :

స్వతహాగా భయస్తుడైన మనస్తత్వం కల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నాని అలియాస్ లక్ష్మీ ప్రసాద్ (అల్లరి నరేష్). ఇతగాడు తొలిచూపులోనే బుల్లెట్ అలియాస్ పూజ (సాక్షిచౌదరి)తో పీకల ప్రేమలో మునిగిపోతాడు. అయితే బుల్లెట్ దుబాయ్ లో పెద్ద డాన్. కానీ ఆమె పెద్ద డాన్ అనే విషయం ఇండియాలో ఉండే ఆమె తల్లికి కూడా తెలీకుండా మ్యానేజ్ చేస్తు ఉంటుంది. చివరికి తన తల్లి చావుబతుకుల్లో ఉందని తెలిసిన పూజ ఎట్టకేలకు నానిని పెళ్లి చేసుకుంటుంది.  కొన్ని రోజులకే పూజ అసలు స్వరూపం తెలిసిన నాని భయంతో వణికిపోతుంటాడు. అక్కడి నుంచి ఆమె నుంచి తప్పించుకొని పారిపోవాలని తెగ ట్రై చేస్తూ ఫెయిల్ అవుతుంటాడు. అదే టైంలో పూజపై పగ తీర్చుకోవాలని దుబాయ్ మరో డాన్ బడా(ఆశిష్ విద్యార్ధి) ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో నాని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది, వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది కథ. 

ఫ్లస్ పాయింట్లు:

అల్లరి నరేష్ తనదైన మార్క్  కామెడీతో ఆకట్టుకున్నాడు. చిత్రం స్టార్టైన దగ్గర నుంచి పాత్రలు పరిచయం చేసే విధానం, ఫస్టాప్ బాగా ఆకట్టుకుంటాయి. ఓ వైపు సిరీయస్ పాత్రలో నటిస్తూనే గ్లామర్ పాళ్లను బాగా ఒలకబోసింది సాక్షి. కొన్ని సన్నివేశాల్లో రిస్కీ స్టంట్ లతో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రవీణ్ చాలా బాగా నవ్వించాడు. హీరో కి అతనికి మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండిగా, పోసాని కృష్ణమురళి కాసేపు నవ్వించాడు. ముఖ్యంగా తెలుగు టీవీ సీరియల్స్ లో పాత్రలని పోలుస్తూ ప్రతి సందర్భాన్ని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. విలన్ గా ఆశిష్ విద్యార్ధి బాగా చేసాడు.

మైనస్ పాయింట్లు :

స్టొరీ లైన్ కొత్తదే అయిన ప్రజెంట్ చేసిన విధానం మాత్రం పాతదే. ముఖ్యంగా సెకండాఫ్ ఫార్మట్ లో ఇప్పటి దాకా చాలా పాత సినిమాలు వచ్చాయి. దీంతో సెకండాఫ్ పరమ బోరింగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు కనీసం ఎంటైర్మన్ మెంట్ కూడా తక్కువ కావటంతో సగలు ప్రేక్షకుడికి అంతగా నచ్చదు. శీను వైట్ల చిత్రాల తరహాలో చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సాయి కిషోర్, ‘మై వైఫ్ ఈజ్ గ్యాంగ్ స్టర్’ అనే సినిమా నుంచి స్టొరీ లైన్ ని స్పూర్తిగా తీసుకోవడమే కాకుండా సీన్స్ కూడా స్పూర్తిగా తీసుకున్నారు. జయప్రకాశ్ రెడ్డి  రఘుబాబులతో క్రియేట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కామెడీ సినిమాలో పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కూడా ఓ మాదిరిగానే ఉంది తప్ప ఓహో అనేలా లేదు.  సాయి కార్తీక్ అందించిన పాటల్లో ఒక రెండు బాగుంటే మిగతావి అన్నీ సోసోగా ఉన్నాయి. పాటలను పక్కన పెడితే రీ రికార్డింగ్ మాత్రం కామెడీ మూవీకి బాగానే సూట్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ కి ఇచ్చే కొన్ని బిల్డప్ షాట్స్ లో మ్యూజిక్ బాగుంది. దాము నర్రావు సినిమాటోగ్రఫీ చాలా ప్లెజంట్ అండ్ కలర్ఫుల్ గా ఉంది. తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఓకే, కానీ చెప్పాలంటే దీనికన్నా బాగా కూడా ఎడిట్ చేయచ్చు. కొన్ని లాగ్ అనిపించిన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. శ్రీధర్ సీపాన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువ అయిపోయాయి, అందుకే సగం పర్ఫెక్ట్ గా పేలితే సగం పర్ఫెక్ట్ గా పేలలేదు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చోట్ల బాగా ఎక్కువ అనిపిస్తాయి, కొన్ని చోట్ల ఓకే డీసెంట్ అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. 

చివరగా :

నరేష్ ఈ తరహాలో అమాయకపు భర్త క్యారెక్టర్ కామెడీ కితకితలు లో  చేసేశాడు. అయితే ఫార్ములా ఒకేలా ఉన్నా, కథాకథనం కాస్త డిఫరెంట్ గా ఉండటం, కామెడీ కూడా కాస్త ఎక్కువ ఉండటంతో ఎంజాయ్ చేయోచ్చు. నరేష్ నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటారో అలాంటి కమర్షియల్ కామెడీ ఎలిమెంట్స్ తో వచ్చిన సినిమానే ‘జేమ్స్ బాండ్’. అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టించినప్పటికీ ఓవరాల్ గా ఎక్కువ శాతం మాత్రం ఆడియన్స్ ని నవ్విస్తుంది. గత కొంతకాలంగా కామెడీ ఎంటర్టైనర్స్ కోసం చూస్తున్న ఆడియన్స్ కి ఇది కాస్త ఊరట. కానీ, బాహుబలి ముందు తట్టుకోవటం కష్టమే.  

చివరగా...  అల్లరి నరేష్ నుంచి రెగ్యులర్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి నచ్చే సినిమా.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు