కుమారి 21ఎఫ్

November 24, 2015 | 03:15 PM | 5 Views
Rating :
కుమారి 21ఎఫ్

నటీనటులు : రాజ్ తరుణ్, హీబా పటేల్, నవీన్, సుదర్శన్, నోయల్ తదితరులు..

సాంకేతిక వర్గం :

ఎడిటర్ : అమర్ రెడ్డి,  సంభాషణలు : పొట్లూరి వెంకీ, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, కథ, డైలాగులు, బ్యానర్ : పీఏ మోషన్ పిక్చర్స్, నిర్మాత:విజయ ప్రసాద్ బండరెడ్డి, థామస్ రెడ్డి, సుకుమార్, దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్

ప్రేమకథలను విభిన్న పంథాలో అందించే సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్.  తన కలం నుంచి కొత్త కథలను అందించాలని సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించాడు. అలా తన కథ,  స్క్రీన్ ప్లేని అందించి చేసిన మొదటి చిత్రమే ‘కుమారి 21F’.  ప్రేమ విషయంలో నేటి యూత్ ధోరణి ఎలా ఉంది అన్న దానికి మసాలాను యాడ్ చేసి ఓన్లీ యూత్ ని టార్గెట్ చేస్తూ చిత్రాన్ని తెరకెక్కించాడు సుకుమార్ అసిస్టెంట్ పల్నాటి సూర్య ప్రతాప్. కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హీబా పటేల్ (నూతన పరిచయం) జంటగా నటించారు. మరి ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం...

కథ :

ఓపెన్ చేయగానే హైదరాబాద్ కెజిబి కాలనీలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవనం గడుపుతుంటాడు హీరో సిద్దు(రాజ్ తరుణ్). కుకింగ్ లో డిగ్రీ పూర్తి చేసి స్టార్ క్రూస్ షిప్ లో చెఫ్ గా వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక అతగాడికి ముగ్గురు తోకలు శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). దొంగతనాలు చేస్తూ బయటికి జెంటిల్మెన్లలాగా వారంతా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఆ కాలనీలోకి వస్తుంది మోడల్ కుమారి(హీబా పటేల్). మొదటి చూపులోనే మన హీరో ఆమె ప్రేమలో పడుతుంటుంది. అయితే పక్క నుండే ఫ్రెండ్స్ మాత్రం ఆమెపై కన్నేస్తారు. కుమారి మాత్రం చాలా ఓపెన్ (స్కిన్ షో విషయంలో కూడా). అందుకే అందరితో ఫ్రెండ్ షిప్ మెయింటెన్ చేస్తుంటుంది. కానీ కన్నింగ్ సిద్దు ఫ్రెండ్స్ మాత్రం ఆమె క్యారెక్టర్ మంచింది కాదని, మోడల్ కదా అందరూ ఈపాటికే వాడుకుని వదిలేసుంటారని  సిద్దూ మనసు విరిచేస్తారు. వర్జిన్ గర్ల్ ఫ్రెండే కావాలని కొరుకునే సిద్దూకి ఇది మనసులో పెట్టుకుని నలిగిపోతుంటాడు. ఓ రోజు ఆమె డైరక్ట్ గా నిలదీస్తాడు. దీంతో ఆమె ఛీ కొట్టి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత కుమారి గురించి సిద్దూ కి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆపై లవ్ రెట్టింపు అవుతుంది. అక్కడి నుంచి సిద్దు తన ప్రేమని దక్కించుకోవడానికి ఏం చేస్తాడు? సిద్దూ ఫ్రెండ్స్ కుమారిపై ఏమైనా అఘాయిత్యం చేశారా? అసలు కుమారి క్యారెక్టర్ ఎందుకు అంతలా బోల్డ్ గా ఉంటుంది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫ్లస్ పాయింట్లు:

ఇది ఒక యూత్ ఫుల్ కథ. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న నేటితరం యువతలోని భావాలను ఆధారంగా చేసుకుని సుక్కూ రాసిన ఈ ప్రేమకథ ఆ వర్గాన్ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఈ కథ ద్వారా చెప్పాలనుకున్న రెండు పాయింట్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి. దర్శకుడు సూర్య ప్రతాప్ టేకింగ్ కంటే సుకుమార్ సినిమాలాగానే అనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే... ఇంతకు ముందు సినిమాల్లో ఎనర్జిటిక్ (కాస్త ఓవర్ యాక్షన్) చేసిన హీరో రాజ్ తరుణ్ ఇందులో మెచ్యూర్డ్ నటనను ప్రదర్శించాడు.  ఫస్ట్ హాఫ్ పరంగా సైలెంట్ గా కనిపించిన రాజ్ తరుణ్ సెకండాఫ్ లో తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు  ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

కుమారిగా కనిపించిన హీబా పటేల్ నటనతో ఓకే అనిపించేసినా చిత్రం మొత్తం ఎక్స్ పోజింగ్ తో అదరగొట్టింది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె స్కిన్ షో మీదే నడిచిందంటే అర్థంచేసుకోవచ్చు. ఇక సెకండాఫ్ లో సో... సో...గా నడిపించింది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వారిలో నవీన్, సుదర్శన్ లు తమ పంచ్ డైలాగ్స్ తో కాస్త నవ్విస్తూ వచ్చారు. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు.

టెక్నికల్ అంశాల జోలికి వస్తే... ఈ బోల్డ్ కథని రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని చెప్పాలి. రత్నవేలు సినిమాటోగ్రఫీతో మేజిక్ చేసాడని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే కాలనీని చాలా రియలిస్టిక్ గాచూపిస్తూనే, విజువల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద పాటలు హిట్ అయ్యాయి, సినిమాలో చూడటానికి కూడా బాగున్నాయి. సంభాషణలు అందించిన పొట్లూరి వెంకీ యూత్ ని ఆకట్టుకునేలా రాశాడు.  విజయ ప్రసాద్ – థామస్ రెడ్డి – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఓ భారే బడ్జెట్ సినిమాకి ఉన్నట్టు ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి.

మైనస్ పాయింట్లు :

కథ, కథనం, డైలాగులు సుకుమార్ కావటంతో ఆసక్తినెలకొనటం సహాజం. బోల్డ్ సినిమా అని ముందుగానే హింట్ ఇచ్చేశారు. అయితే అది మరీ శృతి మించినట్లు కనిపిస్తుంది కొన్ని సీన్లలో.  అయితే అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ కథను మరీ బోల్డ్ గా చూపించాడు దర్శకుడు ప్రతాప్. నిజానికి బోల్డ్ కాన్సెప్ట్ ఏమీ కాకపోయినా, కానీ ఉన్నదానిని చెప్పడానికి మోతాదుకు మించిన బోల్డ్ సీన్స్ రాసుకున్నాడు. స్కిన్ షో అనేది అందంగా ఉండాలి కానీ ఇందులో కొన్ని చోట్ల బాగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే మరీ ఇంతలా ఎక్స్ పోజింగ్ అవసరం లేదని కూడా అనిపిస్తుంటుంది. స్లోగా సాగే నారేషన్... అసందర్భంగా వచ్చే పాటలు... మితిమీరిన ఎక్స్ పోజింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి దూరం చేస్తాయి. ఎడిటింగ్ లో కూడా చాలా పొరపాట్లు దొర్లాయనిపిస్తుంది. చాలా వరకు కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్ తరుణ్ ముందు సినిమాల్లో కామెడీపై ఎక్కువ ఆధారపడ్డాడు. కానీ, ఇందులో అలాంటి ఎలిమెంట్లు ఏమీ లేవు. కేవలం అడల్ట్ సీన్లతో సినిమా మొత్తం నడిపించేశారు. దర్శక విభాగంలో సూర్య ప్రతాప్ విఫలమయిన సుకుమార్ హ్యాండ్ మూలంగా చిత్రం చాలా వరకు సేఫ్ అయిందనే చెప్పొచ్చు.

చివరగా :

 సుకుమార్ ఇప్పటివరకూ సున్నితమైన యూత్ఫుల్ కథలను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అదే తరహాలోనే ఒక యూత్ఫుల్ కథని మరింత బోల్డ్ గా చెప్పడానికి ట్రై చేసి, యూత్ ని మెప్పించిన సినిమానే ‘కుమారి 21F’. ఇప్పుడే కానీ సుకుమార్ దీనిలో ఎక్కువ భాగం అడల్ట్ కంటెంట్ మీద ఆధార పడ్డాడు. అడల్ట్ కంటెంట్ సినిమాకి ఎక్కువ అయినప్పటికీ ముందు బెంచ్ వారిని ఆకట్టుకొని థియేటర్స్ కి రప్పిస్తుంది.

కథని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదే దృష్టి పెట్టడం వల్ల యూత్ బాగా అట్రాక్ట్ అయి రావొచ్చేమోగానీ, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దూరంగానే ఉంటారు. సుకుమార్ రాసుకున్న కథనం బాగుంది, కానీ అదిరిపోయింది అనుకునేలా లేదు. కాస్త మెసేజ్ ను యాడ్ చేసి ఉంటే ఆ అంచనాను చేరుకునేదేమో.

చివరగా... కంప్లీట్ యూత్ ఎంటర్ టైనర్. అడల్ట్ కంటెంట్, ఎక్స్ పోజింగ్ అదనపు ఆకర్షణలు కావటంతో ఓ వర్గం వారు క్యూ కట్టి కాసులు రాలటం ఖాయం.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు