నటీనటులు : నవీన్ చంద్ర, లావణ్య త్రిపాటి, అజయ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు...
సాంకేతిక వర్గం :
సంగీతం : ఎం.ఎం కీరవాణి, నిర్మాత : సాయి ప్రసాద్ కామినేని, దర్శకత్వం : జగదీశ్ తలసిల
నవీన్ చంద్ర – లావణ్య తిపాటి జంటగా నటించిన సినిమా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన జగదీశ్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ సాయి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా రెండు సూపర్ హిట్స్ తో జోరు మీదున్న లావణ్య త్రిపాఠి హ్యాట్రిక్ అందుకుందా లేదా, జగదీశ్ డైరెక్టర్ గా తొలి హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం...
కథ :
మన హీరో నవీన్(నవీన్ చంద్ర) జనత బ్యాంకులో హెల్ప్ డెస్క్ లో పనిచేస్తుంటాడు, అదే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటుంది మన హీరోయిన్ దేవి(లావణ్య త్రిపాటి). నవీన్ కి ఓ సారి డబ్బు అవసరం పడుతుంది. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో అజయ్(మహేష్) అండ్ టీం వచ్చి వారి బ్యాంకు లో ఉన్న అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ తెస్తే, దాని ద్వారా వచ్చే అమౌంట్ లో తనకు వాటా ఇస్తామని చెప్తారు. దాంతో అప్పటిదాకా అస్సలు పడని లావణ్యతో ఫ్రెండ్ షిప్ మెయింటెన్ చేస్తాడు నవీన్.
అలా క్లోజ్ అయ్యి బ్యాంకు నుంచి అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ ని కొట్టేస్తాడు. అంతా అనుకున్న దాని ప్రకారమే ఆ అకౌంట్స్ ని బేస్ చేసుకొని డబ్బు కొట్టేయాలని చూస్తూ చిక్కుల్లో పడతాడు మహేష్ అండ్ నవీన్. అసలు ఈ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఏంటి? వాటి ద్వారా మనీ ఎలా వస్తుంది? నవీన్ డబ్బు కోసం చేసిన ఈ పని వల్ల తను ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు? దేవి ఏమన్నా హెల్ప్ చేసిందా? ఇదే కథ.
ఫ్లస్ పాయింట్లు:
లచ్చిందేవికీ ఓ లెక్కుంది సినిమాకి ఎంచుకున్న అనాధ డబ్బు అలియాస్ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ నుంచి డబ్బు కొట్టేసే కాన్సెప్ట్ సినిమాకి మెయిన్ హైలైట్. ఈ పాయింట్ చాలా కొత్తగా ఉండడం వలన ఆడియన్స్ మొదట్లో థ్రిల్ ఫీలవుతారు. అందుకే ఈ సినిమా ప్రారంభం బాగా అనిపిస్తుంది. ఇక అజయ్ టీం డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేసే ప్రీ ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. ఈ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచింది. ఓవరాల్ గా సినిమా రన్ టైం 110 నిమిషాలే కావడం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.
టెక్నికల్ లో రెండు విషయాల గురించి చెప్పుకోవాలి. ఒకటి ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫీ. సినిమాలో లిమిటెడ్ లొకేషన్స్ లోనే తీసినా ఈశ్వర్ మాత్రం తనకిచ్చిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక రెండోది ఎంఎం కీరవాణి ఈ విజువల్స్ కి మంచి నేపధ్య సంగీతం అంతే.
మైనస్ పాయింట్లు :
ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ బోలెడు. మొదటగా స్టొరీ లైన్ బాగుంది, కానీ దానిని డెవలప్ చేసుకున్న విధానం వీలైనంత బాడ్ గా రాసుకున్నారు. ఎందుకంటే స్టొరీ లైన్ కి చాలా పవర్ ఉన్నా కథలో రాసుకున్న ఒక్క పాత్రని కూడా సరిగా రాసుకోలేదు. ఎక్కడా ఏ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం కథలో పాత్రలను కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేదు. కథ అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఇక ఆ కథకి రాసుకున్న కథనం అస్సలు బాలేదు. పెద్ద థ్రిల్లింగ్ అనిపించే ఎపిసోడ్స్ కూడా ఏమీ లేవు. మరీ క్లైమాక్స్ ని అయితే కిచిడీలా చేసి హడావిడిగా క్లైమాక్స్ ని ముగిస్తారు. అయిపోయిందా అనే షాక్ ని కలిగించేలా అసంపూర్తిగా ముగించడం మైనస్.
ఇకపోతే నేరేషన్ అనేది చాలా చాలా స్లోగా ఉంటుంది. అసలే సినిమా స్లోగా సాగుతోంది అంటే.. సినిమా లో పాటలు వచ్చి వచ్చి ఉన్న ఫీల్ ని ఇంకా దెబ్బ తీస్తాయి. పాటలు అనేవి సినిమాకి హెల్ప్ కాలేదు. ఇకపోతే పాత్రలలో స్ట్రాంగ్ గా లేకపోవడం వలన నటీనటుల నుంచి మనకు బెస్ట్ పెర్ఫార్మన్స్ తెరపై కనపడదు. అలాగే జయప్రకాశ్ రెడ్డి పాత్ర నుంచి కామెడీని రాబట్టుకోవాలని తెగ ట్రై చేసారు. కానీ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అదీకాక సెకండాఫ్ లో జయప్రకాశ్ – లావణ్య సీన్స్ చాలా డ్రాగ్ అవుతాయి. సెకండాఫ్ ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష అనే చెప్పాలి. స్టొరీ లైన్ ప్రకారం సినిమాలో సస్పెన్స్, థ్రిల్స్ కి చాలా ఆస్కారం ఉంది కానీ ఒక్క థ్రిల్ కూడా కనిపించలేదు. ఓవరాల్ గా జగదీశ్ రచన – దర్శకత్వంలోనే మిస్టేక్స్ జరిగాయి.
చివరగా :
జక్కన్న శిష్యుడైన జగదీశ్ థ్రిల్లర్ కామెడీ ఫార్మాట్ లో ఓ సినిమా అనుకొని దానికి ఓ మంచి స్టొరీ లైన్ కూడా అనుకున్నాడు. కానీ దానిని ఆసక్తికరంగా చెప్పలేకపోవడంలో ఈ సినిమా ఫెల్ అయింది. కథా విస్తరణ, కథనం, నేరేషన్, డైరెక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.
చివరగా... వినోదాత్మకంగా తెరకెక్కిద్దామనకునప్పటికీ ఈ లచ్చిందేవి లెక్క మాత్రం బాగానే తప్పింది.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment