లింగ

December 12, 2014 | 03:31 PM | 36 Views
Rating :
లింగ

నటీనటులు : రజనీకాంత్‌, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా, జగపతిబాబు, సంతానం తదితరులు.

సాంకేతిక వర్గం :

కథ: పొన్ కుమరన్, కెమెరా: రత్నవేలు, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, స్క్రీన్ ప్లే డైరక్షన్: కే.ఎస్.రవికుమార్.

రోబో తర్వాత రియల్ రజనీకాంత్ ను జనాలు చూసి నాలుగేళ్లు దాటింది. రజనీ యాక్షన్ కోసం తమిళనాడే కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలైవా ఫ్యాన్స్ బీభత్సమైన ఆకలితో ఉన్నారు. మరీ స్పెషల్ గా రజనీ పుట్టినరోజున జనాల ముందుకు వచ్చాడు. మరీ వారి ఆకలిని రజనీ తీర్చడా లేదా?

కథ :

ఉన్న ఆస్తినంతా దానం చేసిన తన తాత లింగేశ్వరరావు (రజనీకాంత్) అంటే మనవడు లింగకు (యంగ్ రజనీ)కి వీపరితమైన కొపం. ఆ ద్వేషంతోనే తన సొంత ఊరికి కూడా ఎన్నడు వెళ్లడు. కానీ, తన తాత కట్టించిన గుడిని మనువడి చేతుల మీదుగా తెరిపించాలని గ్రామస్తుల నిర్ణయించటంతో తప్పనిసరి పరిస్థితిలో లింగ అక్కడికి వెళ్తాడు. అక్కడ రజనీకి తన తాత గొప్పతనం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. విలన్ల వల్ల గ్రామస్తుల ద్రుష్టిలో చెడ్డవాడిగా ముద్రపడి సీనియర్ రజనీ ఆ ఊరు విడిచి వస్తుంది. ఆయన మనవడిగా నిజాన్ని గ్రామస్తులకు తెలిసేలా చేసి తాతపై ఉన్న మచ్చను జూనియర్ రజనీ పోగోడతాడు. ఇదే సింపుల్ గా స్టోరీ.

ఫ్లస్ పాయింట్లు:

ఈ చిత్రానికి ఉన్న ఫ్లస్ పాయింట్ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే రజనీకాంత్. ఆయనే ఈ చిత్రానికి పెద్ద అస్సెట్. ప్రేక్షకులు వచ్చేది కూడా ఆయనకోసమే. ఒక వైపు దోంగగా మనువడి పాత్రలో, గ్రామస్తుల క్షేమం కొరుకునే వ్యక్తిగా మరో వైపు కలెక్టర్ కమ్ ఇంజినీర్ పాత్రలో ఆయన ఆకట్టకుంటారు. ఇక ఆయన తర్వాత చిత్రానికి చెప్పుకొదగింది సోనాక్షి సిన్హా. పల్లెటూరి అమ్మాయి పాత్రలో సోనాక్షి ఆకట్టుకుంది. మొత్తానికి సౌత్ డెబ్యూని సక్సెస్ ఫుల్ పాత్రతోనే ప్రారంభించింది. ఇక గ్లామర్ బాధ్యతను అనుష్క తీసుకుంది. ఉన్నది కొద్దిసేపే అయినా అనుష్క పాత్ర ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ లో రజనీ-సంతానం కామెడీ ట్రాక్ వినోదాన్ని పంచ్ తుంది. రత్నవేలు కెమెరా పనితనం బాగుంది. పాటల్లో కొన్ని సన్నివేశాలలో రిచ్ నెస్ ను బాగా చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్రెన్ ఫైట్ చిత్రీకరణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో దర్శకుడు కే.ఎస్. రవికుమార్ స్క్రీన్ పై కనిపించి అలరిస్తాడు.

మైనస్ పాయింట్లు :

ఎంత సూపర్ స్టార్ అయినా కథలో కొత్తదనం లేకపోతే ఏంచేయలేడు. ముఖ్యంగా దర్శకుడు రజనీ స్టైల్ ని ఇందులో పూర్తిగా ప్రజెంట్ చేయలేకపోయాడు. రజనీ కూడా కథ ఇంట్రస్టింగ్ గా అనిపించకపోవడం వల్లనో ఏమో పూర్తిస్థాయిలో నటనను చూపలేకపోయాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అసలు చేసేది రజనీయేనా అని జనాలు అనుకుంటారు. ఇక చిత్రంలో ముఖ్యంగా విసుగుచెప్పించేది రెండు గంటల నిడివి ఉండే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఓ వైపు గొప్పగా చూపిస్తూనే సింపుల్ గా ప్లాష్ బ్యాక్ ను చూపించాల్సి ఉంది. కానీ, దర్శకుడు రవికుమార్ తనదైన ఎంటర్ టైన్ మెంట్ మార్క్ ను పక్కనబెట్టి సాగదీసాడు. జగపతి బాబు లాంటి మంచి స్కొప్ ఉన్న నటడిని విలన్ పాత్రలో సరిగ్గా చూపలేకపోయాడు. హీరోయిన్లు కూడా రజనీ కంటే కాస్తా హెవీగా కనిపిస్తారు. ఇక సంగీతం విషయానికొస్తే రెహమాన్ యేనా లేక ఎవరైనా అసిస్టెంట్ తో కొట్టించాడా అని డౌట్ పడక మానరు. ఏ ఒక్క పాట కూడా ఆకట్టుకొదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ దారుణంగా ఉంది.

చివరగా :

రజనీకాంత్ ను స్క్రీన్ మీద చూడటం కోసం తప్ప మరే ఇతర ఎలిమెంట్లు ఆశించి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చిత్రానికి పెద్ద మైనస్. 1939 సమయంలో కలెక్టర్ గా ఉండే రజనీ స్వాతంత్ర్యోద్యమంపై దృష్టిసారించకుండా కేవలం డ్యాం కోసం బ్రిటిషర్లతో మంతనాలు చేయడం అంతగా రుచించదు. కేవలం డ్యాం నేపథ్యంలోనే కథ నడిపించినప్పటికీ సీనియర్ పాత్ర ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. దొంగగా మనువడి పాత్ర ఎంటర్ టైన్ మెంట్ పంచే టైంలో అర్థాంతరంగా ఆ పాత్రను పక్కన పడేసి తాత పాత్రలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. సూపర్ స్టార్ తో నరసింహ లాంటి స్టైలిష్ చిత్రాన్ని తీసిన దర్శకుడు కే.ఎస్.రవికుమార్ యేనా ఈ చిత్రాన్ని తీసింది అన్న అనుమానం ప్రేక్షకులకు వస్తుంది.

చివరగా వాచ్ ఓన్లీ ఫర్ రజనీ...



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు