నటీనటులు : బాలకృష్ణ, త్రిష, రాధికాఅప్టే, ప్రకాష్ రాజ్,జయసుధ, చంద్రమోహన్, ప్రదీప్ రావత్, శ్రవణ్ తదితరులు
సాంకేతిక వర్గం :
బ్యానర్- ఎస్.ఎల్.వి.సినిమా
ఎడిటింగ్- గౌతంరాజు
సంగీతం- మణిశర్మ
సినిమాటోగ్రఫీ- వెంకట్ ప్రసాద్
నిర్మాత- రుద్రపాటి రమణారావు
దర్శకత్వం – సత్యదేవ
నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో సత్యదేవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’లయన్‘. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ ఎలాంటి సినిమా చేస్తాడు? ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో కొత్త దర్శకుడైన సత్యదేవ దర్శకత్వంలో సినిమా చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించినా ప్రయోగాలకు వెరవని బాలకృష్ణ చేసిన సరికొత్త ప్రయత్నమే లయన్. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అని తెలియాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే...
కథ :
ముంబాయ్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) మరణించాడనుకుని డాక్టర్స్ మార్చురీ రూమ్ లో పడేస్తారు. అయితే ఆకస్మాత్తుగా గాడ్సే ప్రాణంతో లేచి నిలబడతాడు. అయితే తన పేరు గాడ్సే కాదని బోస్ అని అంటుంటాడు. అయితే గాడ్సే తల్లిదండ్రులైన జయసుధ, చంద్రమోహన్ లు తనకి నిజం చెప్పి సాక్ష్యాలు చూపించిన నమ్మడు. ఒకరోజు ముంబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న గాడ్సేకి అక్కడ ఉన్న త్రిషను చూసి గర్ల్ ఫ్రెండ్ మహాలక్ష్మి అంటూ వెంటపడతాడు. అయితే అక్కడికి చేరుకున్న గాడ్సే తల్లిదండ్రులు తనకి భార్య సరయు ఉందనే నిజాన్ని చెబుతారు. అదే నిజమనుకుని హైదరాబాద్ నుండి ముంబాయి వెళుబోతున్న గాడ్సేకి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి? అసలు బోస్ ఎవరు? సీఎంకి, బోస్ ఉన్న గొడవ ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఫ్లస్ పాయింట్లు:
ఈ సినిమాకి ఆది, అంతం తానే అయిన బాలకృష్ణ నటన సినిమాకే మెయిన్ హైలైట్. నిజాయితీగల సిబిఐ ఆఫీసర్ బోస్ గా, గాడ్సే అనే రెండు క్యారెక్టర్స్ లో వేరియషన్స్ ను చక్కగా ప్రెజెంట్ చేశారు. అలాగే ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు ఎనర్జిటిక్ గా నటించారు. మణిశర్మ సంగీతం బావుంది. ఐసా అమ్ముడు పిల్లా.. అనే టీజింగ్ సాంగ్, అనగనగా అష్టమిలో జన్మించావట.. అనే కృష్ణుడిపై వచ్చే పాట.. రాధికా అప్టేతో వచ్చే పెళ్లి సాంగ్... పిల్లా నీ కళ్లకున్న కాటుకేమో సూపరే.. సాంగ్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పరావాలేదు. మణిశర్మ ఆర్.ఆర్ ను అనుకున్న స్థాయిలో ఇవ్వలేదు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్ ను తెరపై చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్, క్లయిమాక్స్ ఛేజింగ్ ఫైట్, సెకండాఫ్ లో వచ్చే ట్రైబల్ ఫైట్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. త్రిష,సురేష్, ప్రకాష్ రాజ్, ఎం.ఎస్.నారాయణ, జయసుధ,చంద్రమోహన్, చలపతిరావు, రేఖ మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
మైనస్ పాయింట్లు :
ఈ సినిమాకి సత్యదేవ ఎంచుకున్న కథ బావుంది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్సయిన పర్సనల్ ఫైర్ వాల్ ప్రొటెక్షన్ మెథడ్,చిప్ బగ్గింగ్ వంటి మెథడ్స్ తో కూడుకున్న కథ రాసుకున్నాడు. ఈ పాయింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో తడబడినట్టు కనపడింది. కొత్త దర్శకుడైనా కారణమో, ప్రెషర్ గా ఫీల్ కావడమో కారణాలుగా మనం అనుకోవచ్చు. అయితే అవశాన్ని చక్కగా వినియోగించుకోలేదు. కథను మరింతంగా ఎలివేట్ చేసుండవచ్చు. తొలి సినిమాకే బాలకృష్ణ వంటి మాస్ హీరోని ప్రెజెంట్ చేయడం మామూలు విషయం కాదు. సినిమాలో కొత్త దనం కోసం కథ రాసుకున్న విధానం, పాత్రలు ప్రేక్షకులను కన్ ఫ్యూజ్ చేస్తాయి. త్రిష, రాధికా అప్టేలు పాటలకే పరిమితమైపోయారు. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు పదినిమిషాలు మినహా డ్రాగింగ్ గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కొంత మేర ఎడిట్ చేసి ఉంటే సినిమా ఫాస్ట్ గా ఉండేది. సెకండాఫ్ విషయానికొస్తే సినిమా చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది కానీ యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. అలీ, త్రిషలు కామెడితో నవ్వించాలనే ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. సీఎం వంటి వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయడమనేది కన్విన్సింగ్ గా అనిపించదు.
చివరగా :
లెజెండ్ బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా అనగానే ప్రేక్షకుడు కూడా ఆ స్థాయిలో సినిమా ఉండాలని ఉహించుకుని థియేటర్ కి వస్తాడు. అయితే సేమ్ రోటీన్ ఫార్ములాతో దర్శకుడు సినిమాని నడిపించడం, పాత కథ, ప్రేక్షకుడికి సినిమా ఫస్టాప్ అంతా సినిమా స్టార్టయిన పదినిమిషాలకే తెలిసిపోవడం ఇవన్నీ డ్రాబ్యాక్ అయ్యాయి. అయితే సినిమాకి సెకండాఫ్ కథ, బాలకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు పెర్ ఫార్మెన్స్ సినిమాని నిలబెట్టాయి. మణిశర్మ ట్యూన్స్ బావున్నా, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ కూడా పరావాలేదు. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువై పోయింది. కామెడి పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది. మొత్తం మీద సినిమా రిపీటెడ్ ఫార్ములాతో సాగిపోతుంది. అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంది. అలాగే పోటీ పెద్దగా లేకపోవడం కూడా బాగా కలిసొచ్చే అంశమే. చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది కానీ యాక్షన్ పార్ట్ ఎక్కువైంది. అలీ, త్రిషలు కామెడితో నవ్వించాలనే ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. సీఎం వంటి వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయడమనేది కన్విన్సింగ్ గా అనిపించదు.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment