లోఫర్

December 17, 2015 | 05:19 PM | 1 Views
Rating :
లోఫర్

నటీనటులు : వరుణ్ తేజ్, దిశా పఠానీ, రేవతి, పోసాని కృష్ణమురళి, అలీ, బ్రహ్మానందం, ముకేష్ రుషి, చరణ్ దీప్, శాండీ తదితరులు

సాంకేతిక వర్గం :

కెమెరామెన్ : పిజి విందా, ఎడిటర్: ఎస్ఆర్ శేఖర్, సంగీతం : సునీల్ కశ్యప్, నిర్మాత : సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాధ్

హీరోలను పక్కా మాస్ క్యారెక్టర్ లలో ఇడియట్లుగా, పోకిరీలుగా, దేశముదురులుగా చూపించాడు పూరీ జగన్నాథ్. హీరోకి పక్కా మాస్ ఇమేజ్ రావాలంటే ఖచ్ఛితంగా పూరీ చేతిలో పడాలని ప్రభాస్ లోఫర్ ఆడియో పంక్షన్ లో చెప్పుకోచ్చాడు. ముకుంద, కంచెలో క్లాస్ పాత్రల్లో మెప్పించిన వరుణ్ తేజ్ ను లోఫర్ గా తీసుకోచ్చాడు పూరీ. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు. దిశా పఠానీ అనే కొత్త ముఖాన్ని పరిచయం చేస్తూ వరుణ్ ని లోఫర్ గా ఎలా చూపించాడో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం...

కథ :

మురళి (పోసాని కృష్ణమురళి) తన కొడుకు రాజాని చిన్నప్పుడే తన భార్య దగ్గర్నుంచి తీసుకొచ్చేసి అతనితో డబ్బులు సంపాదించడం మొదలుపెడతాడు. కొడుక్కేమో తల్లి చనిపోయిందని చెబుతాడు. తల్లికేమో కొడుకు చనిపోయాడని చెబుతాడు. జోధ్ పూర్ సెటిల్ అయిన ఈ తండ్రీ కొడుకులు దొంగతనాలు మోసాలు చేసుకుని బతికేస్తుంటారు. అదే టైంలో తండ్రి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడని ఇంటి నుంచి పారిపోయి జోద్ పూర్ వస్తుంది మౌని (దిశా పటాని). ఆ అమ్మాయిని రాజా ప్రేమిస్తాడు. ఐతే రాజా మౌని అత్త (రేవతి)కి నచ్చడు. ఆ అత్తే తన కన్న తల్లి అని తెలుస్తుంది రాజాకు. ఇంతలో మౌనిని ఆమె అన్నలు ఇంటికి లాక్కెళ్లిపోతారు. ఇక రాజా తనెవరో చెప్పకుండా తనను అసహ్యించుకుంటున్న తల్లికి ఎలా దగ్గరయ్యాడు? ప్రేమను ఎలా సాధించుకున్నాడు అన్నదే కథ.

ఫ్లస్ పాయింట్లు:

పూరి జగన్నాధ్ సినిమా అనగానే ప్రేక్షకులు మూడు విషయాలు ఆశిస్తారు.. అవి ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయీపొయే హీరో మాస్ క్యారెక్టరైజేషణ్, మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్. వారు ఆశించే ఆ మూడు అంశాలే ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. ఈ సినిమాలో పూరి వీటితో పాటు సెంటిమెంట్ ని కూడా బాగానే దట్టించాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ కి పుల్ మాస్ ధోరణిలో సాగే పాత్ర చేయడం కొత్తయినప్పటికీ చాలా అంటే చాలా బాగా చేసాడని చెప్పాలి. మెయిన్ గా పూరి మార్క్ డైలాగ్స్ ని డెలివర్ చేయడంలో, హీరో పాత్రలో మానరిజమ్స్ ని చూపించడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. పూరి కూడా వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా తెరపై స్క్రీన్ పై చూపించి వరుణ్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసాడు. ముఖ్యంగా వరుణ్ కటౌట్ ని ఫైట్స్ లో చూపించిన విధానం బాగుంది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇది వరుణ్ తేజ్ ఏనా అని చాలా మంది షాక్ అయ్యేలా వరుణ్ తేజ్ వేరియేషణ్ చూపించాడు. ఇక హీరోయిన్ దిశా పటాని నార్త్ ఇండియన్ బ్యూటీ అయినా డైలాగ్ డెలివరీ మరియు హావ భావాల విషయంలో ది బెస్ట్ అనిపించుకుంది. ఇక గ్లామర్ పరంగా అయితే మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ, తన అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘జియా జలే’ సాంగ్ లో తడిసిన బట్టల్లో దిశాని చూపిన విధానం గ్లామర్ ట్రీట్ అని చెప్పాలి. పక్కా లోఫర్ పాత్రలో పోసాని కృష్ణమురళి మెప్పించాడు. ముఖ్యంగా పూరి మార్క్ సెటైరికల్ డైలాగ్స్ పోసాని చెప్పిన తీరు సూపర్. ఇక రేవతి మదర్ గా సినిమాకి ప్రాణం పోశారు. ముఖ్యంగా వరుణ్ – రేవతి కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం అందరినీ టచ్ చేస్తాయి. ఇక విలన్ గా ముఖేష్ ఋషి,చరణ్ దీప్, శాండీలు మంచి పోటీని ఇచ్చారు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, ధనరాజ్ లు ఓ నాలుగు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు.

పూరి జగన్నాధ్ కి హెల్ప్ అయిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ చాలానే ఉన్నాయి.. ముందుగా పిజి విందా జోద్ పూర్, రాజస్థాన్ లొకేషన్స్ ని చాలా చాలా బాగా చూపించాడు. అలాగే మన తెలుగు ఆడియన్స్ కి ఆ లొకేషన్స్ కొత్త కావడం వలన విజువల్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తాయి. ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటలు మాస్ ఆడియన్స్ వరకూ ఓకే పిక్చరైజేషన్ కూడా వారిని ఆకట్టుకునేలా ఉంది. ఇక సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పాలి. హీరో ఎలివేషన్ మరియు సెంటిమెంట్ సీన్స్ లో రీ రికార్డింగ్ అదిరింది. విఠల్‌ కోసనం ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.

మైనస్ పాయింట్లు :

పూరి జగన్నాధ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రాంగ్ కంటెంట్ ని ఎంచుకోవడం లేదు, ఓక చిన్న పాయింట్ ని తీసుకొని దానిని హీరో క్యారెక్టరైజేషణ్ తో అల్లుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ సీన్స్ అనేవి మెయిన్ పాయింట్ అయితే మిగతా అంతా తన రొటీన్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే పూరి చాలా సినిమాల మాదిరిగానే ఉంటుంది. అదీ కాక ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా లేదు. సినిమాలో ఎక్కువ భాగం సందర్భానుసారంగా వచ్చే కామెడీని రన్ చేయాలని చూసాడు, అది కొన్ని చోట్ల మాత్రమే హిట్ అయ్యింది, చాలా చోట్ల ఫెయిల్ అయ్యింది.

వీటన్నికంటే మించి పూరి చేసిన మెయిన్ మిస్టేక్ సినిమా మొదటి సీన్ లోనే కథ మొత్తాన్ని చెప్పేయడం, అలాగే స్క్రీన్ ప్లే కూడా ఎలా మొదలై ఎలా ఎండ్ అవుతుంది అనేది చెప్పెయడమే. ఇక సెకండాఫ్ లో ఎక్కువ భాగం సెంటిమెంట్ మీదకి కథ టర్న్ అవుతుంది, దాంతో సెకండాఫ్ ని మొదలు పెట్టడం బాగున్నా, ఓ 20 నిమిశాలా తర్వాత ఫ్లో మొత్తం పడిపోతుంది. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు. చెప్పాల్సిన పాయింట్ ఏమీ లేకపోవడం వలన, ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ అవడం వలన సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్లోగా ఉండడంతో ఆ ఫ్లోని అడ్డంగా కట్ చేసి క్లైమాక్స్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది.

చివరగా :

బ్యాక్ టు బ్యాక్ క్లాస్ ఎంటర్టైనర్స్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ఈ ‘లోఫర్’ సినిమా ముందుగా వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ పరంగా అందరూ సూపర్ అనేలా చేస్తుంది. సినిమా పరంగా డీసెంట్ పూరి మార్క్ మాస్ మసాలా మూవీ అనిపించుకుంటుంది. లుక్, డైలాగ్ డెలివరీ, మాస్ పెర్ఫార్మన్స్ తో వరుణ్ తేజ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.  కానీ, అసలు కథ లేకపోవటం, సెంటిమెంట్ ఓవర్ గా అనిపించటం, అనసరమైన ఫైట్స్ ఇలా మైనస్ లు సినిమాను రక్షించటం కష్టం. పూరి మార్క్ సినిమాలకి బాగా అలవాటు పడిన వారికి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ మిగతా వారికీ అంతలా కనెక్ట్ అవ్వకపోవచ్చు. దానికి ప్రధాన కారణం సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొరవడడమే.

చివరగా... బేసిక్ టైం పాస్ కోసం ఓ సారి చూడదగిన మాస్ మసాలా మూవీ లోఫర్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు