మంత్ర 2

July 31, 2015 | 03:35 PM | 11 Views
Rating :
మంత్ర 2

నటీనటులు : ఛార్మికౌర్, చేతన్ చీను, తనికెళ్ల భరణి, రాహుల్ దేవ్, ఢిల్లీ రాజేశ్వరి, జబర్దస్త్ వేణు తదితరులు

సాంకేతిక వర్గం :

కథ: కేపీఆర్, ఛాయాగ్రహణం:ఆర్.పి.తనకెళ్ల, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాతలు: యాదగిరి రెడ్డి శౌరి రెడ్డి, స్క్రీన్ ప్లే దర్శకత్వం: ఎస్.వి.సతీష్

ఛార్మి హీరోయిన్ గా 8 కిందట వచ్చిన మంత్ర అప్పట్లో పెద్ద సంచలనం. హార్రర్ చిత్రాల్లో సరికొత్త ట్రెండుకు దారితీసిందా సినిమా. ఆ సినిమాను తన భుజాల మీద నడిపించి.. మంచి పేరు సంపాదించి పెట్టింది ఛార్మి. ఇన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆమె ప్రధాన పాత్రలో మంత్ర సీక్వెల్ ‘మంత్ర-2’ తెరకెక్కింది. మరి సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం  ఏమేరకు  మెప్పించిందో చూద్దాం పదండి.

కథ :

ఓ యాక్సిడెంట్లో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మారిన మంత్ర (ఛార్మి) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. రామారావు (తనికెళ్ల భరణి) ఇంట్లో పేయింగ్ గెస్టుగా దిగుతుంది. ఐతే ఆమెను ఎవరో చంపడాడనికి ప్రయత్నిస్తుంటారు. ఒకటికి రెండుసార్లు తన మీద అటాక్ జరగడంతో తన స్నేహితుడైన ఏసీపీ విజయ్ (చేతన్ చీను)కు విషయం చెబుతుంది. అతను జర్నలిస్టు బృందాన్ని తీసుకుని.. రాత్రి పూట మంత్ర ఉంటున్న ఇంటికి వెళ్తాడు. అక్కడికెళ్తే మంత్ర రెండేళ్ల క్రితమే చనిపోయిన రామారావు అతడి భార్యతో కలిసి ఉంటున్నట్లు తెలిసి అంతా షాకవుతారు. మంత్ర విజయ్ జర్నలిస్టు బృందం ఆ ఇంట్లోకి వెళ్లగానే తలుపులు మూసుకుంటాయి. మరి వాళ్లందరూ అక్కడి నుంచి బయటపడ్డారా? మంత్రకు రామారావుకు సంబంధమేంటి? చివరికేమైంది? అన్నది తెరమీద చూసి తెలుసుకోవాలి.

ఫ్లస్ పాయింట్లు:

ఇది మంత్రకు సీక్వెల్ కాదు. కేవలం ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి మాత్రమే ఆ టైటిల్ పెట్టామని దర్శకుడు ముందే చెప్పాడు. కథ కూడా బడ్జెట్ పెద్దగా ఖర్చుగా లేకుండా సింపుల్ గా ఓ బిల్డింగ్ లోనే కానిచ్చేయడం దర్శకుడిని అభినందించోచ్చు. ఫెర్మామెన్స్ విషయంలో ఛార్మి మంత్రనే కంటిన్యూ చేసింది. ఇక మిగతా నటీనటుల్లో చేతన్ బాగా చేశాడు. తనికెళ్ల భరణి తన పాత్ర మేర నటించాడు. సునీల్ కశ్యప్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఉన్న ఒక్క సాంగ్ కి అతను బాగా కంపోజ్ చేశాడు. 

మైనస్ పాయింట్లు :

చూస్తున్నంత సేపు ఏదైనా బీగ్రేడ్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ‘మంత్ర’తో పోలికలు పక్కనబెట్టేసి మామూలుగా చూసినా.. మంత్ర ఏమాత్రం మింగుడు పడదు. హార్రర్ సినిమాలకు లాజిక్కులతో సంబంధం లేకుండా కథ రాసుకునే సౌలభ్యముంటుందన్నది వాస్తవమే. అలాగని మరీ సిల్లీ థింగ్స్ ట్రై చేస్తే చాలా కష్టం. బేసిక్ విషయాల్లోనే ఎంత లోపముందో చెప్పడానికి ఓ ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్నేహితులు హాస్పిటల్లో ఉంటారు. ఇద్దరి భార్యలూ ప్రసవానికి వెళ్తారు. ఓ స్నేహితుడి భార్య చనిపోయిన బిడ్డను ప్రసవిస్తుంది.  ఇంకో స్నేహితుడి భార్య కవలల్ని కంటుంది. తనకు ఎంతో చేసిన స్నేహితుడి కోసం భార్యకు కవలలని చెప్పకుండా ఓ బిడ్డను తీసుకెళ్లి స్నేహితుడికిచ్చేస్తాడు రెండో స్నేహితుడు. అయినా కవల పిల్లలన్న సంగతి ప్రసవించే వరకు తెలియకపోవడమేంటో కథకుడికే తెలియాలి? ఇలాంటి సిల్లీ థింగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి.

‘మంత్ర’కు మంత్ర-2 ఏ విషయంలోనూ సరితూగదు. చివరికి ఛార్మి విషయంలో కూడా పోలిక పెట్టలేనంత తేడా ఉంది ఈ సినిమాలో. ఏళ్లు గడవడం వల్ల అందం తగ్గితే తగ్గొచ్చు కానీ పెర్ఫామెన్స్ విషయంలోనూ ఆమె ఫేడవుట్ అయిపోయినట్లు కనిపించడమే ఆశ్చర్యం. డానికి పూర్తి బాధ్యత బలహీనమైన స్క్రిప్టుదే అని చెప్పాలి. సినిమాలో విషయం లేనపుడు ఛార్మి మాత్రం ఏం చేయగలదు పాపం?

చివరగా :

తొలి సన్నివేశంలోనే భయపెట్టి.. పావుగంటకే సినిమాలో లీనం చేసి.. ఇంటర్వెల్ సమయానికి ఊపిరి బిగబట్టేలా చేసి.. ద్వితీయార్ధమంతా వణికించి.. క్లైమాక్స్ సమయానికి ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మంత్ర’ అయితే... తొలి సన్నివేశంలోనే ‘ప్చ్’ అనిపించే.. 20 నిమిషాలకే పిచ్చ బోర్ కొట్టించి.. ఇంటర్వెల్ సమయానికి రెండున్నర గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలిగించి.. ద్వితీయార్ధమంతా ‘ఎండ్’ కార్డ్ ఎప్పుడు పడుుతుందా అని వెయిట్ చేసేంత అసహనం కలిగించి.. క్లైమాక్స్ అవగానే హమ్మయ్య అన్న నిట్టూర్పుతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటపడేలా చేసిన సినిమా మంత్ర-2.

 

చివరగా... థ్రిల్ ఇవ్వకపోగా, పిచ్చెక్కించే సినిమా. అయినా చూస్తామంటే మీ ఓపిక. 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు