నటీనటులు : నయనతార, అరి , లక్ష్మీప్రియ, రోబో శంకర్, మైమ్ గోపీ, శరత్, అమ్ జాత్ ఖాన్ తదితరులు
సాంకేతిక వర్గం :
సినిమాటోగ్రఫీ : సత్యం సూర్యన్, సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, బ్యానర్: శ్రీశుభశ్వేత ఫిలింస్, సీకే ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత : సి.కళ్యాణ్, దర్శకత్వం: అశ్విన్ శరవనన్
కెరీర్ మొదటి ఇన్నింగ్స్ టాప్ హీరోలతో గ్లామర్ పాత్రలను చేసుకుంటూ వచ్చింది నయనతార. అయితే సెకండ్ ఇన్నింగ్స్ శ్రీరామరాజ్యం తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్, కంటెంట్ ఉంటే చాలు చిన్న హీరోలతోనైనా నటించేందుకు సిద్ధమైపోతుంది. ఇదే క్రమంలో తమిళంలో షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. అదే మయూరి. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ చిత్రంగా తెరకెక్కిన మయూరి వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మధ్య హర్రర్ చిత్రాలు చాలానే వచ్చేస్తున్నాయి. మరీ వీళ్లు కొత్తగా ఏం చూపించారు అన్న అనుమానం మీకు ఉందా. అయితే కథలోకి పదండి...
కథ :
ఓ ఫ్రెండ్ తన స్నేహితుడికి మాయావనం గురించి చెబుతుండగా కథ ప్రారంభమౌతుంది. మాయావనం అనేది ఓ అటవీ ప్రాంతం. అక్కడ ఉండే ఓ పిచ్చాసుపత్రిలో బాహ్య ప్రపంచానికి తెలికుండా ఘోరాలు జరుగుతుంటాయి. జంతువుల మీద చెయ్యాల్సిన ప్రయోగాలను పెషెంట్ల మీద చేస్తూ ఉంటారు. వికటించి చనిపోయిన వారిని అక్కడే పూడ్చి పారేస్తుంటారు. దయనీయ పరిస్థితుల్లో మాయా అనే ఓ పెషెంట్ అక్కడ చేరుతుంది. అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, ఆ బిడ్డ దూరం కావటంతో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆపై దెయ్యమై ఆ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టిస్తుంది. ఇదే విషయంపై పలు పరిశోధనలు జరగడమే కాక మాయ మీద చీకటి అనే సినిమా కూడా రూపొందుతుంది. ఆ చిత్రాన్ని ఒంటరిగా ఎవరైతే చూస్తారో వారికి 5 లక్షల ప్రైజ్ మనీని ప్రకటిస్తాడు చిత్ర దర్శకుడు (మైమ్ గోపీ). ఆ క్రమంలోనే ఓ నిర్మాత సినిమాను చూస్తూ చనిపోతాడు. ఇక మయూరి(నయనతార) అనే యాడ్ ఫిల్మ్ నటి మనస్ఫర్థలతో భర్త అర్జున్(అరి)కి దూరంగా ఉంటూ తన పాపను చూసుకుంటుంది. తన ఫ్రెండ్ (లక్ష్మీప్రియ) సాయంతో లైఫ్ ను నెట్టుకొస్తుంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది పెట్టడంతో చీకటి ని చూసేందుకు సిద్ధమైపోతుంది. తర్వాత ఏం జరిగింది అన్నదే కథ...
ఫ్లస్ పాయింట్లు:
ఈ చిత్రానికి మేజర్ ఫ్లస్ పాయింట్ కథ. దెయ్యం కథే అయినా సెంటిమెంట్ తో నడిపించటంతో ప్రేక్షకులకు చాలా రీచ్ అవుతుంది. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న సబ్జెక్టు, డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నటీనటులు విషయానికొస్తే... ఈ చిత్రంలో మనకు తెలిసిన ఒకే ఒక్క ఫేస్ నయనతార. ఆమె తప్ప మిగతావారు ఎవరూ మనకు పరిచయం లేదు. ఒక రకంగా సినిమా హైప్ కావడానికి కారణం ఆమెనే. మధ్యతరగతి యువతిగా, ఓ బిడ్డకు తల్లిగా ఆమె జీవించేసింది. ఇక హీరో ఆరి ఇప్పటిదాకా ఓ నాలుగైదు చిత్రాల్లో నటించినప్పటికీ, ఇందులో పూర్తిస్థాయిలో నటన కనబరిచాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన బావుంది, ఇక నయనతార ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన లక్ష్మీప్రియ నేచురల్ గా నటించింది. ముఖ్యంగా సినిమాను చూడటానికి థియేటర్ లో కూర్చునప్పుడు ఆమె చూపించిన ఆప్యాయత కన్వెన్సింగ్ గా వుంది. వీరి తర్వాత దర్శకుడి పాత్రలో నటించిన మైమ్ గోపీ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ వుంది. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ కాకుండా ఎవరి పాత్ర పరిధి మేరలో వారు నటించారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. సూర్యన్ కెమెరా వర్క్. రాన్ ఎథన్ యోహాన్ సంగీతం ముఖ్యమని చెప్పుకొవచ్చు. ఉంది ఒక్కటే పాటయినా నేపథ్య సంగీతంతో యోహన్ బాగా అలరించాడు. ఓ హర్రర్ సినిమాకి కావాల్సిన కరెక్ట్ బ్యాగ్రౌండ్ ను అందించాడు. ఇక ఓవైపు ‘చీకటి’ సినిమాతోపాటు, మయూరి చిత్రానికి సూర్యన్ కెమెరాపనితనం బాగా ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్లు :
కాస్త కన్ప్యూజ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు ఏం జరుగుతుందో కాసేపు అర్థంకానీ పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో అయితే మరీను. సినిమాలో సినిమా అని క్యాచ్ చెయ్యటానికి చాలా టైం పడుతుంది. అలాగే సెకాండాఫ్ లో కాస్త సాగదీతలా కనిపిస్తుంది. కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బావుండేది.
చివరగా :
దెయ్యం తనవారికి ఏదో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ లు ఇదివరకు చాలానే వచ్చాయి. ఈ మధ్య వచ్చే దెయ్యాల చిత్రాలన్నీ ఇవే కాన్సెప్ట్ లతో వస్తున్నవే. కానీ, ఇది పూర్తి స్థాయి హర్ట్ టచింగ్ దెయ్యం స్టోరీ. కామెడీ, పాటలు లాంటి ఎలిమెంట్స్ ని ఇరికించకుండా కేవలం కంప్లీట్ కథతోనే ఈ చిత్రం నడవటం పెద్ద అస్సెట్. శాపగ్రస్తమైన హర్రర్ చిత్రాల గురించి హీరోయిన్ తన ఫ్రెండ్ కి చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. ఇక వాటి ఇన్సిపిరేషన్ తోనే ఓ ఉంగరం, డైరీ, బొమ్మ ఇలా దెయ్యం వస్తువుల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కించినట్లు క్లియర్ గా తెలుస్తుంది. మాయా మాథ్యూస్ కథ, చివర్లో తల్లి కూతుళ్ల సెంటిమెంట్ ను జనాలకు కాస్త గుండె బరువెక్కేలా చేశాడు దర్శకుడు. అయినా మయూరి బాగానే వణికిస్తుంది.
చివరగా.... బొమ్మలో బొమ్మ చూపించి బాగానే భయపెట్టింది మయూరి.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment