నాన్నకు ప్రేమతో...

January 13, 2016 | 02:30 PM | 11 Views
Rating :
నాన్నకు ప్రేమతో...

నటీనటులు : ఎన్టీఆర్‌ , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు

సాంకేతిక వర్గం :

ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌,  ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌,  ఎడిటింగ్‌: నవీన్‌ నూలి,  పాటలు: చంద్రబోస్‌,  డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌,  ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినీచిత్ర,  సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,  నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

చాలా కాలం తర్వాత టెంపర్ తో హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈసారి మాత్రం అంతకు మించిన సక్సెస్ ను అందుకోవాలని అనుకున్నాడు. వన్ సినిమా అట్టర్ ప్లాఫ్ తో తీవ్ర నిరాశలో ఉన్న సుకుమార్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. జూనియర్ ని ఇంతవరకు చూడని రీతిలో స్టైలిష్ గా తయారు చేసిన సుక్కూ వైవిధ్యభరింతగా తెరకెక్కించినట్లు చెప్పుకోచ్చాడు. నాన్నకు ప్రేమతో తన తండ్రి చనిపోయే ముందు మదిలో మెదిలిన కథ అంటూ సెంటిమెంట్ టచ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి ఈ క్లాస్ డైరక్టర్ మాస్ హీరోతో చేసిన ఈ ఎమోషన్ డ్రామా ఎలా పండిందో తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథ :

విదేశాల్లో ఉద్యోగం కోల్పోయి, తన లాంటి యువకులతో కలిసి ఓ కంపెనీని నడుపుతుంటాడు అభిరామ్ (జూనియర్ ఎన్టీఆర్). సడన్ గా ఓరోజు తండ్రి సుబ్రహ్మణ్యంకు ఆరోగ్యం బాలేదని ఇండియా నుంచి ఫోన్ వస్తుంది. నమ్మిన వ్యక్తి మోసం చేయటంతో రోడ్డుపాలైన కోటీశ్వరుడు రమేష్ చంద్ర ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్), సుబ్రమణ్యంగా పేరు మార్చుకుని సాధారణ జీవితం గుడుపుతుంటాడు. తండ్రి గతం నుంచి తెలుసుకున్న అభిరామ్ ఆయన ఆఖరి కోరిక తీర్చాలనుకుంటాడు. అదే తన తండ్రిని మోసం చేసిన కృష్ణమూర్తి (జగపతిబాబు) పతనం. మరి చావుబతుకుల్లో ఉన్న తండ్రి ఆఖరి కోరికను ఎలా తీర్చాడు? అందుకోసం ఎవరెవరినీ వాడుకున్నాడు అన్నదే కథ…

ఫ్లస్ పాయింట్లు:

ముందుగా నటీనటుల విషయానికొద్దాం... ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ కోసమే అన్నట్లు జీవించేశాడు జూనియర్. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు కన్నీళ్లు పెట్టిస్తాడు. ఎమోషన్ సీన్లలో మాములుగానే చెలరేగిపోయే ఎన్టీఆర్ తో అద్భుతమైన ఫర్ పార్మెన్స్ లాక్కున్నాడు సుకుమార్. టోటల్ గెటప్ చేంజ్ చేసుకున్నదానికి ప్రతిఫలం దక్కింది. ఆ స్టైలే అతని సినిమాలో అతని లుక్కుకి మేజర్ అస్సెట్. ఇక డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. డాన్సుల్లో కూడా తన మార్క్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఓవరాల్ గా నటనలో ఎన్టీఆర్ కు ఇదో లాండ్ మార్క్ మూవీ అని చెప్పోచ్చు. అయితే ఎన్టీఆర్ నుంచి ఇలాంటి మైండ్ గేమ్ జనాలు తక్కువే.

                         ఇక హీరోయిన్ గా చేసిన రకుల్ విషయానికొస్తే తన పాత్ర తెలివైనదో లేక అమాయకురాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌  ఉన్న యువతిగా చేసింది. సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకుని ఆకట్టుకుంది. దివ్యాంక పాత్ర లో రకుల్ ఇప్పటిదాకా చేసిన పాత్రల కంటే ప్రాధాన్యం ఉన్న పాత్రగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల్లిని కలుసుకునే సీన్ లో అద్భుతమైన ఎమోషన్ ను పండించింది. ఇక వీరి తర్వాత మెయిన్ లీడ్ స్టైలిష్ విలన్ గా చేసిన జగపతిబాబుదే. చాలా రోజుల తర్వాత నటించాల్సి వచ్చింది అని జగపతి బాబు చెప్పటం తెలిసిందే. తెరపై చూస్తే అది అవుననే చెప్పాలి. కూల్ విలన్ గా హీరోను ముప్పుతిప్పలు పెట్టే సీన్లలో, ముఖ్యంగా చివర్లో రియలైజ్ అయ్యే సీన్లలో జగ్గూభాయ్ చించేశాడు. ఇక నాన్న క్యారెక్టర్ రాజేంద్రప్రసాద్ కి సీన్లు తక్కువే అయినా జీవించాడు. మిగతావారిలో రాజీవ్ కనకాల, అశిష్ విద్యార్థి, తాగుబోతు రమేష్, స్పెయిన్ యువతి తమ తమ పాత్రల మేర నటించారు.

ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే...

నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ పెయింటింగ్ లా ఆవిష్కరించడంలో విజయ్ కె చక్రవర్తి పనితనం అదరహో అనేలా ఉంది. ఇక నటీనటులను ప్రెజంట్ చేసిన విధానం, లొకేషన్స్ ని చూపిన విధానం, ఎమోషనల్ సీన్స్ లో మూడ్ ఇన్వాల్వ్ మెంట్ ని కాప్చ్యూర్ చేసిన విధానం నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఇక అలాంటి విజువల్స్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ శ్రవణానందాన్ని అందించిది. ఇక ఎమోషనల్ మరియు ఎలివేషన్ సీన్స్ లో తను అందించిన మ్యూజిక్ అదుర్స్. రవీందర్ ఆర్ట్ వర్క్ బాగుంది. లండన్ లో వేసిన స్పెషల్ ఆఫీస్ సెట్ సందర్భాలకు సింక్ అయ్యేలా ఉంది. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా భలే ఉంది. ముఖ్యంగా చివరి ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ ని మాత్రం బాగా ఎడిట్ చేసి కనెక్ట్ చేసాడు.

ఇక కథలో సుకుమార్ తో పాటు హుస్సేన్ షా కిరణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కథ పరంగా ఓకే ఎమోషనల్ కంటెంట్ తప్ప మిగతా అంతా రెగ్యులర్ రివెంజ్ డ్రామా లైన్ అవ్వడంతో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని సూపర్బ్ గా రాసుకున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం అద్భుతః అనేలా ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్ అనేది సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమాకు మేజర్ మైనస్ సెకండాఫ్. దాదాపు 3గంటల 20 నిమిషాల చిత్రాన్ని కోసి కోసి చివరకు 2గంటల 48 నిమిషాలకు కుదించాడు సుక్కూ. కానీ, అది కాస్త ఎక్కువే అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త లెంగ్తీగా ఉన్న ఇంట్రస్టింగా సాగటంతో పట్టించుకోని ప్రేక్షకుడు కీలకమైన సబ్జెక్టు సెకండాఫ్ కి వచ్చేసరికి బోరింగ్ అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే స్లో మూలనా ఆ టైం రన్ సాగదీసినట్లు అర్థమైపోతుంది. ఇక మూస ఫార్ములా అయిన ఎంటర్ టైన్ మెంట్ లేకపోవటం కూడా ఓ బిగ్ మైనస్. సుకుమార్ వన్ సినిమాకి చేసిన మిస్టెక్ ఇక్కడా రిపీట్ చేశాడు. అదే కన్ఫ్యూజ్డ్ గా కథను నడపటం. నాన్నకు ప్రేమతో అన్నప్పుడు కీలకమైన ఆ క్యారెక్టర్ ను హైలెట్ చేయాల్సింది. కానీ, రాజేంద్ర ప్రసాద్ కేవలం వీల్ చైర్ కే పరిమితం చేసి ఆ పాత్రను ఓ మూలన కూర్చోబెట్టాడు దర్శకుడు. తండ్రి ప్రేమను హైలెట్ చేసిన సంఘటనలు కూడా తక్కువే అనిపిస్తాయి. అయితే చివరి 45 నిమిషాలు మాత్రం ప్రేక్షకుడు చిత్రానికి విపరీతంగా కనెక్ట్ అవుతాడు.

చివరగా :

కోటీశ్వరుడైన ఓ తండ్రి నమ్మిన వ్యక్తి మోసపోవటంతో రోడ్డున పడి మాములు జీవితం గడపటం. తండ్రి చివరి కోరికగా ఆ మోసం చేసిన వ్యక్తి పతనాన్ని కొడుకు కానుకగా ఇవ్వటం రోటీన్ రివెంజ్ డ్రామా. అయితే లోకేషన్ల మూలానేమో లేక కెమెరా మోడ్ మూలంగానేమో ఓ ఇంగ్లీష్ సినిమాను చూసిన ఫీల్ కలుగుతుంది. వన్ సినిమా డిజాస్టర్ పాఠాలు నేర్చుకున్న మ్యాథ్స్ టీచర్ కమ్ డైరక్టర్ సుకుమార్ ఈసారి రెగ్యులర్ ఫ్లేవర్ నే టచ్ చేశాడు. టైటిల్ కార్డు దగ్గరి నుంచి క్లైమాక్స్ దాకా అన్నింట్లో తన శైలిని చూపాడు. అయితే ఎడ్యుకేటెడ్‌ సెక్షన్‌కి సుకుమార్‌ స్కీమ్‌లు కొన్ని బాగా నచ్చుతాయేమో కానీ సినిమాని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావించే మాస్‌ ప్రేక్షకులు ఇలాంటి అంశాలతో మాత్రం కనెక్ట్‌ కాలేరు. కానీ, ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని చూడాలనుకునే ఫ్యాన్స్ మాత్రం ఇది పండగే. క్లైమాక్స్ అయ్యాక బయటికి వచ్చే ప్రేక్షకుడికి తన తండ్రి గురించి మదిలో ఓ ఆలోచన మెదలటం మాత్రం ఖాయం.

చివరగా... ఇంటలిజెంట్ కోషియెంట్ ని పక్కనబెట్టి ఎంటర్టైన్మెంట్ కోషియెంట్ తో తెరకెక్కిన సినిమా. స్టైలిష్ ఎమోషన్ రివెంజ్ డ్రామా.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు