పండగ చేస్కో

May 29, 2015 | 03:16 PM | 4 Views
Rating :
పండగ చేస్కో

నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఎమ్మెఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, సాయికుమార్, సంపత్ రాజ్ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్ – యునైటెడ్ మూవీస్ లిమిటెడ్, ఎడిటర్- గౌతంరాజు, కెమెరా- సమీర్ రెడ్డి, ఆర్ట్ – ఎ.యస్.ప్రకాష్, కథ- వెలిగొండ శ్రీనివాస్, సంగీతం- ఎస్.ఎస్.థమన్, నిర్మాత- కిరీటి పరుచూరి, దర్శకత్వం- గోపిచంద్ మలినేని

చాలా కాలంగా తెలుగులో హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో రామ్, కొద్దిగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమాయే పండగచేస్కో. కమర్షియల్ సిమాలతో సక్సెస్ కొట్టిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే...

కథ :

కార్తీక్ పోతినేని(రామ్) పోర్చుగల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎం.డి., తల్లిదండ్రులతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాడు. తన వ్యాపారాన్ని అబివృద్ధి చేసుకోడానికి స్వీటీ(సోనాల్ చౌహాన్)ను కార్తీక్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వీకెండ్ వెంకట్రావు(బ్రహ్మానందం) సలహాతో స్వీటీ కూడా తన మూడు వేల కోట్ల ఆస్థి కోసం ఇండియన్ అయిన కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ అంతలోనే ఇండియాలో తన ఫ్యాక్టరీకి వచ్చి సమస్య కారణంగా ఇండియా వచ్చిన కార్తీక్ అక్కడ దివ్య(రకుల్ ప్రీత్)ను చూసి ఇష్టపడతాడు. దివ్య నాన్న భూపతి రెడ్డి(సంపత్ రాజ్), మావయ్య సాయి రెడ్డి(సాయికుమార్)లు మధ్య పాత గొడవలు పెద్దవై ఉంటాయి. వీరిద్దరు దివ్య పెళ్లి తమకు నచ్చినవాడితో చేయాలనుకుంటుంటారు. అప్పుడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

సినిమాలో రామ్ చక్కని నటను ప్రధర్శించాడు. ఫుల్ ఎనర్జీతో డాన్సులు, ఫైట్స్ చేశాడు. సినిమా మొత్తాన్ని తానై ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ తన గత చిత్రాల కంటే గ్లామరస్ గా కనిపించింది. సోనాల్ చౌహాన్ అందాల అరబోతకు ప్రాధాన్యమిచ్చినంత నటనకు ఇవ్వలేదని తెలుస్తుంది. బ్రహ్మానందం ఇలాంటి స్పెషల్ రోల్స్ ను చాలానే చేశాడు కాబట్టి కొట్టిన పిండిలా పాత్రను చేసేశాడు. సంపత్ రాజ్, సాయికుమార్ అభిమన్యుసింగ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి ఫ్రేమ్ ను కలర్ ఫుల్ గా చూపించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్లు :

కొన్ని చోట్ల రామ్ నటన ఓవర్ గా కనిపిస్తుంది. మనీ మైండెడ్ పర్సన్ అయిన వ్యక్తి చిన్న మాటతో మారిపోయినట్టు చూపించడం కన్విన్సింగ్ గా అనిపించదు. ఇండియన్ ను పెళ్లి చేసుకుని కోట్ల ఆస్థికి వారసురాలు కావాలనుకునే సోనాల్ చౌహాన్ చివర్లో విలన్ అభిమన్యుసింగ్ ను పెళ్లి చేసుకోవడం ఎంత వరకు సమంజసమో చూడాలి. అలాగే బ్రహ్మానందం క్యారెక్టర్ అక్కడక్కడా చేసే ఓవరాక్షన్ ఇబ్బందిగా అనిపిస్తుంది. థమన్ సంగీతం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గోపిచంద మలినేని రిపీటెడ్ ఫార్ములా ఉన్న ఈ కథతో సినిమా ఎందుకు తీయాలనుకున్నాడో ఆయనకే తెలియాలి. సినిమా కాన్సెప్ట్ అంతా ముందుగానే ప్రేక్షకుడికి రివీల్ అయిపోతుంది. ఓ సినిమాలో హీరో అత్త కోసం ఇండియా వస్తే ఇందులో హీరో మావయ్య కోసం ఇండియా వస్తాడంతే...

చివరగా :

కథలు గురించి కొత్తగా ఆలోచించరా అని అనిపించేలా సినిమా ఉంటుంది. ఎందుకంటే ఈ తరహా కథను రెడీ టైమ్ నుండి మనం చూసేశాం. కాబట్టి ఇందులో రెండు, మూడు కామెడి సీన్స్ మినహా పెద్ద నవ్వు తెప్పించేంత కామెడి లేదు. అదేమని రచయితలను అడిగితే సోషల్ మీడియాలో మీరు గొప్ప కథలుంటే చెప్పండంటూ విరుచుకుపడతారు. డోస్ ఎక్కువైనా అమృతం కూడా విషమవుతుంది. అలాగే సక్సెస్ ఫార్ములా కూడా  అదే పనిగా ఒకే రచయిత తన పెటెంట్ హక్కు అనేలా రిపీట్ చేస్తే ఏమవుతుందో ఈ సినిమాయే ఉదాహరణ.

చివరగా... బాలేదని చెప్పలేం కానీ..రిపీటెడ్ ఫార్ములా కాబట్టి బోర్ గా ఫీలవుతాం. వన్ టైం వాచ్ మూవీ.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు