పులి

October 03, 2015 | 02:57 PM | 7 Views
Rating :
పులి

నటీనటులు : విజయ్, శ్రీదేవి, శృతి హాసన్, హన్సిక, శ్రీదేవీ, సుధీప్, ప్రభు తదితరులు

సాంకేతిక వర్గం :

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత : శోభ, శిభు థమీన్స్, సెల్వ కుమార్, దర్శకత్వం : చింబుదేవన్ డి

ఇళయదళపతి విజయ్ కి తమిళనాట ఉన్న మాస్ క్రేజ్ తెలిసిందే. రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను మెయింటెన్ ను చేస్తున్న ఏకైక నటుడు విజయే. అలాంటి విజయ్ ఫస్ట్ టైం సోషియో ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ వెయిటింగ్ మూవీగా తెరకెక్కింది పులి. ఇక చాలా కాలం తర్వాత అతిలోకసుందరి శ్రీదేవీ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో, కన్నడ స్టార్ నటుడు సుదీప్ విలన్ పాత్రలో నటించడం పులి ప్రత్యేకతలు. అందాల నటీమణులు శృతీహాసన్, హన్సికలు విజయ్ కి జోడిగా నటించారు. భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ చాలా ఇబ్బందుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ తుపాకీ లాగానే ఈ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకులను అలరించిందా? రివ్యూలోకి వెళ్దాం...

కథ :

అఘోరా ద్వీపం నుంచి భేతాళ జాతికి చెందిన కొంతమంది వచ్చి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకొని దానికి భేతాళ దేశంగా పేరు పెట్టి వారి కింద ఉన్న 56 ఊర్లని పరిపాలిస్తూ ఉంటారు. ఆ భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి(శ్రీదేవి). ఆమెకి సేనాని అయిన జలంధరుడు(సుధీప్) ప్రజలని హింసలు పెడుతూ, వారిని బానిసలుగా మార్చి వారి సంపదలను కొల్లగొడుతుంటారు. ఆ బాధిత రాజ్యంలో ఒకటే భైరవకోన. దానికి నాయకుడు నరసింగ నాయకుడు(ప్రభు). నరసింగుడికి ఓ రోజు అతనికి నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు(విజయ్) అని పేరు పెడతాడు. అతన్ని భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు. ఓ రోజు మనోహరుడు అదే కోనలో ఉండే మందార మల్లి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. వీరిద్ద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. అదే సమయంలో తిరుగుబాటు సంకేతాలు అందటంతో భేతాళ జాతి వారు భైరవ కొనపై దాడి చేసి సింగన్నను చంపి మందార మల్లిని ఎత్తుకుపోతారు. దాంతో మన మనోహరుడు మందార మల్లి కోసం భేతాళ దేశానికి బయలు దేరుతాడు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే పలు చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులను దాటుకుంటూ వెళ్ళిన మనోహరుడు మందార మల్లిని ఎలా కాపాడాడు.? అలాగే ఆ భేతాళ దేశంలో మనోహరుడు తన గురించి తనకు తెలియని విషయాలను ఏం తెలుసుకున్నాడు.? అన్నదే కథ...

ఫ్లస్ పాయింట్లు:

బిగ్గెస్ట్ మైనస్ కథ. బేసిక్ రివెంజ్ స్టొరీ అనగా... తండ్రి పగని కొడుకు తీర్చుకునే కథకి కొత్తదనం యాడ్ చెయ్యాలని సోషియో ఫాంటసీ అనే జానర్ ని కలిపాడు. కానీ కథకి అస్సలు హెల్ప్ కాలేదు. చెప్పాలంటే చందమామ కథల్లో ఉండే ఆసక్తిని కూడా పులి లో చూపలేకపోయాడు దర్శకుడు. ఎక్కడా కూడా ఎక్సయిట్ అయ్యే అంశాలుగానీ, వావ్ అనుకునే సందర్భాలు కూడా లేవు. దానికి తోడు సినిమా నేరేషన్ చాలా అంటే చాలా స్లోగా సాగుతుంది. సినిమాలో కథకి అవసరం అయిన వాటి కంటే అనవసరం అనిపించుకునే సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఊ అన్నా, ఆ అన్నా పాట వచ్చేస్తుంది. అవసరం లేని పాటలు అలా రావటంతో ఇరిటేట్ అవుతాడు ప్రేక్షకుడు. ఇక డైరెక్టర్ గా విజువల్స్ ని అయితే చూపించగలిగాడు కానీ పేపర్ మీద రాసుకున్న సీన్స్ ని స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాడు. ఏ సీన్ లోనూ పర్ఫెక్ట్ ఎమోషన్ కనిపించదు. ఒకవైపు విలన్స్ ని సీరియస్ గా చూపిస్తున్నా, హీరో సైడ్ నుంచి మాత్రం కథని కామెడీగా చూపిస్తూ ఉంటాడు. ఆ పాయింట్ ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ అవ్వదు. అలాగే సినిమాకి మెయిన్ అనిపించుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సిల్లీగా అనిపించడంతో క్లైమాక్స్ పై ఆసక్తి పోతుంది. ఇక మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అదసలు దేవీ ప్రసాద్ కొట్టిందేనా అన్న అనుమానం కలుగుతుంది.

మైనస్ పాయింట్లు :

చివరగా :

సోషియో ఫాంటసీ మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘పులి’ సినిమా ప్రేక్షకులను నిరాశాపరిచేలా ఉంది. ఈ సినిమా సినీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ పేపర్ మీద రాసుకున్న కథని తెరపై చూపించలేకపోవడం. పులి సినిమా విజువల్స్ పరంగా సూపర్, కానీ కంటెంట్ ఎగ్జిక్యూషన్ పరంగా జస్ట్ యావరేజ్. ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ శక్తి వర్షన్ తమిళ్ సినిమా అని చెప్పుకొవచ్చు.

చివరగా... ప్రచారంలో ఉన్న గాండ్రింపు... స్క్రీన్ మీద లేదనే చెప్పాలి.

ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు