రాజుగారి గది

October 26, 2015 | 02:02 PM | 8 Views
Rating :
రాజుగారి గది

నటీనటులు : అశ్విన్ ఓంకార్, చేతన్ చీను, పూర్ణ, ధన్య బాలకృష్ణ, షకలక శంకర్, ధన్ రాజ్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఆర్ట్ : సాహి సురేష్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం : సాయి కార్తీక్, నిర్మాత : ఓంకార్, దర్శకత్వం : ఓంకార్

ఈ మధ్య కాలంలో  సూపర్ హిట్ ఫార్ములాగా నిలిచిన హర్రర్ కామెడీ నేపధ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ‘రాజుగారి గది’. జీనియస్ ఫ్లాప్ తర్వాత బుల్లితెర అన్నయ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. పబ్లిసిటీ పుణ్యమా అని వారాహి చలన చిత్రం-ఏకే ఎంటర్టైన్మెంట్ వారు కలిసి ఈ సినిమాని రిలీజ్ చేసారు. భయపెడుతూనే కడుపుబ్బా నవ్విస్తానని నమ్మకంగా ఉన్న ఓంకార్ ఆశలని రాజుగారి గది ఎంతవరకూ నిజం చేసింది.? ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలోకి వెళ్దాం...

కథ :

ముగ్గురు యువకులు కలిసి నందిగామలోని ఓ పాత రాజమహల్ లోకి వస్తారు. అలా వచ్చిన వారు అక్కడ చనిపోతారు. ఆ రాజ మందిరం గురించిన రహస్యాన్ని చేధించాలి అని వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే 34 మంది చనిపోవడంతో రా రాజమందిరాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అక్కడి నుంచి ఒక 6 నెలలు గడిచాక మా టీవీ వారు ప్రభుత్వం చేత పర్మిషన్ ని సాధించి అదే రాజమహల్ లో 7 రోజులు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాడికి 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ‘దెయ్యంతో 7 రోజులు పట్టుకుంటే 3 కోట్లు’ అనే రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. ఈ ప్రోగ్రాం కోసం ఓ 7 మందిని సెలక్ట్ చేస్తారు.

అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(షకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేక వేరే ఎవరన్నా ఆ హాత్యలు చేస్తున్నారా అనేది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ఫ్లస్ పాయింట్లు:

రాజుగారి గది అనే సినిమా ఓ హర్రర్ కామెడీ.. జానర్ ప్రకారమే ఈ సినిమాలో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా మొదటి అర్ధభాగంలో ఆడియన్స్ ని భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ చూసాక ఆడియన్స్ సూపర్ తీసాడు అని అనుకుంటారు. సినిమా స్టార్టింగ్ నుంచి అక్కడక్కడా భాపెడుతూ నవ్వించుకుంటూ వచ్చిన ఓంకార్ ఇంటర్వల్ బ్లాక్ దగ్గర అందరూ కలిసి దెయ్యాన్ని వెతకడం కోసం వెళ్ళే 20 నిమిషాల సీన్ తో ఆడియన్స్ ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ముఖ్యంగా శివుడుగా ధన్ రాజ్, మైదానంగా శకలక శంకర్ లు భీభత్సంగా నవ్వించారు. వీటికి తోడు ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అలాగే సెకండాఫ్ లో దెయ్యం – శకలక శంకర్ బ్యాక్ డ్రాప్ సీన్ కూడా బాగా నవ్విస్తుంది. రేసుగుర్రం బాబ్జీ పాత్రలో సప్తగిరి అలా వచ్చి ఓ 4నిమిషాలు నవ్వించి వెళ్ళిపోతాడు.

ఇక సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే.. అశ్విన్ ఓంకార్ ఉన్నంతలో బాగా చేసాడు. అతనికి ఉన్న ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. చేతన్ చీను నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక ధన్య బాలకృష్ణ తన పాత్రలో డీసెంట్ అనిపించుకుంది. ఈశాన్య జస్ట్ గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. కామెడీ కోసం తీసుకున్న ధన రాజ్, శకలక శంకర్, విద్యుల్లేకలు తమ కామెడీ పార్ట్ ని పర్ఫెక్ట్ గా చేసి అందరినీ నవ్వించారు. అతిధి పాత్రలో పూర్ణ, పోసాని కృష్ణమురళిలు ఓకే అనిపించారు. ముఖ్య పాత్రల్లో కనిపించిన రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్ లు సినిమాకి సెంటిమెంట్ టచ్ ని కనెక్ట్ చేయడంలో తమ వంతు బాధ్యనిని పర్ఫెక్ట్ గా చేసారు. ఇక కమెడియన్స్ గా రఘుబాబు, ప్రభాస్ శీను, అప్పారావులు తమ పాత్రలకు న్యాయం చేసి అడపాదడపా నవ్వించారు.

 ముందుగా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాకి ఇంతమంచి సెట్ వేసిన సాహి సురేష్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఒక హర్రర్ కామెడీకి కావాల్సిన పర్ఫెక్ట్ హౌస్ సెట్ ని వేసాడు. . ఇక ఆ సెట్లోని ప్రతి లొకేషన్ ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానం. సాయి కార్తీక్ రీ రికార్డింగ్ కి రాధా కృష్ణ చేసిన ఆడియోగ్రఫీ అదిరిపోయింది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్ కి తను కంపోజ్ చేసిన మ్యూజిక్ పెద్ద హెల్ప్ అయ్యింది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్లు :

ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన సస్పెన్స్ ని సెకండాఫ్ లో క్రియేట్ చెయ్యకపోవడమే మైనస్. ఫస్ట్ హాఫ్ ని దెయ్యం ఉందని భయపెడుతూ ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన ఓంకార్ సెకండాఫ్ స్టార్టింగ్ లోనే దెయ్యాన్ని కామెడీగా మార్చేసి బోర్ కొట్టించడం మొదలు పెడతాడు. అలాగే సినిమాకి చాల కీలకం అని చూపిన దెయ్యం ఎపిసోడ్ ని చాలా కామెడీగా రాసుకున్నారు. అది ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదు. అలాగే టైటిల్ ‘రాజుగారి గది’ అని పెట్టిన ఓంకార్ మొదటి నుంచి ఆ గదిలో ఏదో ఉందని చూస్పి చివరి అందులో ఏం లేదని కామెడీ చెయ్యడం సినిమాకి కనెక్ట్ అయిన ఆడియన్స్ సింక్ ని మిస్ చేసేలా ఉంది.

ఊహించని విధంగా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్ చేసి, సెకండాఫ్ లో మాత్రం చాలా రొటీన్, బోరింగ్ ఫార్మాట్ లో సినిమాని ముగించేయడం ఆడియన్స్ కి నచ్చదు. సెకండాఫ్ లో సస్పెన్స్ అనే ఎలిమెంట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. అలాగే ఉన్న ఒకే ఒక్క ట్విస్ట్ ని ఫస్ట్ హాఫ్ లోనే ఊహించేయగలరు.. కానీ కామెడీ వలన ఆడియన్స్ దానిని పక్కన పెట్టేసినా సెకండాఫ్ లో మాత్రం ఈజీగా గెస్ చేయగలరు. అందుకే సెకండాఫ్ ని ఇంకాస్త కట్ చేసి రన్ టైం తగ్గించాల్సింది. అలాగే సప్తగిరి ఎపిసోడ్ కాస్త నవ్వించినప్పటికీ అది అవసరం లేనిరోల్ , ఏదో కామెడీ కోసం బలవంతంగా సినిమాలో ఇరికించారు. అలాగే సెకండాఫ్ లో కామెడీ తగ్గడంతో పాటు సస్పెన్స్ అనే యాంగిల్ పూర్తిగా మిస్ అయ్యింది. పూర్ణ ఎపిసోడ్ ని చాలా సిల్లీ చేసెయ్యడం ఆడియన్స్ కి నచ్చదు. ఓవరాల్ గా సెకండాఫ్ లో కథనం సరిగా లేదు, అలాగే సినిమాలో లాజికల్ గా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎడిటర్ నాగరాజ్ ఫస్ట్ హాఫ్ ని సూపర్బ్ గా ఎడిట్ చేసారు కానీ సెకండాఫ్ ని ఆ రేంజ్ లో చేయలేదు. సెకండాఫ్ లో చాలా కట్ చేయాల్సినవి ఉన్నా వాటిని అలానే వదిలేసారు. ఒక డైరెక్టర్ గా సెకండాఫ్ ని కూడా ఇంకా బెటర్ గా చెప్పడానికి ట్రై చేసుంటే సినిమాకి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది. ఓయాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

ఓంకార్ నుంచి వచ్చిన హర్రర్ కామెడీ ‘రాజు గారి గది’ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ ని అక్కడక్కడా భయపెడుతూ ఎక్కువగా నవ్వించడంలో బాగానే సక్సెస్ అయ్యింది. ఓంకార్ ఒక సోషల్ మెసేజ్ ఉన్న స్టొరీ లైన్ ని హర్రర్ కామెడీ ఫార్మాట్ లో చెప్పిన విధానం బాగుంది. రాజుగారి గది అనే సినిమా ప్లస్ పాయింట్స్ కి వస్తే బాగా ఆసక్తికరంగా సాగే ఫస్ట్ హాఫ్, భయపెట్టే అంశాలతో పాటు కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఉండడం, ధనరాజ్ – శకలక శంకర్ ల కామెడీ హైలైట్ గా నిలవడం అయితే ఫస్ట్ హాఫ్ స్థాయికి సెకండాఫ్ మ్యాచ్ కాలేకపోవడం, సెకండాఫ్ లో సస్పెన్స్ మిస్ అవ్వడం కాస్త నిరాశకలిగించే అంశాలు.ఓవరాల్ గా కథ ద్వారా ‘మీ అవయవాలను దానం చేసి మీరు చనిపోయాక కూడా బతికే ఉండండి’ అని ఇచ్చిన మెసేజ్ అందరినీ ఆలోజింపజేసేలా ఉంటుంది.

చివరగా... ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ హ్యాపీగా ఓ సారి ఎంజాయ్ చేయదగిన సినిమా.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు