రుద్రమదేవి

October 10, 2015 | 02:24 PM | 6 Views
Rating :
రుద్రమదేవి

నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, సుమన్, అజయ్, హంసానందిని, ఆదిత్య మీనన్, విక్రమ్ సుజీత్ తదితరులు

సాంకేతిక వర్గం :

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: తోట తరణి, సంగీతం : మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్ : గుణ టీం వర్క్స్ , నిర్మాత : గుణశేఖర్, రాగిణి గుణశేఖర్, దర్శకత్వం : గుణశేఖర్

ఓ తల్లి బిడ్డను కనే సమయంలో పురిటి నొప్పులు ఎలా పడుతుందో అంతకన్నా ఎక్కువ బాధను అనుభవించాను ఈ సినిమా విడుదల కోసం అని చెప్పుకొచ్చాడు దర్శకుడు గుణశేఖర్. ఆర్థిక సమస్యలు, చిత్ర పెద్దల సహకారం లేకపోవటం తదితర కారణాల వల్ల చాలా ఆలస్యంగా విడులైంది రుద్రమదేవి. ఇండియన్ ఫస్ట్ 3డి హిస్టారికల్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందా చిత్రం. తన ఆస్తులన్నీంటిని అమ్ముకుని మరీ ఈ చిత్రాన్ని నిర్మించాడు గుణ. ఇక తెలుగులో లేడీ ఓరియెంటల్ చిత్రాలకు మళ్లీ ఆద్యం పోసిన నటి అనుష్క ఇందులో లీడ్ రోల్ రుద్రమగా నటించింది. ఆమె కూడా ఓవైపు బాహుబలితోపాటు రెండేళ్లు ఈ చిత్రం కోసం సమయం కేటాయించింది. అల్లు అర్జున్, రానా లాంటి స్టార్లతోపాటు భారీ తారాగణంతో వచ్చిన  ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? గుణశేఖర్ 12 ఏళ్ల శ్రమకి స్పందన ఏంటి? రివ్యూలోకి వెళ్దాం...     

కథ :

ఓరుగల్లుని కేంద్రంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). అయితే ఆయనకు అందరూ ఆడసంతానమే. చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. ఇక వారసుడు లేని ఈ సామ్రాజ్యం దండెత్తాలని దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) ఎదురుచూస్తుంటాడు. దీంతో  దాయాదుల వల్ల తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతుంటాడు. ఆ సమయంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి మగ పిల్లాడే పుట్టాడని ప్రకటించమని, అతనికి రుద్రదేవ అని నామకరణం చెయ్యాలని గణపతిదేవుడికి సలహా ఇస్తాడు. దీంతో రుద్రమదేవి అని నామకరణం చేసినా లోకానికి రుద్రదేవ అని పరిచయం చేస్తాడు. ఇక ఆమెకు సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ(రుద్రమదేవి) కూడా అన్ని విద్యల్లో ఆరితేరటంతో యువరాజుగా పట్టాభిషేకం చేయిస్తాడు కూడా.

                          ఆ తర్వాత గణపతిదేవుడి శత్రువులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు ఓవైపు,  మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. వీటితోపాటు బోనస్ గా బందిపోటు రాజైన గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరాడాలని ఎదురుచూస్తుంటాడు. మరి ఇన్ని ప్రమాదాల నుంచి రుద్రవీర అలియాస్ రుద్రమదేవీ ఏం చేసింది.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అన్నదే కథ...

ఫ్లస్ పాయింట్లు:

వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పాలనుకున్న దర్శకుడి థాట్స్ కి హాట్సాఫ్. ఎందుకంటే రుద్రమదేవి గురించి చిన్నతనంలో పుస్తకాల్లో పోరాటాల గురించే ఉంటుంది గానీ, ఆమె పూర్తి జీవిత గాథ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటి తరుణంలో ఆమె జీవిత చరిత్రలోని ఎన్నో అద్భుతమైన ఘట్టాలను దర్శకుడు గుణ తెరకెక్కించటంలో సక్సెస్ అయ్యాడు.  

ఇక నటీనటుల విషయానికొస్తే... రుద్రమదేవి పాత్రకు అనుష్క తప్ప ఎవరూ చెయ్యలేదన్నది ఒప్పుకోవాలి. అంతలా ఒదిగిపోయిందామె. ముఖ్యంగా ఓ ముఠా దాడి సమయంలో కత్తి పట్టి అనుష్క చేసే వీరోచిత పోరాటం సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ రోమాలు నిక్కబోడుచుకుంటాయి. ఆ సీన్లో బన్నీ డైలాగ్ లతో కూడా తెలంగాణ యాస లో ఆకట్టుకుంటాడు. వీరిద్దరు ఈ చిత్రానికి రెండు కళ్లులా అనిపిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్ వారి వారి పరిధిలో కానిచ్చేశారు. ఇక నిత్యామీనన్ రుద్రదేవ (రుద్రమదేవి)ని పెళ్లిచేసుకునే అమ్మాయి క్యారెక్టర్లో నటించి మరోసారి షాక్ కి గురిచేస్తుంది. అనుష్క, కేథరిన్, నిత్యా కావాల్సినంత గ్లామర్ డోస్ ను అందించారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.  ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దంని గుర్తు చేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి. ఇక అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ లో లేదా బయట తీసిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఆకట్టుకుంటాయి. తోట ప్రసాద్, గుణశేఖర్,  పరుచూరి బ్రదర్స్ కలిసి రానుకున్న డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ కి రాసిన డైలాగ్స్ బాగా పేలుతాయి.

మైనస్ పాయింట్లు :

చెప్పాలనుకుంది ఓ వీరనారి గాథ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అదేం ఈ కథలో కనిపించవు. రియాలిటీ కంటే సినిమాటిక్ అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. నిజగాథ స్క్రీన్ ప్లే ను రెగ్యులర్ గా రాసి తెరకెక్కించాడు గుణ. చాలా మందికి రుద్రమదేవి కథ గురించి పూర్తిగా తెలీదు అలాంటి సమయంలో సస్పెన్స్ ను, థ్రిల్ ను కలిగించేలా ఉండాలి. కానీ, అది ఇక్కడ జరగలేదు. అన్ని పాత్రల పరిచయాల తర్వాత రుద్రమదేవి కథలో ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. దాంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది.  ఇక సెకంఢాప్ కూడా చాలా స్లోగా నడుస్తుంది. ఎడిటింగ్ లో లోపం క్లియర్ గా తెలుస్తుంది. సన్నివేశాలే బోర్ కొడుతున్నాయి అనుకుంటున్న టైంలో వరుసగా పాటలు వచ్చి సినిమా పై అనాసక్తిని కల్పిస్తాయి. ఇళయరాజా పాటలు అన్న ఫీలింగ్ కూడా కలగదు. ఇక సినిమాలో ఆ రెండు పవర్ ఫుల్ పాత్రలకు తప్పా మిగతావి ఆడియన్స్ మిగతావాటికి కనెక్టవ్వటం కష్టం. సర్ప వ్యూహం – గరుడ వ్యూహం తప్ప వార్ ఎపిసోడ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

చివరగా :

కథలో కావాల్సినంత పస ఉన్నప్పటికీ దానిని ఇంకొంచెం జాగ్రత్తగా తెరకెక్కించాల్సింది. ముఖ్యంగా కల్పితాన్ని ఎక్కువ జోడించటం కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. చారిత్రాత్మక కథ అని చెబుతున్నప్పుడు అది ప్రేక్షకుల మదికి బాగా కనెక్ట్ అయ్యేలా చెప్పాలి అక్కడ కొంచెం గుణ తడబడ్డాడు. సెకండాఫ్ ను సాగదీయటం, అనవసరపు సాంగ్స్, లాంటి ఫిర్యాదులను పక్కనబెడితే ఎంజాయ్ చెయ్యోచ్చు...

చివరగా... అనుష్క, అల్లు అర్జున్ ల కోసం చూడొచ్చు. ఓ కేక అని కాకుండా డీసెంట్ విజువల్ హిస్టారికల్ మూవీని అందించాడు గుణశేఖర్.  



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు