షేర్

October 31, 2015 | 04:29 PM | 7 Views
Rating :
షేర్

నటీనటులు : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జీత్, ఎమ్మెఎస్ నారాయణ, బ్రహ్మానందం, అలీ, రావు రమేష్,, రోహిణి, ఆశిష్ విద్యార్థి, షఫీ, పోసాని, ముకేష్ రుషి, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్ : విజయలక్ష్మి పిక్చర్స్, నిర్మాత: కొమర వెంకటేష్, సంగీతం: ఎస్.ఎస్.థమన్, దర్శకుడు: మల్లిఖార్జున్

వరుస ప్లాఫుల సమయంలో అనిల్ రావిపూడి రూపంలో  ‘పటాస్’ అంటూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. గత సినిమాలకు చేసిన పొరపాట్లను పటాస్ తో తీర్చేసుకున్నానని, ఇకపై జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటానని చెప్పాడు కూడా. ఇక పటాస్ తోపాటే షూటింగ్ ప్రారంభించుకున్న షేర్ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కిన షేర్ కి గతంలో కళ్యాణ్ రామ్ తో అభిమన్యు, కత్తి సినిమాలను తీసిన మల్లికార్జున్ దర్శకుడు. అవి రెండు అంతగా ఆడకపోయినా మల్లిఖార్జున్ పై నమ్మకంతో ముచ్చటగా మూడో ఛాన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. మరి ఈ చిత్రం వీరిద్దరికి ఎలాంటి ఫలితమిచ్చింది. పటాస్ తర్వాత షేర్ తో కళ్యాణ్ రామ్ మరో హిట్ అందుకున్నాడా? లేక హ్యాట్రిక్ ఫెయిల్ చవిచూశాడా రివ్యూ లోకి వెళ్లి చూద్ధాం...

కథ :

మన కథలో హీరో గౌతమ్ (కళ్యాణ్ రామ్) అమ్మ(రోహిణి), నాన్న(రావు రమేష్), తమ్ముడు అజయ్ లతో హ్యాపీగా జీవితం గడుపుతుంటాడు. తనకి నచ్చింది అంటే దానికోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. తన ఫ్రెండ్ కోసం విలన్ పప్పీ(విక్రంజీత్) తో వైరం పెట్టుకుంటాడు. ఇక మన విలన్ పప్పీకి తనది ఎవడన్నా లాక్కుంటే, అవతల వాడిది తను లాక్కునే స్వభావం. దీంతో హీరోతో ఛాలెంజ్ కి దిగుతాడు.

ఇక ఇంకోవైపు మన హీరో గౌతమ్ నందు(సోనాల్ చౌహాన్) ప్రేమలో పడతారు. ఆపై హీరోయిన్ కూడా పడుతుంది. ఇది తెలుసుకున్న పప్పీ నందు ఫాదర్ ను ట్రాప్ చేసి నందుతో ఎంగేజ్ మెంట్ చేయించుకుంటాడు. ఇక విషయం తెలుసుకున్న హీరో విలన్ గ్యాంగ్ లోనే చేరి ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తాడు. అదే టైంలో గౌతమ్ పప్పీకి సపోర్ట్ గా నిలిచిన నేషనల్ లెవల్ డాన్ అయిన దాదా(ముఖేష్ రుషి)ని టార్గెట్ చేస్తాడు. అసలు గౌతమ్ ఇదంతా నందు కోసమే చేస్తున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉంటుందా అన్నది సస్పెన్స్. మరి చివరకు ప్రేమించిన నందు ను పప్పీకి దక్కకుండా గౌతమ్ ఏం చేస్తాడు? అన్నదే కథ..

ఫ్లస్ పాయింట్లు:

‘షేర్’ అనే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ కళ్యాణ్ రామ్ చేసిన పెర్ఫార్మన్స్. సినిమా మొదట నుంచి చివరి దాకా వన్ మాన్ ఆర్మీలా కళ్యాణ్ రామ్ తన భుజాల మీద నడిపించాడు. గౌతమ్ అనే పాత్రలో చాలా బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్ లో లవర్ బాయ్ గా కూడా కనిపించి యవతను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బాగా రిస్క్ తీసుకొని ట్రై చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. సింప్లీ చెప్పాలంటే షేర్ అనేది కళ్యాణ్ రామ్ వన్ మాన్ షో మీద నడిచే సినిమా.. ఇక గ్లామర్ డాల్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ ఈ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్. అలాగే సోనాల్ కి ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తూనే అల్ట్రా మోడ్రన్ లుక్ లో ఫుల్ గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది.

సినిమా మొదటి 20 నిమిషాలు చాలా బాగుంటుంది. కళ్యాణ్ రామ్ పై వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ బాగుంది. అలాగే సెకండాఫ్ చివరి 30 నిమిషాలలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. హైవేపై షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. 30 ఇయర్స్ పృధ్వీ చెప్పిన పంచ్ డైలాగ్స్ కొన్ని బాగానే పేలాయి. మిగిలిన నటీనటుల్లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ పరంగా రావు రమేష్, రోహిణిలు ఎమోషనల్ గా మంచి ఫీల్ ని తెచ్చారు. సినిమాని రెండు గంటల్లోపే ముగించేయడం కూడా సినిమాకి కాస్త హెల్ప్ అవుతుంది.

మైనస్ పాయింట్లు :

ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. సినిమా కథ.. ఇది చాలా పాత కథ. ఒక్క మాటలో చెప్పాలి అంటే నెలలో ఒకసారి అయినా ఇలాంటి కథని మనం చూస్తూనే ఉంటాం. అంత రొటీన్ కథ. దానిని కథనంలో మేనేజ్ చేస్తూ ఎంటర్టైనింగ్ గా చెప్పాలి అనుకున్నాడు డైరెక్టర్ మల్లికార్జున్. అనుకున్న దాని ప్రకారమే ట్విస్ట్ ని లాస్ట్ కి పెట్టుకొని ఆసక్తిని క్రియేట్ చేసాడు కానీ జరిగిన తప్పు ఏంటి అంటే తను ఎంటర్టైన్మెంట్ కోసం రాసుకున్న బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ ఎపిసోడ్స్ అంతగా పేలలేదు. అందువలన ఈ ఎపిసోడ్స్ సినిమాని స్లో చేసేయ్యడమే కాకుండా బోరింగ్ గా కూడా మారుస్తుంది. కథనం లో మిస్టేక్స్ ఉండడమే కాకుండా నేరేషన్ అనేది స్పీడ్ గా లేకపోవడం మరో మేజర్ మైనస్.

ఇంటర్వల్ ని ఆసక్తికరంగా ముగించినా సెకండాఫ్ ని మాత్రం చాలా స్లోగా స్టార్ చేసారు. అంతే కాకుద్నా ఢీ, రెడీ సినిమాల ఫార్మాట్ లో ఒక 20 నిమిషాలు కథని నడిపించడం సినిమాకి మైనస్. ఇక మెయిన్ విలన్స్ గా చూపిన విక్రంజీత్, ముఖేష్ రుషిలను కమెడియన్ లుగా చూపాడే తప్ప సీరియస్ గా చూపలేదు. దీంతో హీరోయిజం అంతగా పండలేదు. దానికి తోడు ఆశిష్ విద్యార్థి, షఫీ, పోసాని లాంటి ఎక్స్ట్రా విలన్స్ ఉన్నా పెద్ద ఉపయోగం లేకపోయింది. వీటితో పాటు పాటలని చాలా బాగా షూట్ చేసారు, కానీ ఆ రెండు పాటలు సందర్భం లేకుండా రావడం వలన సినిమాని సాగదీసినట్టు ఉంటుంది.

ఇక షేర్ సినిమాకి కర్త కర్మ క్రియ అయిన డైరెక్టర్ మల్లికార్జున్ విషయానికి వస్తే.. కథ – చాలా రెగ్యులర్ స్టొరీ లైన్.. కానీ దాని చుట్టూ అల్లుకున్న పూర్తి కథని కంప్లీట్ ఎంటర్టైనర్ గా రాసుకోలేకపోవడం సినిమాకి కాస్త మైనస్. కథనం లో ట్విస్ట్ లు లేవు కానీ రన్ టైం తక్కవ అవ్వడం వలన, కాస్త బెటర్ ఫీలింగ్ వస్తుంది. కథనం విషయంలో ఇంకా చాలా కేర్ తీసుకోవాల్సింది.

చివరగా :

‘పటాస్’ లాంటి సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన ‘షేర్’ అనే సినిమా ఆ స్థాయిలో మెప్పించలేకపోయినా పరవాలేధనిపించుకుంది. కళ్యాణ్ రామ్ వన్ మాన్ ఆర్మీ పెర్ఫార్మన్స్ వలన ఈ సినిమాలో చాలా అంశాలు మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. సినిమా స్టార్టింగ్ మరియు సినిమా ముగింపు చాలా బాగుంటుంది. మధ్యలో అనుకున్నంతా ఎంటర్టైన్మెంట్ అందించలేకపోవటం పెద్ద మైనస్.

చివరగా... సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి చూడచ్చు. షేర్ పెద్దగా గర్జించలేదు. ఆర్భాటాలు లేని సాదాసీదా షేర్.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు