సైజ్ జీరో

November 27, 2015 | 04:57 PM | 0 Views
Rating :
సైజ్ జీరో

నటీనటులు : ఆర్య, అనుష్క శెట్టి, సోనాల్ చౌహాన్, గొల్లపూడి మారుతిరావు, ఊర్వశి, ప్రకాశ్ రాజ్, మాస్టర్ భరత్ తదితరులు

సాంకేతిక వర్గం :

కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: ఆనంద్ సాయి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, సంగీతం: .యం.కీరవాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

ఈ సంవత్సరం బాహుబలి, రుద్రమదేవి అనే రెండు పీరియడ్ ఫిల్మ్స్  ప్రేక్షకులను అలరించింది లేడీ సూపర్ స్టార్ అనుష్క. ఇక కాస్త డిఫరెంట్ గా ఆలోచించి భారీగా బరువు పెరిగి తీసిన చిత్రం సైజ్ జీరో. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పీవీపీ వంటి భారీ నిర్మాత సంస్థ నుంచి రాబోతుంది. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్షన్ లో ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్ర సంగతేంటో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

ముద్దుగా బొద్దుగా ఉండే స్వీటీ అలియాస్ సౌందర్య(అనుష్క) లావుగా ఉండడం వలన పెళ్లి సంబందాలు సరిగా రావు వచ్చినా తన సైజ్ ని చూసి రిజెక్ట్ చేస్తుంటారు. కానీ అనుష్క మాత్రం తనకోసమూ ఓ రాజకుమారుడు వస్తాడని అంటుంటుంది. అలాగే అభి(ఆర్య) స్వీటీని పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తాడు. కానీ స్వీటీ అభిని రిజెక్ట్ చేస్తుంది. కానీ పరిచయం ఉన్న ఫ్యామిలీస్ కావడం వలన స్వీటీ అభి ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ గా ఉన్న టైంలో స్వీటీ అభిని ప్రేమించడం మొదలు పెడుతుంది. అభి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. అభి చేస్తున్న డాక్యుమెంటరీ నచ్చి ఎన్జీవోలో పనిచేసే సిమ్రాన్(సోనాల్ చౌహాన్) అభితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతుంది. ఈ జర్నీలో అభి  సిమ్రాన్ లు ప్రేమలో పడతారు. దాంతో స్వీటీ వారికి దూరంగా వెళ్తుంది. అలాగే తక్కువ టైంలో సన్నగా అవ్వాలని సత్యానంద్(ప్రకాష్ రాజ్) సైజ్ జీరో ట్రైనింగ్ క్లాస్ లో చేరుతుంది. అక్కడే స్వీటీకి సత్యానంద్ చేస్తున్న మోసాల గురించి తెలుస్తుంది. దాంతో సైజ్ జీరో సత్యానంద్ పై యుద్ధం చేయడానికి సిద్దమవుతుంది. ఆ విషయంలో స్వీటీకి అభి, సిమ్రాన్ లు కూడా సపోర్ట్ చేస్తారు. సత్యానంద్ ని ఎలా ఎదిరించింది? సత్యానంద్ మోసాలను ఎలా బయటపెట్టింది? చివరికి స్వీటీ సన్నబడిందా లేదా? అలాగే ఎవరిని పెళ్లి చేసుకుంది? అది కథ.

ఫ్లస్ పాయింట్లు:

గ్లామర్ ఫీల్డ్ లో ఓ సినిమా కోసం ఒక్కసారిగా 20 కేజీల బరువు పెరిగి ఓ సినిమా చేయడం అనేది చాలా గ్రేట్, అందుకే ఈ విషయంలో అనుష్కకి ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. సైజ్ సీరో సినిమాని మొదలు పెట్టిన విధానం, అక్కడి నుంచి సినిమాని టేకాఫ్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే మొదటి నుంచి ఇంటర్వల్ వరకూ అనుష్క పాత్రతో ప్రేక్షకుల పెదవులపైన చిరునవ్వుని ఒకే లెవల్లో ఉండేలా చేస్తూ రావడంసినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచిన అనుష్క విషయానికి వస్తే.. స్వీటీ పాత్రలో అనుష్క నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇప్పటి వరకూ అనుష్క చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే ఇదొక్కటే ఒక ఎత్తుగా చెప్పాలి. మొదటిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ మరియి ఎమోషనల్ టచ్ ఉన్న పాత్ర చేసింది. ఎమోషనల్ చేయడం ఓకే కానీ కామెడీ చేయడం అంత ఈజీ కాదు. కానీ అనుష్క మాత్రం ఫస్ట్ హాఫ్ లో తన హావ భావాలతో బాగా నవ్వించింది.

మెయిన్ రోల్ చేసిన ఆర్య అనుష్కకి మంచి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సోనాల్ చౌహాన్ చేసింది కూడా సినిమాకి అవసరం ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచింది. సోనాల్ నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరి తర్వాత ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, ప్రకాష్ రాజ్, గొల్లపూడి మారుతి రావు, అడవి శేష్,మాస్టర్ భరత్ లు వారి వారి పాత్రలకి నయం చేసారు. చివరగా ఒక మెయిన్ స్టేజ్ లో నాగార్జున, రానా, బాబీ సింహా, జీవ, తమన్నా, హన్సిక, శ్రీ దివ్య, మంచు లక్ష్మీలు చేసిన అతిధి పాత్రలు సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... లావుగా ఉన్న అనుష్కని నిరవ్ షాహ్ చూపిన విధానం సింప్లీ సూపర్బ్. అనుష్క అంత బొద్దుగా ఉన్న ఎక్కడా ఎబ్బెట్టుగా కనిపించదు. అలాగే సినిమాలో విజువల్స్ అన్నీ చాలా కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండడమే కాకుండా సినిమాలోని కంటెంట్ మూడ్ కి సింక్ అయ్యేలా ఉన్నాయి. ఈ విజువల్స్ కి సౌండింగ్ తో ప్రాణం పోసాడు ఎంఎం కీరవాణి. పాటలన్నీ బాగున్నాయి, అలాగే అవి చూడటానికి ఇంకా బాగున్నాయి. వీటికంటే మించి ఆయన ఇచ్చిన రీ రికార్డింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ అయితే చాలా కూల్ అండ్ ప్లెజంట్ ఫీల్ ని తెప్పిస్తాయి.

మైనస్ పాయింట్లు :

ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది సెకండాఫ్.. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో అనుష్క పాత్రని బాగా డెవలప్ చేసి చూపించేసాడు.. దాంతో సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ లేకుండా పోయింది. అందుకే సెకండాఫ్ మొత్తాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అనే ఫీలింగ్ కలుగుతుంది.వీటితో పాటు సినిమా నేరేషన్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఆ స్లోనెస్ తెలియకపోయినా సెకండాఫ్ లో మాత్రం బాగా తెలిసిపోతుంది.కథ – కథనం అందించింది కనిక కోవెలమూడి. కనిక రియల్ లైఫ్ లో సఫర్ అవుతున్న ఓ పాత్రని చూసి అనుష్క పాత్రని డిజైన్ చేయడం బాగుంది. కానీ పూర్తి కథా విస్తరణని చాలా రెగ్యులర్ గా రాసుకోవడం, సెకండాఫ్ ని ట్రాక్ తప్పేలా రాసుకున్నారు.

చివరగా :

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క చేసిన ‘సైజ్ జీరో’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే క్లాస్ సినిమాగా నిలిచిపోతుంది.ఫస్ట్ హాఫ్ పరంగా ఎంటర్టైన్ అయ్యి సెకండాఫ్ లో కొన్ని ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యి ఓవరాల్ గా డీసెంట్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు.

చివరగా... లిప్ లాక్ లను పక్కనబెడితే,  వీకెండ్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయొచ్చు.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు