సన్నాఫ్ సత్యమూర్తి

April 09, 2015 | 04:17 PM | 73 Views
Rating :
సన్నాఫ్ సత్యమూర్తి

నటీనటులు : అల్లుఅర్జున్‌, ప్రకాశ్ రాజ్, ఉపేంద్ర‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావుర‌మేష్‌, కోట‌శ్రీనివాస‌రావు, , స‌మంత‌, నిత్యామీన‌న్‌, ఆదాశ‌ర్మ‌ త‌దిత‌రులు

సాంకేతిక వర్గం :

ఎడిటింగ్‌-ప్ర‌వీణ్ పూడి, సినిమాటోగ్రఫీ- ప్ర‌సాద్ మూరెళ్ల‌, సంగీతం-దేవిశ్రీ ప్ర‌సాద్‌, బ్యాన‌ర్‌-హారిక హాసిని క్రియేష‌న్స్ నిర్మాత‌- ఎస్‌.రాధాకృష్ణ‌, ద‌ర్శ‌కత్వం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌

రేసుగుర్రం వంటి సక్సెస్ తర్వాత అల్లుఅర్జున్, అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అదీగాక ఇదే జోడి గతంలో జులాయి వంటి సూపర్ హిట్ మూవీ చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఏ మేర అందుకుందో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే...

కథ :

విరాజ్ ఆనంద్(అల్లుఅర్జున్)కి అతని తండ్రి సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) 300 కోట్ల రూపాయల ఆస్థితో పాటు మనిషిని గౌరవించాలని, మనిషి ప్రాణం చాలా విలువైనదనే చాలా విలువలను నేర్పుతాడు. తనకి పల్లవి(ఆదాశర్మ)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అయితే అనుకోకుండా సత్యమూర్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అప్పులవాళ్లు వస్తారు. అప్పుడు నాన్న స్నేహితుడైన సాంబశివరావు(రాజేంద్రప్రసాద్) అప్పులన్నీ ఎగ్గొట్టి ఐ.పి. పెట్టమని సలహా ఇస్తాడు. కానీ నాన్న చనిపోయిన తర్వాత అందరి దృష్టిలో చెడ్డవాడు కాకూడని ఆస్థినంతా పంచేస్తాడు. కుటుంబం రోడ్డున పడుతుంది. విరాజ్ కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తాడు. అందుకోసం అనుకోని పరిస్థితుల్లో వెడ్డింగ్ ప్లానర్ గా మారుతాడు. అక్కడే తనతో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్న పల్లవికి మరొకరితో పెళ్లి జరుగుతుంటుంది. ఆ పెళ్లిలోనే విరాజ్ కి సమీర అలియాస్ సుబ్బలక్ష్మి పరిచయం అవుతుంది. విరాజ్ మంచితనం తెలుసుకున్న తను విరాజ్ ను ప్రేమిస్తుంది. అయితే సమీర సాంబశివరావు కుమార్తె అని తర్వాత తెలియడంతో పాటు తన తండ్రి సాంబశివరావుకి అమ్మిన పదికోట్ల స్థలాన్ని దేవరాజ్ నాయుడు(ఉపేంద్ర) ఆక్రమించుకున్నాడని, ఆ పత్రాలు ఇప్పుడు తనకు తెచ్చి పెడితే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని సాంబశివరావు కండిషన్ పెడతాడు. తన తండ్రి కోసం రెడ్డి వారి పట్టికి వెళతాడు విరాజ్ ఆనంద్. అక్కడ వెళ్లిన విరాజ్ కొన్ని పరిస్థితుల రీత్యా దేవరాజ్ ను హత్యా ప్రయత్నం నుండి కాపాడుతాడు. దాంతో దేవరాజ్ తను చెల్లెలు సెల్వి(నిత్యామీనన్) విరాజ్ కిచ్చి పెళ్లి చేస్తానంటాడు. మరి అప్పుడు విరాజ్ ఏం చేస్తాడు? సెల్లిని పెళ్లి చేసుకుంటాడా? తన తండ్రి వల్ల నష్టం ఏర్పడిందన్న సాంబశివరావుకి ఏ విధంగా న్యాయం చేస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

అల్లుఅర్జున్ యాజ్ యూజువల్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు. తన ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ తో సినిమాని ఆసాంతం ముందుకు నడిపాడు. సమంత గ్లామర్ కే పరిమితం అయింది. నిత్యామీనన్ సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చినా చక్కని అభినయాన్ని కనపరిచింది. ఆదాశర్మ రోల్ పరిమితం తన పాత్ర మేర ఆమె కూడా న్యాయం చేసింది. రాజేంద్రప్రసాద్ నటన గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడనక్కర్లేదు. సాంబశివరావు పాత్రలో జీవించేశాడు. కొన్ని చోట్ల మనుషులు ఇలా ఉంటారా అనే విధంగా చక్కగా నటించాడు. ఉపేంద్ర రోల్ కూడా సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చినా సెకండాఫ్ లో బన్నితో సమానంగా ఉపేంద్ర రోల్ ఉండటం, దాన్ని ఉపేంద్ర సమర్ధంగా పోషించడంతో సినిమాకి బలం చేకూరింది. దేవిశ్రీ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. ఇక త్రివిక్రమ్ నాన్న ప్రేమ అనే పాయింట్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. దానికి తోడు త్రివిక్రమ్ పెన్ పవర్ జోడైంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్లు :

ఫస్టాఫ్ అంతా స్లోగా నడుస్తుంది. కుటుంబం కష్టాల పాలైనప్పుడు హీరో బాధ్యతలు తీసుకోవడం అనే చిన్న పాయింట్ ను డైరెక్టర్ ఫస్టాఫ్ అంతా సాగదీశాడు. త్రివిక్రమ్ ఫస్టాఫ్ మీద కాన్ సన్ ట్రేషన్ చేసుంటే బావుండేదనిపించింది. సినిమాలో అసలు కథంతా సెకండాఫ్ లోనే ఉండటంతో ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకుడు ఏదో వెలితిగా ఫీలవుతాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో సెంటిమెంట్ డోస్ ఎక్కువైనట్లు అనిపించింది. ఉపేంద్రను హీరో కాపాడే సందర్భంలో వచ్చే ఫైట్ అనవసరం, ఆదాశర్మ రోల్ ను ఓ సందర్బంలో తక్కువ చేసి చూపడం వంటి అన్నంలో రాళ్లులా కరుకుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించి ఉంటే బావుండేది. ఓ పది నిమిషాల సినిమాని తగ్గించి ఉండవచ్చు.

చివరగా :

త్రివిక్రమ్ దర్శకత్వం కంటే పెన్ జోరు సినిమా ఆసాంతం కనపడుతుంది. కథనం మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. అయితే దేవిశ్రీ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకి వెన్నెముకలా నిలిచాయి. ఫస్టాఫ్ స్లోగా ఉన్నప్పటికీ సెకండాఫ్ ఫాస్ట్ గా మూవ్ కావడం, బ్రహ్మానందం కామెడి సినిమాలో వేగాన్ని పెంచినా సెకండాఫ్ శ్రీనువైట్ల సినిమా చూసిన భావన కలుగుతుంది.

చివరగా... ఏదేమైనా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావాలనుకునేవారికి సన్నాఫ్ సత్యమూర్తి మంచి ఎంటర్ టైనర్ అవుతుంది.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు