సౌఖ్యం

December 24, 2015 | 04:10 PM | 0 Views
Rating :
సౌఖ్యం

నటీనటులు : గోపీచంద్‌, రెజీనా , షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్రకాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్యకృష్ణ , స‌త్యం రాజేష్ తదితరులు...

సాంకేతిక వర్గం :

క‌థ‌, మాట‌లు: శ్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, బ్యానర్ : భవ్య క్రియేషన్స్, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్రసాద్‌. దర్శకత్వం: ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి

తన గత రెండు చిత్రాలతో(లౌక్యం, జిల్) డీసెంట్ హిట్స్ అందుకున్న హీరో గోపీచంద్ మరోసారి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సౌఖ్యం’తో మన ముందుకు వచ్చాడు. గోపికి ఫస్ట్ కమర్షియల్ హిట్ యజ్ఞం అందించిన కెఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ దీనికి దర్శకుడు. డస్కీ బ్యూటీ రెజీన హీరోయిన్ గా, కామెడీని హైలైట్ చేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ గా ఇది తెరకెక్కినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. క్రిస్మస్ కి ఒకరోజు ముందుగా (డిసెంబర్ 24న) గురువారం ఈ చిత్రం విడుదలైంది. మరీ సౌఖ్యం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో చూద్దాం...

కథ :

విలువలు పాటించే ఓ రిచ్ ఫ్యామిలీ కుర్రాడు శ్రీనివాస్ (గోపీచంద్). పనిలేకుండా ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగే మన హీరో ఓ ట్రైన్ జర్నీలో శైలజ(రెజీనా)ని చూసి లవ్ లో పడతాడు. వెంటనే వెళ్లి ప్రపోజ్ చేస్తాడు, కానీ అందుకు ఆమె ఓ కండిషన్ పెడుతుంది. ఆపై ఫైనల్ గా ఓ రోజు ఒప్పేసుకుంటుంది. ఆటైంలోనే ఓ గ్యాంగ్ కిడ్నాప్ మన హీరోయిన్ ను ఎత్తుకెళ్లుతుంది. అయితే శ్రీను ఫాదర్ కృష్ణారావు(ముఖేష్ రుషి) కోరిక మేరకు శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. ఇదే టైంలో భావూజీ(ప్రదీప్ రావత్) కొడుకును కొట్టాడన్న కోపంతో అతని మనుషులు శీనును చంపాలనుకుంటారు. హీరో కదా అది కుదరదు. దాంతో భావూజీ తెలివిగా దెబ్బ కొట్టాలని ఓ ప్లాన్ వేసి కోల్ కత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్(దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని చెప్తాడు. తన కోసం కాకపోయినా ఫ్యామిలీ ప్రాణాల కోసం శ్రీను అక్కడికి వెళ్తాడు. అక్కడే అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అక్కడి నుంచి కథ ఎలా జరిగింది? ఫైనల్ గా శ్రీను ఇవన్నీ దాటుకొని ఎలా తన ఫ్యామిలీని, శైలజ ప్రేమని కాపాడుకున్నాడు కథ.

ఫ్లస్ పాయింట్లు:

గోపీచంద్ తన నటనతో మరోసారి ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. జోవియల్ కుర్రాడి పాత్రలో ఓవైపు, ఫ్యామిలీ కోసం తాపత్రయపడే కుర్రాడిగా ఎమోషన్స్ ను బాగానే పండించాడు. లుక్ పరంగా కూడా స్టైలిష్ గా కనిపించాడు. ఇక రెజీనా తన గ్లామర్ డోస్ తో బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ధర్శకుడు ఆమెతో చేయించిన కామెడీ బాగా కుదిరింది. ఇక మిగతావారిలో  అందరూ అలా వచ్చి ఇలా కొద్దిసేపు కనిపించి వెళ్ళీపొయేవారే కాబట్టి కనిపించిన కొద్దిసేపు అలరించే ప్రయత్నం తమ పరిధి మేరకు బాగానే చేశారు . సప్తగిరి, పృధ్వి, పోసాని, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం ఎప్పటిలాగే చేశారు .

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... ప్రముఖంగా చెప్పుకోదగింది ప్రసాద్ మురేళ్ళ సినిమాటోగ్రఫీ గురించి.. ప్రతి ఫ్రేం చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా ఉండేలా ఆయన తీసుకున్న కేర్ ప్లస్ అయ్యింది. అలాగే నటీనటుల్ని ప్రజంట్ చేసిన తీరు కూడా బాగుంది. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్లు :

శ్రీధర్ సిపాన ఒక కథంటూ లేకుండా 2-3 లైన్స్ అనుకొని వాటిని కలిపి కథగా మార్చే ప్రయత్నం చేశాడు. బహుశా గురువులు కోన వెంకట్ గోపీ మోహన్ ఇన్సిపిరేషన్ మూలానా ఏమో గత చిత్రాల మాదిరిగానే ఇదీ ఉంటుంది.  ఒక సీన్ తర్వాత మరో సీన్ వచ్చేలా చూశారు తప్ప, కనీసం ఆ సీన్స్ మధ్య సంబంధం ఉందా లేదా అని కూడ చూసుకోలేదు. ఫలితంగా సినిమా అంతా అతుకుల బొంతలా ఉంటుంది తప్ప ఒక ఫ్లోలో ఉండదు. అనూప్ రూబెన్స్ సంగీతంలో అటు పాటల్లో గానీ, ఇటు నేపధ్య సంగీతంలో కానీ ఎలాంటి ప్రత్యేకత కనిపించదు . ఈ సినిమా కు గౌతంరాజు లాంటి సీనియర్ ఎడిటర్ పనిచేసింది అన్న అనుమానాలు కలుగుతాయి. అంత దారుణంగా ఉంది ఎడిటింగ్.

సినిమాలో కొన్ని సీన్స్ నవ్వు పుట్టించినా సినిమా కథ పరంగా,  కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ ఏ మాత్రం పేలలేదు. అలాంటివి జోకులుగా నవ్వుకోవటానికి పనికివస్తాయి గానీ సినిమాకు పనికి రావు. కామెడీ సీన్లు ఉంటే చాలు కథ లేకపోయినా పర్వాలేదు అనుకొని తీసారా అనిపిస్తుంది తప్ప ఓ సినిమా లా అనిపించదు. మంచి ఎంటర్ టైనర్ ని అందించటంలో రవికుమార్ చౌదరి దారుణంగా విఫలమయ్యాడు. తన గత చిత్రంలో( పిల్లా నువ్వులేని జీవితంలో) మంచి కాన్సెప్ట్ ను అందించిన రవికుమార్ ఇక్కడ మాత్రం ఫెలయ్యాడు.

చివరగా :

గోపీచంద్ లౌక్యం సౌఖ్యం రెండు దాదాపు ఒక కాన్సెప్ట్ లే. కానీ, లౌక్యంలో కామెడీ వర్కవుటయ్యింది. ఇక్కడ మాత్రం పండలేదు. కేవలం కామెడీ సీన్లనే పేర్చుకుంటూ సినిమా తీసేసిన దర్శకుడు ప్రేక్షకుల అంచనాలను అస్సలు అందుకోలేకపోయాడు. పైగా స్పూఫ్ లతో అనవసరమైన తలనొప్పి తెప్పిస్తాడు. మూస కథలకు కామెడీ అనే టచ్ అప్ ఇవ్వటంతో హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ, సౌఖ్యం ఆ జాబితాలోకి రాలేదన్నది మాత్రం ఖాయం.

చిరవగా.... సౌఖ్యం పరమ బోరింగ్. అవుట్ డేటెడ్ రోటీన్ ప్లేవర్ స్టోరీ. భరించటం కష్టమే.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు