సూపర్ స్టార్ కిడ్నాప్

July 04, 2015 | 12:58 PM | 12 Views
Rating :
సూపర్ స్టార్ కిడ్నాప్

నటీనటులు : నందు, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రద్ధ దాస్, భూపాల్, పూనం కౌర్ తదితరులు

సాంకేతిక వర్గం :

సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత : చందు, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

యువ నటులు నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ సూపర్ స్టార్ కిడ్నాప్. నటి శ్రద్ధ దాస్ లేడీ డాన్ పాత్రలో కనిపించగా,  పూనమ్ కౌర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. నూతన దర్శకుడు సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చందు నిర్మాత. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుని కిడ్నాప్ చెయ్యడం కోసం ఓ ముగ్గురు స్నేహితులు కలిసి చేసే ప్రయత్నమే ఈ సినిమా. మరి ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుందనేది రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ :

అనుకోకుండా ఓ సందర్భంలో కలిసిన ఓ ముగ్గురి యువకుల కథే ఇది. మొదటి వాడు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకు జై(ఆదర్ష్ బాలకృష్ణ). చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో డ్రగ్స్ కి అలవాటుపడతాడు. రెండో వాడు నందు (నందు) ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసి పోవటంతో ఎలాగైనా మళ్లీ తనని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక మూడో వాడు  భూపాల్ (భూపాల్) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చూసి డైరెక్టర్ ఆవుదాం ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అనుకోకుండా ఓ సమస్యలో ఈ ముగ్గరు ఇరుక్కుంటారు. దాని నుండి బయటపడాలి అంటే వీరికి డబ్బు కావాలి. ఇక దానికోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. అదేంటీ, మహేష్ బాబు మనోళ్ల వలలో పడతాడా? వారికి ఎదురైన సమస్యలేంటి అన్నదే కథ. 

ఫ్లస్ పాయింట్లు:

సినిమా స్టార్టవ్వటమే బిజినెస్ మేన్ చిత్రంలోని ‘నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ 11థ్ మైల్’ అని చూపించటం ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పేరును చిత్రానికి పెట్టుకోవటం ఒక ఎత్తయితే, అందులో ఏకంగా మహేష్ బాబునే కిడ్నాప్ చెయ్యాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం కావటంతో ఈ చిత్రానికి పెద్ద ఫ్లస్ పాయింట్. అంతేకాదు ఈ చిత్రంలో హీరోలైన మంచు మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ చేసిన అతిథి పాత్రలు చిత్రానికి పెద్ద బూస్టులా పనిచేశాయి. అంతేకాదు చిత్రంలోని క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ కూడా కాస్త కొత్త ఆకట్టుకునేలా ఉంటుంది. నటీనటుల విషయానికొస్తే... నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ లు మంచి నటనని కనబరిచారు. ఓ లవర్ బాయ్ గా నందు మంచి నటనని కనబరిచాడు. ఓ టాప్ సినీ నిర్మాత కొడుకుగా, డ్రగ్ అడిక్ట్ పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ బాగా నటించాడు. ముఖ్యంగా ఆ పాత్రకి కావాల్సిన మానరిజమ్స్ ని బాగా చూపించాడు. భూపాల్ తెలంగాణ కుర్రాడిగా, తెలంగాణా స్లాంగ్ లో అక్కడక్కడా నవ్వించాడు. ఓవరాల్ గా ఈ ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేసారు. రేయ్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించిన శ్రద్ధ దాస్ ఇందులో లేడీ డాన్ గా బాగా సెట్ అయ్యింది. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ ఉన్నంతసేపూ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. పూనం కౌర్ ఓ పాట మరియు కొన్ని సీన్స్ లో టోటల్ మోడ్రన్ లుక్ లో అందాలను ఆరబోసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్లు :

ఈ మధ్య ఇదే జోనర్ల చిత్రాలు అధికం కావటం ఈ చిత్రానికి పెద్ద మైనస్. దర్శకుడు సుశాంత్ రెడ్డి తొలి సినిమా కోసం కూడా రొటీన్ అయిన క్రైమ్ కామెడీని సెలక్ట్ చేసుకుని అదే తప్పు చేశాడు. సో... కథ పరంగా పెద్దదా కిక్ ఏమీ ఉండదు. కథనం విషయంలో కూడా ఇంకా కాస్త కేర్ తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా సెకండాఫ్ బోర్ కొట్టిస్తుంది. మధ్యలో ఒక చేజ్ ఎపిసోడ్ ని షూట్ చేయకుండా యానిమేషన్ లో ట్రై చెయ్యటం మరీ సోదీలా అనిపిస్తుంది. నేరేషన్ స్లో అవ్వడం వలన సెకండాఫ్ మరింత ఊహాజనితంగా మారి అందరికీ బోర్ కొడుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ని సరిగా రాసుకోలేదు. కామెడీ కోరుకునే కామన్ ఆడియన్స్ కి ఆ ఎలిమెంట్ ను మిస్సయ్యేలా చేశాడు దర్శకుడు. టెక్నికల్ పరంగా సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ తప్ప పాటలతో ఏం ఆకట్టుకోలేదు.

చివరగా :

టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ హిట్ ఫార్మాట్ గా ప్రూవ్ చేసుకున్న సస్పెన్స్, క్రైమ్ కామెడీ ఫార్మాట్ లో వచ్చిన సూపర్ స్టార్ కిడ్నాప్ కూడా ప్రేక్షకుల చేత పరవాలేదనిపించుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పేరునే కాకుండా, తనని కిడ్నాప్ చెయ్యడమే ఇతివృత్తంగా ఈ సినిమా నడవడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. డైరెక్టర్ రొటీన్ కథకి కొత్త నేపధ్యాన్ని జోడించినా అనుకున్న స్థాయిలో దానిని చూపించకపోవటంతో సినిమా రేంజ్ కాస్త తగ్గింది. అలాగే ప్రమోషన్ లో ఈ చిత్రం ఎక్కువగా హడావుడి చూపకపోవటంతో జనాలకు రీచ్ అయ్యే ఛాన్స్ లు తక్కువ.

చివరగా... రోటీన్ గా సాగే కిడ్నాపే. కొత్తదనం కొరుకుంటే కష్టమే. ఫస్టాఫ్ కోసం ట్రై చెయ్యోచ్చు. సెకాండాఫ్ మీ ఓపిక.



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు