రాక్షసుడు

May 29, 2015 | 04:08 PM | 5 Views
Rating :
రాక్షసుడు

నటీనటులు : సూర్య, నయనతార, ప్రణీత, ప్రేమ్ జీ అమరన్, సముద్రఖని, పార్తీబన్ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్-  మేథ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్(సహా సమర్పణ), ఎడిటర్- ప్రవీణ్ కె.ఎల్.  సినిమాటోగ్రఫీ- ఆర్.డి.రాజశేఖర్, సంగీతం- యువన్ శంకర్ రాజా, నిర్మాత- మిర్యాల కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, దర్శకత్వం- వెంకట్ ప్రభు

సూర్య అంటే కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తాడని తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తారు. అందుకే హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే సూర్య గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడనే చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో థ్రిల్లర్ సినిమాలను రూపొందించే వెంకట్ ప్రభుతో చేతులు కలిపి రాక్షసుడు సినిమా చేశాడు. చిరంజీవి హిట్ సినిమా టైటిల్ తో ఈసారి ప్రేక్షకులను పలకరిచింన సూర్య ఏ మేర ఆకట్టుకుంటున్నాడో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...

 

కథ :

మధుసూదన్(సూర్య) అలియాస్ మాస్ తన స్నేహితుడు జెట్(ప్రేమ్ జీ అమరన్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేసి కాలం గడుపుతుంటాడు. ఓ సందర్భంలో మాలిని(నయనతార)ని చూసి ప్రేమిస్తాడు. మాలినికి అవసరమైన డబ్బును ఇవ్వడానికి మధు చేసే దొంగతనంలో అతనికి సమస్య ఎదురవుతుంది. అనుకోకుండా జరిగే ప్రమాదంలో చచ్చి బ్రతికిపోతాడు. అయితే ఈ ప్రమాదం వల్ల అతనికి ఆత్మలను చూసే శక్తి వస్తుంది. దాంతో ఆత్మలన్నీ మధుసూదన్ ను వాటి కోరికలు తీర్చమని వెంటపడుతుంటాయి. కానీ అతను వాటిని తన స్వార్ధానికి వాడుకుంటుంటాడు. అలాంటి సందర్భంలో అచ్చం తనలాగే ఉండే శివ ఆత్మ ఎంట్రీతో అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. శివ ఆత్మ చెప్పినట్లు చేయడంతో మధుకి అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. అవేంటి? వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు? అసలు శివకుమార్ ఎవరు? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ఫ్లస్ పాయింట్లు:

సూర్య నటన సినిమా మెయిన్ ప్లస్ పాయింట్. మాస్, శివకుమార్ పాత్రల్లో సూర్య మంచి వేరియేషన్ చూపిస్తూ నటించాడు. ‘మాస్’ క్యారెక్టర్ లకు పెట్టింది పేరైన సూర్య మరోవైపు శివకుమార్ పాత్రలో మంచి ఫెర్ ఫార్మెన్స్ చేశాడు. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఢిపరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కించే వెంకట్ ప్రభు. మరోసారి తన సిక్సర్ ని డిఫరెంట్ జోనర్ తో ముందుకు వచ్చాడు. నయనతార, ప్రణీత పాత్రలు పరిమితం. అక్కడక్కడా మెరిశారు. వారి పాత్రలకు న్యాయం చేశారు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ హైలైట్. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా చూపించాడు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.

మైనస్ పాయింట్లు :

వెంకట్ ప్రభు ఒక మంచి పాయింట్ ను అనుకున్నప్పటికీ దాన్ని సినిమాగా తెరకెక్కించే విషయంలో ఫెయిలయ్యాడు. సినిమాలో ప్రేక్షకుడు తెలియని గందరగోళాని గురవుతాడు. హర్రర్ కామెడిలా కాకుండా టోటల్ గా రివేంజ్ ఫార్ములాతోనే సినిమా సాగుతుంది. యువన్ ట్యూన్స్ ఒకటి రెండు మినహా మిగతావన్నీ ఆకట్టుకోవు. ప్రవీణ్ ఎడిటింగ్ బాగాలేదు. సినిమా లాజిక్ లకు అందకుండా సాగడం పెద్ద మైనస్ పాయింట్. ఒకటి, రెండు కామెడి సన్నివేశాలు మినహా సినిమాలో కామెడి పెద్దగా నవ్వు తెప్పించదు. 

చివరగా :

డిఫరెంట్ జోనర్ లో సినిమాని తెరకెక్కించాలనే వెంకట్ ప్రభు ఆలోచన అబినందనీయం. అయితే సినిమాని పకడ్బందీ ప్లాన్ తో నడిపించకపోవడం సినిమాకి పెద్ద మైనస్. సినిమాలో లాజిక్స్ లేవు కనుక ప్రేక్షకుడికి ఏదో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. కామెడి ట్రాక్ సరిగా లేకపోవడం, సరైన  ట్యూన్స్ లేక పోవడం సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అయ్యాయి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, యువన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని అదనపు బలాలయ్యాయి. అయితే సూర్య లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా అనగానే వెంకట్ ప్రభు ఏదో తన స్టయిల్ లో మూవీ చేసుకుంటూ వెళ్లిపోయాడు కానీ కథ, కథనంపై శ్రద్ధ పెట్టి ఉంటే బావుండేది. ఇదే కాన్సెప్ట్ తో గతంలో తెలుగులో వారధి సినిమా కూడా వచ్చింది. సినిమాకి స్టార్స్ తో పాటు కథ కూడా అవసరమే అని విషయం ముఖ్యం. ఫ్యామిలీ, పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. 

 

చివరగా... సూర్య నటన కోసం, సమ్మర్ ఎండ్ లో కాస్త రిలీఫ్ ఇచ్చే సినిమా 



ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

Post Your Comment

కూడా చూడండి

leela 24
goldnsilver

తాజా వార్తలు