నటీనటులు : నవీన్ చంద్ర, స్వాతి, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు
సాంకేతిక వర్గం :
సినిమాటోగ్రఫీ: రవికుమార్ సనా, సంగీతం: కమ్రాన్ అహ్మద్, నిర్మాత : చిన్నబాబు అరిగెల, ఎమ్ రాజశేఖర్, స్క్రీన్ ప్లే: కోనవెంకట్, వెలిగొండ శ్రీనివాస్, దర్శకుడు : రాజ్ కిరణ్
తెలుగు ప్రేక్షకులు హర్రర్ జోనర్ లో వచ్చే చిత్రాలను భాషాబేధం లేకుండా ఎప్పటికప్పుడు ఆదరిస్తూ వస్తారు. దర్శకుడు రాజ్ కిరణ్ మొదటి చిత్రం గీతాంజలి కూడా ఇదే కోవలోకి వస్తుంది. దాని సూపర్ హిట్ చేసేశారు. ఇక అదే ఊపుతో త్రిపుర అంటూ మరో హర్రర్ చిత్రంతో మన ముందుకు వచ్చేశాడు. బబ్లీ గర్ల్ స్వాతి ఇందులో లీడ్ రోల్ చేసింది. మరి గీతాంజలికి పట్టం కట్టినట్టే దీనిని ఆదరించారా? లేక తిరస్కరించారా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ :
త్రిపుర (స్వాతి) అనే పల్లెటూరి అమ్మాయికి కలలో ఏదీ కనిపిస్తే అని నిజమవుతుందని నమ్ముతుంది. దీంతో ఆమె మానసిక స్థితి బాగా లేదని తండ్రి ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతనే మన హీరో డాక్టర్ నవీన్(నవీన్ చంద్ర). తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయిన నవీన్ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్లిచేసుకుని పట్నంకు మకాం మారుస్తాడు. అక్కడ ఓ ఇంట్లో కొత్త కాపురం పెడతారు. అయితే తన కలలో ఎవరైనా చనిపోతూ ఉండటం నిజమవుతుండటంతో త్రిపురకు రోజు రోజుకీ భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఓ రోజు కలలో భర్త నవీన్ హత్యకు గురైనట్లు, అదీ కూడా తన చేతిలోనే అయినట్లు కల కంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను అసలు త్రిపుర ఎందుకు చంపాలనుకుంటుంది. నవీన్ తన గతం గురించి త్రిపుర దగ్గర ఏదైనా దాస్తాడా? ఆ సస్పెన్స్ ఏంటీ అన్నదే కథ.
ఫ్లస్ పాయింట్లు:
ముందుగా లీడ్ రోల్ స్వాతి గురించి చెప్పుకోవాలి. గతంలో బబ్లీ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న స్వాతి ఈ చిత్రంలో పూర్తి డిఫరెంట్ పాత్రలో ఒదిగిపోయింది. పెళ్లయిన యువతిగా కనిపించేందుకు బరువు కూడా పెరిగింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక నవీన్ చంద్ర డాక్టర్ గా మెప్పించాడు. పాత్ర పరిధి మేర నటించాడు. స్వాతి తర్వాత చెప్పుకోదగిన పాత్ర అంటే రావు రమేష్. సస్పెన్స్ కు జత కలిసిన అతని డైలాగులు ఆసక్తిని రెకెత్తిస్తాయి. కామెడీ పరంగా సప్తగిరి ఆకట్టుకుంటాడు. హీరోయిన్ మేనమామ పాత్రలో ఉన్న కాసేపు అతని కామెడీనే హైలెట్. ఉన్న కాసేపు పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, షకలక శంకర్, పూజా రామచంద్రన్ అలరించారు.
టెక్నికల్ అంశాల విషయానికొస్తే... గీతాంజలి తర్వాత సేమ్ అదే జోనర్ అయినప్పటికీ కాస్త వేరే పద్ధతిలో ఆలోచించి త్రిపురను తెరకెక్కించాడు దర్శకుడు. డ్రామా, రొమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ను అదనంగా త్రిపురకు జోడించాడు.
మైనస్ పాయింట్లు :
సినిమాకు పెద్ద మైనస్ ఆసక్తికరమైన కథను సరిగ్గా మలచలేకపోవటం. మంచి కథ, ట్విస్ట్ లు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా తెరకెక్కించలేకపోయాడు దర్శకుడు రాజ్ కిరణ్. సంగీతం మరీ చెత్తగా ఉంది. అసలు పాటలు ఈ సినిమాకు అవసరం లేదనిపిస్తోంది. పోనీ హర్రర్ చిత్రం కదా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయినా కుదిరిందా అంటే అదీ లేదు. ఎడిటింగ్ మరీ దారుణంగా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. వెరసి త్రిపుర ప్రొడక్షన్ వాల్యూస్ లేని ఓ లో బడ్జెట్ చిత్రంగా నిలిచిపోయింది.
చివరగా :
త్రిపుర ప్రస్తుతం ఉన్న హర్రర్ జోనర్ ట్రెండ్ ను వాడుకోవటంలో దారుణంగా విఫలమయ్యింది. గీతాంజలి కంటే ఇందులో పాత్రలను పవర్ ఫుల్ గా రూపొందించినప్పటికీ వాటిని సరిగ్గా వాడుకోలేదనిపించింది. కలలు నిజం కావటం, భూతాల బంగ్లా, మర్డర్ మిస్టరీ లాంటి ఆసక్తికర అంశాలు ఉన్నా అవి స్క్రీన్ మీద సరిగ్గా పండలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే స్పీడ్ తగ్గినట్లు అనిపిస్తుంది. కామెడీ అంతగా కితకితలు పెట్టకపోగా, భయపెట్టించడం కూడా తక్కువే.
చివరగా... అవుట్ డేటెడ్ హర్రర్ కామెడీ. చూడటం, చూడకపోవటం మీఇష్టం.
ఇది కేవలం నీహర్ అన్ లైన్.కామ్ విశ్లేషణ మాత్రమే. దీనిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
Post Your Comment