నటీనటులు- ప్రభాస్, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, ప్రభాకర్ రెడ్డి తదితరులు, ఆర్ట్-సాబు శిరిల్, సినిమాటోగ్రఫీ- సెంథిల్‌కుమార్, మ్యూజిక్- యం.యం.కీరవాణి, ఎడిటింగ్- కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు- శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్, దర్శకత్వం- ఎస్.ఎస్.రాజ
టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా టాలీవుడ్ ఆడియెన్స్ ఎదరుచూస్తున్న సినిమా బాహుబలి. కేవలం తెలుగు సినిమా రంగమే కాదు. ఇండియన్ సినిమా కూడా బాహుబలి కోసం ఎదురుచూస్తుంది. నిజానికి నిన్న అంటే మే 31న విడుదల కావాల్సిన ఆడియో విడుదల వాయిదా పడింది. అయితే థియేట్రికల్ ట్రైలర్‌ను రాజమౌళి అండ్ టీమ్ ఈరోజున విడుదల చేశారు. ఈరోజు ఉదయం నుండి మల్టీప్లెక్స్‌లతో పాటు కొన్ని థియేటర్స్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ విడుదలై హంగామా చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే...
ఆర్కామీడియా బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మించగా, రాజమౌళి సినిమాని తెరకెక్కించాడు. టీజర్ కోట, కొండ ప్రాంతాల విజువల్స్ తో స్టార్టవుతుంది. ఒకావిడ చిన్న అబ్బాయికి పైకెళితే దెయ్యలు, భూతాలుంటాయి. అవి మనుషులను పీక్కు తినేస్తాయి అని చెబుతుంది. అయితే ఆ పిల్లవాడు ఆ కొండను ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుండి గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్ సాగుతుంది. నేనెప్పుడూ చూడని కళ్లు నన్ను దేవుడిలా చూస్తున్నాయి. నేనెవర్ని...
మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు..
జై మాహిష్మతి...
ఈ డైలాగ్స్ మాత్రమే మనకు వినపడతాయి. మిగతా ట్రైలర్ అంతా విజువల్ గ్రాండియర్‌తో నిండిపోయింది.
ట్రైలర్‌లో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్, అలాగే కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీ. సినిమా ట్రైలర్ రెండు నిమిషాల ఐదు సెకన్లు. ఎక్కువ భాగం యుద్ధ సన్నివేశాలతో నిండిపోయి ఉంది. రానా లుక్, సత్యరాజ్, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ ప్రతి ఒక్కరి లుక్ ఆకట్టుకునేలా ఉంది. డాల్బీ అట్మాస్‌లో ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకుడు ఉత్కంఠతకు లోనుకావడం ఖాయం.
Post Your Comment