నాగ చైతన్య, క్రుతిసనన్, బ్రహ్మానందం, పోసాని క్రిష్ణముురళి
డైరెక్టర్ : సుధీర్ వర్మ
ప్రొడ్యూసర్: బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం: సన్నీ
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకుంటూ మచిం విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నాగచైతన్య ఒక లైలా కోసం వంటి లవ్ స్టోరి తర్వాత చేస్తున్న సినిమాయే ‘దోచేయ్’.‘స్వామిరారా’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సుధీర్ వర్మ ఈ సినిమాని మరో డిఫరెంట్ క్రైం సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాల జంపాల’, ‘రౌడీ ఫెలో’ చిత్రాలకు సంగీతానందించిన సన్నీ ఎం.ఆర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ ట్రైలర్ లో సాంగ్స్ లో సన్నీ తన స్టయిల్ ను చూపించాడు. అల్రెడి నాలుగు సాంగ్స్ ను విడుదల చేసిన యూనిట్ ఇప్పుడు మిగిలిన పాటల్ని విడుదల చేశారు. దొరికింది దోచేయ్ దోచేయ్ అని బ్యాక్ డ్రాప్ లో సాగే సాంగ్ బావుంది.
ట్రైలర్ బ్రహ్మానందంతో స్టార్టవుతుంది. నాగార్జునకి ‘శివ’, పవన్ కి ‘ఖుషీ’, మహేష్ కి ‘పోకిరి’తరహాలో ఈ సినిమా మీకు హిట్ మూవీగా నిలుస్తుంది సార్... అని చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్టవుతుంది. అంటే ఈ సినిమాలో బ్రహ్మానందం హీరో రోల్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం పేరు బుల్లెట్ బాబు. నాగచైతన్య డిఫరెంట్ గా రగ్ డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మంచితనం చెప్పడానికి, వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది.. అనే డైలాగ్ తో నాగచైతన్య టోన్ వినపడుతుంది. అంటే ఇక్కడ చైతు రోల్ ను ఓ మోసగాడిలా ఉంటుందని డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా రివీల్ చేశాడు. పోసాని బాడీ లాంగ్వేజ్ కూడా కామెడి పండించే విలన్ గా కనపడుతుంది. పోసాని తన స్టయిల్ లో డైలాగ్స్ చెబుతూనే విలనీజం చూపించనున్నాడు. మొన్న ప్రేమిస్తానన్నావ్...నిన్నమో మోసగాడినన్నావ్..ఈరోజు కలిసి మోసంచేద్దామంటున్నావ్ అంటూ కృతిసనన్ చెప్పే డైలాగ్ తో హీరో హీరోయిన్స్ కలిసి ఓ క్రైమ్ చేస్తారని, సినిమా అంతా ఆ పాయింట్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది.
Post Your Comment